*** కావలసినవి
బ్రెడ్ స్లైసులు: నాలుగు, గట్టి పెరుగు: ముప్పావుకప్పు, ఉప్పు: తగినంత, క్యారెట్, ఉల్లిపాయ, క్యాప్సికమ్ ముక్కలు (సన్నగా తరిగినవి): అరకప్పు, పచ్చిమిర్చి: ఒకటి, ఆవపొడి: పావుటీస్పూను, మిరియాలపొడి: పావుటీస్పూను, కొత్తిమీర తురుము: 2 టేబుల్‌స్పూన్లు, నూనె: టీస్పూను, వెన్న: 2 టీస్పూన్లు
*** తయారుచేసే విధానం
బ్రెడ్ స్లైసుల్ని వెన్నతో వేయించి తీసి ముక్కలుగా కోసి పక్కన ఉంచాలి. పెరుగు చాలా గట్టిగా ఉండేందుకు పలుచని బట్టలో వేసి నీళ్లన్నీ వడేయాలి. ఇప్పుడు ఓ గిన్నెలో కూరగాయల ముక్కలూ పెరుగూ అన్నీ వేసి బాగా కలపాలి. తరవాత ఈ మిశ్రమాన్ని బ్రెడ్ ముక్కల మధ్యలో పెట్టి గట్టిగా నొక్కి అందించాలి.