Devotional

తితిదే ఛైర్మన్‌గా వైవీసుబ్బారెడ్డి

Y V Subbareddy to become the next TTD chairman

వైసిపి జగన్ ప్రభుత్వంలో ఓ వైపు మంత్రివర్గం ఏర్పాటుపై కసరత్తులు జరుగుతుంటే, మరోవైపు నామినేటెడ్ పదవులకు ఆశావహుల హడావుడి జోరుగాఉంది. రాష్ట్రంలోని అన్ని నామినేటెడ్ పడవుల్లోకెళ్లా అతి ముఖ్యమైన తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ పదవి అందరి ముఖ్యనేతల్లో ఆశలు రేపుతోంది. మొన్నటిదాకా టిటిడి చైర్మన్ పదవి సినీనటుడు మోహన్ బాబు పేరు వార్తల్లోకి రాగా, ఇప్పుడు వైసీపీలో మరో ముఖ్యనేత వైవీ సుబ్బారెడ్డి పేరు వార్తల్లోకి వచ్చింది.

ముఖ్యమంత్రి జగన్ తన బాబాయ్ వైవీ సుబ్బారెడ్డికి సముచిత స్థానం ఇవ్వాలని యోచిస్తున్నారు. ఒంగోలు ఎంపీ సీటును నిరాకరించిన జగన్ ఆయనకు టీటీడీ చైర్మన్ పదవిని ఇవ్వనున్న ట్టు సమాచారం.

కీలకమైన పదవిని ఇచ్చి రాష్ట్ర వ్యవహారాలకు వైవీ సుబ్బారెడ్డిని వాడుకోవాలని జగన్ ఆలోచిస్తున్నారు. అందులో భాగంగా తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలిని రద్దు చేయాలని సీఎం అనుకుంటున్నారు.

పాలక మండలిని రద్దు చేసి వైవీ సుబ్బారెడ్డిని టీటీడీ చైర్మన్ గా నియమించే ఆలోచనలో జగన్ ఉన్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

ప్రస్తుత టీటీడీ ఛైర్మన్‌ పుట్టా సుధాకర్‌ యాదవ్‌ రాజీనామా చేయడానికి నిరాకరిస్తున్నారు. కావాలంటే, ప్రభుత్వం పాలక మండలిని రద్దు చేసుకోవచ్చునని అన్నారు.

దీంతో పాలక మండలిని రద్దు చేసేందుకు జగన్ ప్రభుత్వం సిద్ధమైంది. మరో రెండు మూడు రోజుల్లో టిటిడీ పాలకమండలిని తొలగించే అవకాశాలున్నట్లు చెబుతున్నారు.