కరీనా కపూర్ ఏళ్ల తరబడి ప్రేక్షకుల్ని అలరిస్తుందంటే కారణం ఆమె ఎంచుకునే పాత్రలే. మాస్ ప్రేక్షకుల్ని మెప్పించే కమర్షియల్ పాత్రల్లోనే కాదు.. సామాజిక అంశాల నేపథ్యంలో సాగే చిత్రాల్లోనూ ఆమె తనేంటో నిరూపించుకుంది. ‘ఉడ్తా పంజాబ్’, ‘కీ అండ్ క’, ‘వీరె ది వెడ్డింగ్’ చిత్రాల్లో వైవిధ్యమైన నటనతో ప్రేక్షకులకు మరింత దగ్గరైంది కరీనా. ప్రస్తుతం ఆమె నటిస్తున్న ‘గుడ్ న్యూస్’, ‘అంగ్రేజీ మీడియం’ కూడా సామాజిక నేపథ్యంతో సాగే చిత్రాలే. ఈ తరహా చిత్రాల కోసం తను మరింత కష్టపడాతనంటోంది కరీనా. ‘‘సామాజిక నేపథ్య చిత్రాలు, మనసుని కదిలించే కథాంశాలు ఉన్న చిత్రాల్లో నటించేటప్పుడు మరింత ఏకాగ్రతతో పనిచేస్తాను. అలాంటి చిత్రాల్లో చిన్న పాత్రైనా సరే కష్టపడతాను. బలమైన కథ ఉంటేనే ప్రేక్షకులు ఆదరిస్తున్న రోజులవి. ‘గుడ్ న్యూస్’ బాగా వచ్చింది. అక్షయ్‌కుమార్ ఈ చిత్రానికి మరింత బలం’’అంది కరీనా.
కొంచెం ఎక్కువ కష్టం
Related tags :