శ్రీవారిని దర్శించుకోవడానికి తిరుమల వెళ్తున్నారా? తిరుమలలో గది దొరుకుతుందో లేదో.. దర్శనం జరుగుతుందో లేదో.. అని టెన్షన్ పడుతున్నారా?
భక్తులు ఇలాంటి ఇబ్బందులు పడకూడదనే టీటీడీ ఆధునిక సాంకేతికను వినియోగించుకుంటున్నది.
తిరుమల భక్తుల సౌకర్యార్థం టీటీడీ ప్రత్యేకంగా గోవింద యాప్ (Govinda App)ను రూపొందించింది.
రెండేండ్ల క్రితమే అందుబాటులోకి వచ్చిన ఈ యాప్.. గూగుల్ ప్లేస్టోర్‌లో ఉన్నది.
ఇటీవలే ఐఫోన్ యూజర్లకు చెంతకు వచ్చింది. ఇప్పటికే ఐదు లక్షల మందికిపైగా ఈ యాప్ సేవలను ఉపయోగించుకుంటున్నారు.
తిరుమల వెళ్లాలనుకొనే భక్తులు ఈ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకుంటే చాలా ఉపయోగకరంగా ఉంటుంది.
గదుల దగ్గర నుంచి దర్శనం, ఆర్జిత సేవాటికెట్లు ఈ యాప్‌లో పొందవచ్చు.
గోవింద యాప్‌లో మీరు ఏ సేవలు పొందాలనుకున్నా ముందుగా రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది.