Devotional

తితిదే కళ్యాణమండపాలు ఆన్‌లైన్‌లో బుక్ చేసుకోవచ్చు

You can now book TTD Kalyana Mandapams via Online

*** ఆన్‌లైన్‌లో 259 టిటిడి కల్యాణమండపాల బుకింగ్‌ సదుపాయం

దేశవ్యాప్తంగా  వివిధ రాష్ట్రాలలో గల టిటిడి కల్యాణ మండపాలలో  259 క‌ల్యాణ మండ‌పాల‌ను ఆన్‌లైన్‌ ద్వారా బుక్‌ చేసుకునే సదుపాయాన్ని భక్తులకు టిటిడి అందుబాటులోకి తీసుకొచ్చింది. ttdsevaonline.comవెబ్‌సైట్‌లో టిటిడి కల్యాణమండపాలను బుక్‌ చేసుకోవచ్చు. ఇందులో ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని వివిధ జిల్లాల‌లో 215, తెలంగాణ‌లో 77, ఒడిశాలో 01, క‌ర్ణాట‌క‌లో 05, కేర‌ళ‌లో 01, త‌మిళ‌నాడులో 03 కల్యాణ మండ‌పాలు ఆన్‌లైన్‌లో అందుబాటులో  ఉన్నాయి. టిటిడి కల్యాణమండపాల్లో అత్యాధునిక వసతులు కల్పించి ఆన్‌లైన్‌లో బుక్ చేసుకునే సౌకర్యం టిటిడి క‌ల్పించింది. వివాహం, ఉపనయనం, నిశ్చితార్థం, నామకరణము (బారసాల), షష్టిపూర్తి, అన్నప్రాసన, సత్యనారాయణ వ్రతం, రిసెప్షన్‌ వంటి శుభకార్యాలకు టిటిడి కల్యాణమండపాలను బుక్‌ చేసుకోవచ్చు. ttdsevaonline.com   వెబ్‌సైట్‌లో తప్పనిసరిగా నమోదు చేసుకోవాలి. అనంతరం రాష్ట్రం, జిల్లా, సంబంధిత ప్రాంతాన్ని ఎంపిక చేసుకోవాలి. అక్కడ ఖాళీగా ఉన్న తేదీలను ఎంపిక చేసుకున్న తరువాత ఫొటోతోపాటు, ఆధార్‌కార్డు, రేషన్‌కార్డు, డ్రైవింగ్‌ లైసెన్స్‌లలో ఏదోఒకటి అప్‌లోడ్‌ చేయాలి. కల్యాణమండపాల స్థాయిని బట్టి నిర్దేశించిన రుసుమును ఆన్‌లైన్‌ ద్వారా చెల్లించాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియ పూర్తయిన తరువాత సంబంధిత వ్యక్తులకు, కల్యాణమండపం పర్యవేక్షణ అధికారికి ఎస్‌ఎంఎస్‌ వస్తుంది. ఈ ఎస్‌ఎంఎస్‌ను చూపి కల్యాణమండపంలో కార్యక్రమాలు నిర్వహించుకోవాల్సి ఉంటుంది.