DailyDose

మార్కెట్ లో బంగారం, వెండి ధరలు-వాణిజ్య-06/04

June 04 2019 - Daily Business News-Bullion prices in India today

*వివిధ మార్కెట్లలో సోమవారం బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర హైదరాబాదులో రూ.32,390, ప్రొద్దుటూరులో రూ.33,150, చెన్నైలో రూ.32,260గా ఉంది. ఇక 22 క్యారెట్ల ఆభరణాల బంగారం 10 గ్రాముల ధర హైదరాబాదులో రూ.30,830, ప్రొద్దుటూరులో రూ.30,700, చెన్నైలో రూ.30,760గా ఉంది. వెండి కిలో ధర హైదరాబాదులో రూ.36,500, ప్రొద్దుటూరులో రూ.37,600, చెన్నైలో రూ.39,400 వద్ద ముగిసింది.
* హెచ్‌పీసీఎల్‌, ఐవోసీపై కేసులు.. షేర్ల పతనం
చమురు రంగ దిగ్గజాలు ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌(ఐవోసీ), హిందూస్థాన్‌ పెట్రోలియం కార్పొరేషన్‌(హెచ్‌పీసీఎల్‌)లు ఎక్సైజ్‌ సుంకం ఎగవేసినట్లు జీఎస్‌టీ ఇంటెలిజెన్స్‌ డైరెక్టర్‌ జనరల్‌ కేసులు నమోదు చేశారు. దీంతో నేడు ఇంట్రాడేలో హెచ్‌పీసీఎల్‌, ఐవోసీ షేర్లు పతనమయ్యాయి. ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌ ఇథనాల్‌ కలిపిన మోటార్‌ స్పిరిట్‌ విక్రయాల్లో మొత్తం రూ.4,000 కోట్ల మేరకు ఎక్సైజ్‌ డ్యూటీని ఎగవేసినట్లు డీజీ జీఎస్‌టీ (పుణె)కేసు రిజిస్టర్‌ చేసింది.
*కియా మోటార్స్‌ ఆధ్వర్యంలో మధ్య శ్రేణి కోసం భారత్‌ మార్కెట్లో ప్రత్యేకంగా విడుదల చేసే స్పోర్ట్‌ యుటిలిటీ వెహికల్‌ (మిడ్‌ ఎస్‌యూవీ) పేరును ‘సెల్టస్‌’గా ఖరారు చేశారు.
*నకిలీ సర్టిఫికెట్లు, వాణిజ్య లేబుళ్లు, వివిధ రకాల పత్రాల ఫోర్జరీని నివారించి, అవి అసలైనవా, కావా నిర్ధారించేందుకు ‘అస్లీస్టాంప్‌’ పేరుతో ఒక డి-యాప్‌ను హైదరాబాద్‌ కేంద్రంగా పనిచేస్తున్న జోరియం బ్లాక్‌చైన్‌ ల్యాబ్స్‌ ఆవిష్కరించింది.
*కొత్త తరం సాంకేతికత పరిజ్ఞానం పెరుగుతున్న నేపథ్యంలో పనిగంటలు అనువుగా ఉండాలని 60 శాతం మంది మిలీనియల్స్‌ కోరుకుంటున్నారట.
* ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో తొలి విడత సార్వభౌమ పసిడి బాండ్లు అందుబాటులోకి వచ్చాయి. ఇవి జూన్‌ 7 వరకూ అందుబాటులో ఉంటాయి.
*అబుదాబిలో నివాసముంటున్న భారత రిటైల్‌ దిగ్గజం ఎమ్‌.ఎ. యూసఫ్‌ అలి అరుదైన గౌరవం దక్కించుకున్నారు. యూఈఏ నుంచి తొలి ‘గోల్డ్‌ కార్డ్‌’ పొందారు. శాశ్వత నివాస హోదాను ఇది సూచిస్తుంది.
*గ్రానైట్‌, ఇంజినీర్డ్‌ స్టోన్‌ విభాగాల్లో కార్యకలాపాలు సాగిస్తున్న పోకర్ణ లిమిటెడ్‌ హైదరాబాద్‌ శివార్లలో కొత్తగా నిర్మిస్తున్న యూనిట్‌ వచ్చే ఏడాది నాటికి సిద్ధం కానుంది.
*డిజిటల్‌ చెల్లింపుల ప్రోత్సాహానికి నందన్‌ నీలేకని నేతృత్వంలోని కమిటీ పలు సిఫారసులు చేసింది. ఛార్జీలను ఎత్తివేయడం, ఎల్లవేళలా ఆర్‌టీజీఎస్‌, నెఫ్ట్‌ సదుపాయం అందుబాటులో ఉండేలా చూడటం, పాయింట్‌ ఆఫ్‌ సేల్‌ (పీఓఎస్‌) యంత్రాల దిగుమతులపై సుంకాల తొలగింపు లాంటివి ఇందులో కొన్ని. ఈ సిఫారసులతో కూడిన నివేదికను గత నెలలో ఆర్‌బీఐ గవర్నరు శక్తికాంత దాస్‌కు కమిటీ అందజేసింది.
*ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో పది లక్షల ద్విచక్ర వాహనాలను విక్రయించాలని సుజుకి మోటార్‌సైకిల్‌ ఇండియా లక్ష్యంగా విధించుకుంది.
*రుణభారంతో దివాలా బాట పట్టిన డెక్కన్‌ క్రానికల్‌ హోల్డింగ్‌ లిమిటెడ్‌ (డీసీహెచ్‌ఎల్‌) యాజమాన్యం చేతులు మారింది.
*ఈ ఏడాదిలో 5జీ, ఇతర ఫ్రీక్వెన్సీలకు మెగా స్పెక్ట్రమ్‌ వేలం నిర్వహించనున్నట్లు టెలికాం మంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌ వెల్లడించారు.