ప్రపంచంలో ఎక్కడ ఏ ఉగ్రదాడి జరిగినా దానికి ఇస్లాంతో ముడిపెడుతున్నారంటూ పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్ ఆవేదన వ్యక్తం చేశారు. పాశ్యాత్య దేశాలన్నీ ఇస్లాంనే తప్పుబడుతున్నాయని అన్నారు. మక్కాలో జరిగిన ఇస్లామిక్ కార్పొరేషన్ సదస్సులో ఇమ్రాన్ మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. నిజానికి ప్రపంచంలో ప్రతి దేశంలోనూ ఉగ్రవాదం ఉందని పేర్కొన్నారు. కానీ ఒక్క ఇస్లాంనే ఉగ్రవాదంతో ముడిపెడుతున్నారని అన్నారు. 9/11 ఉగ్రదాడికి ముందు 80 శాతం ఆత్మాహుతి దాడులన్నీ తమిళ్ టైగర్స్ ఎల్‌టీటీఈ చేసినవేనని, కానీ ఏ ఒక్కరూ హిందూ మతంతో వాటిని ముడిపెట్టలేదని, ఆ మతాన్ని నిందించలేదని పేర్కొన్నారు. అలాగే జపాన్‌లోని కమికేజ్ బాంబర్లు దాడులకు తెగబడుతున్నారని, కానీ ఏ ఒక్కరూ ఆ మతాన్ని తప్పుబట్టడం లేదని అన్నారు. కానీ ఒక్క ఇస్లాంను మాత్రమే ఉగ్రవాదంతో ముడిపెడుతున్నారని పేర్కొన్నారు. ఇస్లాంకు-ఉగ్రవాదానికి సంబంధం లేదని చెప్పి ప్రపంచాన్ని ఒప్పించడంలో ముస్లిం దేశాలు విఫలమయ్యాయని ఇమ్రాన్ పేర్కొన్నారు.
ఎందుకు ఎప్పుడూ మమ్మల్నే నిందిస్తారు?
Related tags :