DailyDose

చైనాలో రెడ్డీస్ పాగా-వాణిజ్య-06/03

June 03 2019 - Daily Business News In Telugu - Dr.Reddys Labs To Enter Chinese Market

*గత నెలలో హ్యుందాయ్‌ మోటార్‌ ఇండియా దేశీయ అమ్మకాలు 42,502 వాహనాలుగా నమోదయ్యాయి. గతేడాది మేలో కంపెనీ విక్రయించిన 45,008 వాహనాలతో పోలిస్తే ఇవి 5.6 శాతం తక్కువ. మొత్తం అమ్మకాలు (దేశీయం, ఎగుమతులు కలిపి) మాత్రం 5.5 శాతం పెరిగాయి.
*మేలో హీరో మోటోకార్ప్‌ మొత్తం 6,52,028 వాహనాలను విక్రయించింది. గత ఏడాది ఇదే నెలలో కంపెనీ విక్రయించిన 5,74,366తో పోలిస్తే ఇవి 13.5 శాతం ఎక్కువ.
*విదేశీ పోర్ట్‌ఫోలియో మదుపర్లు (ఎఫ్‌పీఐలు) దేశీయ కేపిటల్‌ మార్కెట్లపై ఆసక్తి ప్రదర్శిస్తున్నారు. వరుసగా నాలుగో నెలలో కూడా వారు నికర కొనుగోలుదారులుగా నిలిచారు.
*ప్రభుత్వ రంగంలోని బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా (బీఓబీ) 2019-20 ఆర్థిక సంవత్సరంలో షేర్ల విక్రయం ద్వారా రూ.11,900 కోట్ల నిధుల్ని సమీకరించాలని ప్రతిపాదనలు సిద్ధం చేసింది.
*పైలట్లు, క్యాబిన్‌ సిబ్బంది సహా జెట్‌ ఎయిర్‌వేస్‌ నుంచి దాదాపు 2,000 మందికి తమ సంస్థలో అవకాశం కల్పిస్తున్నామని స్పైస్‌జెట్‌ ఛైర్మన్‌, మేనేజింగ్‌ డైరెక్టర్‌ (సీఎండీ) అజయ్‌ సింగ్‌ వెల్లడించారు.
*భారత ఔషధ దిగుమతులపై చైనాలో నియంత్రణ మార్పులు క్రమబద్ధీకరించిన నేపథ్యంలో రాబోయే కొన్నేళ్లలో 70 ఉత్పత్తుల్ని అక్కడ విడుదల చేసేందుకు డాక్టర్‌ రెడ్డీస్‌ ల్యాబొరేటరీస్‌ సిద్ధమవుతోంది.