కళ్లజోడు… తమ అందాన్ని తగ్గిస్తుందనుకుంటారు చాలామంది. అవి ఉండటం వల్ల తమకు మేకప్ నప్పదని భావిస్తారు. ఇలాంటప్పుడు కూడా చక్కగా కనిపించేందుకు కొన్ని చిట్కాలు ఉన్నాయి. అవేంటంటారా?
* కంటికి అద్దాలు పెట్టుకున్నప్పుడు కనుబొమలను పెన్సిల్‌తో కచ్చితంగా గీయండి. ముఖ్యంగా సన్నటి ఫ్రేమ్ వాడినప్పుడు కనుబొమల్ని పల్చగా, మందంగా ఉన్న ఫ్రేమ్‌ని పెట్టుకుంటే విల్లు ఆకృతిలో వాటిని తీర్చిదిద్దుకోండి. అప్పుడే ముఖం చక్కగా కనిపిస్తుంది.
* అద్దాల్లోంచి కళ్లు అందంగా కనిపించాలంటే…పెట్టుకునే లైనర్ కాస్త మందంగా ఉండాలి. కనురెప్పల గీత చుట్టూ కాకుండా అవుటర్ లైన్‌ని కూడా వేయాలి. అలానే న్యూడ్ రంగుల్లో ఆ గీతను ఆనుకుని మరో షేడెడ్ లైన్ గీయాలి. కళ్లు మూసి తెరుస్తున్నప్పుడు చక్కగా కనిపిస్తాయి.
* కళ్లద్దాలు వాడితే కళ్లు కాస్త చిన్నవిగా కనిపిస్తాయి. అలాకాకుండా అవి విప్పార్చినట్లు కనిపించాలంటే మస్కారా కచ్చితంగా వాడాలి. దాంతో పాటు ఐషాడో వేసుకోవడం వల్ల కళ్లు కాస్త విశాలంగా కనిపిస్తాయి. ఇందుకోసం ముదురు ఎరుపు, గ్రే వంటి రంగుల్లో షేడ్‌లను వాడితే బాగుంటుంది.
మంచి కళ్లద్దాలు మరింత వన్నె తెస్తాయి
Related tags :