తమిళ పాఠాలు నేర్చుకుంటున్నారు హీరోయిన్ అమైరా దస్తూర్. హిందీలో ‘మెంటల్ హై క్యా’ సినిమా షూటింగ్‌ను కంప్లీట్ చేసి ‘మేడిన్ చైనా, ప్రస్థానం’ (తెలుగు ‘ప్రస్థానం’ హిందీ రీమేక్) సినిమాలతో బిజీగా ఉన్న ఈ బ్యూటీ ప్రస్తుతం తమిళం నేర్చుకోవడానికి కారణం ఉంది. అధిక్ రవిచందర్ దర్శకత్వంలో ప్రభుదేవా నటించనున్న ఓ సైకలాజికల్ థ్రిల్లర్ మూవీలో నటించనున్నారట అమైరా. ఈ సినిమాలో సొంత డబ్బింగ్ చెప్పుకోవాలని డిసైడ్ అయ్యారట. అందుకే తమిళం నేర్చుకుంటున్నారు.‘‘సైకలాజికల్ థ్రిల్లర్ సినిమాల్లో సొంత డబ్బింగ్ చెప్పుకోవడం వల్ల వెండితెరపై ఎక్స్‌ప్రెషన్స్, ఎమోషన్స్ పర్‌ఫెక్ట్‌గా రిప్లెక్ట్ అవుతాయి. అలాగే మన పెర్ఫార్మెన్స్‌లోనూ తేడా కనిపిస్తుంది. సినిమా ప్రమోషన్ టైమ్‌లోనూ నాకు బాగా హెల్ప్ అవుతుంది. ఎవరైనా తమిళంలో ఏదైనా చెప్పినప్పుడు పక్కవారిని ట్రాన్స్‌లేట్ చేయమనే బాధ కూడా పోతుంది. నటిగా నన్ను నేను మెరుగుపరుచుకోవడానికి ఇదొక స్మాల్ స్టెప్‌గా భావిస్తున్నాను’’ అని అమైరా చెప్పుకొచ్చారు. ఇంతకుముందు తమిళంలో ‘అనేగన్’ చిత్రంలో ధనుష్ సరసన నటించారామె.
అమైరా అరవ అభ్యాసం
Related tags :