NRI-NRT

బే-ఏరియాలో అన్నమయ్యకు సిలికానాంధ్ర ఘన నీరాజనం

Siliconandhra pays grand tribute to Annamayya via his jayanthi utsavam

సిలికానాంధ్ర అన్నమయ్య 611వ జయంతి ఉత్సవం మిల్పిటాస్ లోని సిలికానాంధ్ర విశ్వవిద్యాలయ ప్రాంగణంలో 3రోజులపాటు అత్యంత వైభవంగా జరిగినాయి. మొదటిరోజు శ్రీదేవి భూదేవి సమేత వేంకటేశ్వర స్వామి ఉత్సవ విగ్రహాలతో రథోత్సవంతో ప్రారంభమైన ఈ ఉత్సవంలో భాగంగా జరిగిన సప్తగిరి సంకీర్తనల గోష్టిగానంలో 800 మందికి పైగా గాయనీ గాయకులు పాల్గొన్నారు. అన్నమాచార్య రచించిన 108 కీర్తనలతో నిర్వహించిన అష్టోత్తర శత సంకీర్తనల కార్యక్రమంలో వివిధ నగరాలనుండి వచ్చిన వందలాది కళాకారులు ఆలపించిన అన్నమయ్య కీర్తనలతో ప్రాంగణమంతా ఆధ్యాత్మిక వాతావరణం నెలకొన్నది. ముఖ్య అతిథి గా విచ్చేసిన డా. లకిరెడ్డి హనిమిరెడ్డి గారి చేతులమీదుగా సుజనరంజని ప్రత్యేక సంచిక ఆవిష్కరణ జరిగింది. ఈ సంచికలో ప్రముఖ రచయితలు అన్నమయ్య కీర్తనల గురించి వ్రాసిన అమూల్యమైన రచనలు పొందుపరచడం జరిగినది. రెండవరోజు ఉదయం నుండి సాయంత్రం వరకు జరిగిన అన్నమయ్య సంగీత పోటీలు 3వరోజు జరిగిన నృత్య పోటీల తో పాటు 3 రోజులు సాయంత్రం వేళల్లో జరిగిన ప్రముఖ కళాకారులు గరిమెళ్ళ అనిల్ కుమార్, శ్రీలక్ష్మి కోలవెన్ను, గాయత్రి అవ్వారి, జోస్యుల సూర్యనారయణ గార్ల ప్రదర్శనలు ప్రేక్షకులను తన్మయులను చేసినాయి. ఈ 3 రోజుల ఉత్సవాలలో దాదాపు 2000 మందికి పైగా ప్రేక్షకులు పాల్గొని అన్నమయ్యకు స్వర నివాళి అందించారు.