ఐఐటీల వంటి అత్యున్నత విద్యాసంస్థల్లో విద్యనభ్యసించే విద్యార్థులకు ఫీజు రాయితీని నేరుగా వారి ఖాతాల్లోకే జమచేయాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తోంది.
ఈ విషయంలో విద్యార్థులు, విద్యా సంస్థలకు సహాయపడేందుకు ‘నేషనల్ క్రౌడ్ ఫండింగ్ ప్లాట్‌ఫాం’ను ఏర్పాటు చేయాలని భావిస్తోంది.
మరోవైపు ‘ప్రతి ఒక్కరు- ఒకరికి బోధించడం’ పేరిట దేశవ్యాప్తంగా ఉద్యమంలా ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించాలని, ఒక్కో కుటుంబం కనీసం ఒక విద్యార్థికి అండగా నిలిచేలా చూడాలన్న ప్రతిపాదనను కూడా పరిశీలిస్తోంది.
జాతీయ డిజిటల్ ప్లాట్‌ఫాం ద్వారా ఈ విరాళాల సేకరణ కార్యక్రమాన్ని నిర్వహించాలని భావిస్తున్నారు.
ఈ కార్యక్రమం ద్వారా రూ.25 వేల కోట్లు సేకరించాలని, తద్వారా 10లక్షలమంది విద్యార్థులకు అండగా ఉండాలని యోచిస్తోంది.
కేంద్ర మానవ వనరుల అభివద్ధి శాఖ (హెచ్‌ఆర్‌డీ) ఏర్పాటు చేసిన 10మంది నిపుణుల కమిటీ ఈ ప్రతిపాదనలను రూపొందించింది.
ఉన్నత విద్యను సంస్కరించేందుకు గాను హెచ్‌ఆర్‌డీ ‘విద్యా నాణ్యత అప్‌గ్రెడేషన్, చేరిక కార్యక్రమం (ఎక్వి్‌ప-ఈక్యూయూఐపీ)’ను ఐదేళ్ల ప్రాజెక్టుగా అమలు చేయాలని నిర్ణయించింది.
ఎక్వి్‌పకు ఓ రూపు తెచ్చేందుకు నిపుణుల కమిటీని నియమించింది.
ఎక్విప్ ప్రాజెక్టును ప్రభుత్వం ఏర్పాటు చేసిన 100 రోజుల్లోపే కేబినెట్‌లో ఉంచి అమలు చేయాలని ప్రధానమంత్రి కార్యాలయం యోచిస్తున్నట్లు సమాచారం