లండన్ లో తెలంగాణా రాష్ట్ర ఆవతరణ దినోత్సవ సంబురాలు ఘనంగా జరిగాయి. లండన్ లో ఎన్నారై టిఆర్ఎస్ సెల్ యూకే అధ్వర్యంలో రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు నిర్వహించారు. ఎన్నారై టీఆర్ ఎస్ సెల్ యూకే సంయుక్త కార్యదర్శి సురేష్ గోపతి అధ్యక్షతన ఈ వేడుకలు జరిగాయి. వేడుకల్లో భాగంగా ముందుగా తెలంగాణ సిద్ధాంత కర్త జయశంకర్ చిత్ర పటానికి పూలతో నివాళుర్పించారు. అమరవీరులను స్మరించుకొని రెండు నిమిషాలు మౌనం పాటించిన అనంతరం కేక్ ను కట్ చేశారు.
లండన్ ఎన్నారై తెరాస ఆధ్వర్యంలో అవతరణ వేడుకలు
Related tags :