కావల్సినవి: గోధుమపిండి – ఒక కప్పు, నూనె – పావుకప్పు, క్రీం చీజ్ – ఒక చిన్న డబ్బా, మిరియాలపొడి, కారం – అరచెంచా చొప్పున ఉప్పు – తగినంత, అల్లంవెల్లుల్లి ముద్ద – చెంచా, క్యారెట్ తురుము – పావుకప్పు, కొత్తిమీర తరుగు – రెండు పెద్ద చెంచాలు, జీలకర్ర – చెంచా, నువ్వులు – అరచెంచా.
తయారీ: నూనె, క్రీంచీజ్ తప్ప మిగిలిన పదార్థాలన్నీ ఓ గిన్నెలో తీసుకుని బాగా కలపాలి. తరువాత నీళ్లు పోస్తూ చపాతీపిండిలా చేసుకోవాలి. ఇది పదినిమిషాలు నానాక మరోసారి కలిపి ఓ ఉండను తీసుకుని చపాతీలా వత్తుకోవాలి. దీన్ని వేడిపెనంమీద వేసి రెండువైపులా నూనె వేసుకుని కాల్చుకుని తీసుకోవాలి. ఇప్పుడు క్రీంచీజ్ రాయాలి. ఇలాగే మిగిలిన పిండిని కూడా చేసుకుంటే చాలు. కావాలనుకుంటే ఈ చపాతీని నచ్చిన ఆకృతిలో చేసుకోవచ్చు.