DailyDose

ఏపీ స్పీకర్‌గా అప్పలనాయుడు-తాజావార్తలు-06/05

June 05 2019 - Daily Breaking News-Applanaidu to be Andhras Protem Speaker

* ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు ఈనెల 12నుంచి ప్రారంభం కానున్నాయి. అంతకన్నా ముందే ప్రోటెం స్పీకర్ గా బొబ్బిలి వైకాపా ఎమ్మెల్యే సంబంగి వెంకట చినఅప్పలనాయుడుని నియమించే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. ఇందుకు సంబందించిన ఏర్పాటు జరుగుతున్నాయి. పన్నెండున అసెంబ్లీ ప్రారంభమైన తరువాత కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలతో ప్రోటెం స్పీకర్ ప్రమాణస్వీకారం చేయించనున్నారు. ఆ తరువాత స్పీకర్ ఎన్నిక జరుగుతుంది. ఇక అంతకుముందే మంత్రివర్గం కూడా ఏర్పాటు కానుందని పార్టీ నేతలు అంటున్నారు. ఆపై ప్రస్తుత ఆర్ధిక సంవత్సరంలో మిగిలి ఉన్న తొమ్మిది నెలల కాలానికి కొత్తగా బాద్యతలు స్వీకరించే ఆర్ధిక మంత్రి బడ్జెట్ను సమర్పిస్తారు. ఇక తోలి సమావేశాల్లోనే బడ్జెట్ ఉంటుందా? లేదా కొన్ని రోజులు విరామం తడువత ప్రతిపాదనలు సభ ముందుకు వస్తాయా? అనే విషయమై స్పస్థత రావాల్సి ఉంది.
*జూన్‌ 8న ప్రారంభం కానున్న జీ-20 దేశాల ఆర్థిక మంత్రులు, సెంట్రల్ బ్యాంక్‌ గవర్నర్ల సమావేశంలో భారత్‌ తరఫున ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ పాల్గొననున్నారు. జపాన్‌లోని ఫకువొకా నగరంలో ఈ సదస్సు జరగనుంది. గతవారం బాధ్యతలు స్వీకరించిన సీతారామన్‌కు ఇది తొలి విదేశీ పర్యటన కావడం విశేషం. ఆమెతో పాటు ఆర్బీఐ గవర్నర్‌ శక్తికాంతదాస్‌ కూడా హాజరయ్యే అవకాశం ఉన్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.
*చాహల్ మరోసారి సత్తా చాటాడు. 20వ ఓవర్ తోలి బంతికి దసేన్ ను అవుట్ చేసిన చాహల్ చివరి బంతికి ప్రోటీన్ సారధి దూప్లేసేస్ ను బౌల్డ్ చేశాడు. కొంతసేపు నిలకడగా ఆడిన ద్లూపెసిస్ డాసన్ జోడీని చాహల్ వెనక్కి పంపాడు.
* లండన్‌ పర్యటనలో ఉన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ కు వ్యతిరేకంగా కొందరు ఆందోళనకారులు నిరసనకు దిగారు. వీరికి వ్యతిరేకంగా ట్రంప్‌ కు మద్దతుగా కొంతమంది ఆందోళనకు దిగడంతో ఉద్రిక్తత నెలకొంది. ‘ వి లవ్‌ యు ట్రంప్‌ ‘ అనే పేరుతో ట్రంప్‌ మద్దతుదారులు సెంట్రల్‌ లండన్‌లోని పార్లమెంట్‌ ప్రాంగణానికి చేరితే, ట్రంప్‌ ను వ్యతిరేకిస్తూ మరో వర్గం ఆందోళన చేపట్టింది. ఇరు వర్గాల మధ్య ఘర్షణ వాతావరణం ఏర్పడింది.
* తిరుమల పర్యటనలో ఉన్న భారత ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు షాకింగ్‌ కామెంట్స్‌ చేశారు. ప్రముఖులు తిరుమల శ్రీవారిని ఏడాదికి ఒక్కసారే మాత్రమే దర్శించుకోవాలన్నారు. సామాన్యు భక్తులకు ఇబ్బంది లేకుండా చూసుకోవాలని సూచించారు.మంగళవారం కుటుంబసమేతంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు. సంప్రాదాయ దస్తులు ధరించి వైకుంఠం 1 క్యూ కాంప్లెక్స్‌ ద్వారా ఆలయ ప్రవేశం చేశారు. ఆలయ మహాద్వారం వద్ద ఆయనకు అర్చకులు స్వాగతం పలికారు.
*తెలుగు రాష్ట్రాల్లో రంజాన్‌ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. నెల రోజుల పాటు కఠోర ఉపవాసం పాటించిన ముస్లింలు మంగళవారం రాత్రి నెలవంక దర్శనంతో ఉపవాసాలు విరమించారు. మసీదులు, ఈద్గాల వద్ద ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. రంజాన్‌ పర్వదినాన్ని పురస్కరించుకుని మసీదులు, ఈద్గాల వద్ద సందడి వాతావరణం నెలకొంది. ముస్లింలు అంతా సంతోషంగా ఒక చోటుకు వచ్చి ఈద్‌-ఉల్‌-ఫితర్‌ జరపుకొంటున్నారు.
* పియాజియో ఇండియా మార్కెట్లోకి సరికొత్త వెస్పా అర్బన్‌ క్లబ్‌ను విడుదల చేసింది. 125సీసీ ఇంజిన్‌ సామర్థ్యం ఉన్న ఈ స్కూటర్‌ దిల్లీ ఎక్స్‌షోరూమ్‌లో ప్రారంభ ధర రూ.73,733 గా నిర్ణయించారు. ప్రస్తుతం దేశంలో అతితక్కువ ధరకు లభిస్తున్న వెస్పా స్కూటర్‌ ఇదే.
*సీఎం జగన్ మోహన్ రెడ్డితో ముగిసిన డిజిపి గౌతమ్ సవాంగ్ భేటి.రెండు గంటల పాటు సుదీర్ఘంగా సాగిన సమావేశం.ఐపీఎస్ ల బదీలీలపై కొనసాగిన చర్చ.సీఎం జగన్ తో సమావేశం ముగిసిన తరువాత అజయ్ కళ్ళంతో భేటి అయిన డిజిపి గౌతమ్ సవాంగ్.
* జాతీయ అర్హత ప్రవేశ పరీక్ష (నీట్‌) ఫలితాలు బుధవారం విడుదల అయ్యాయి. ఫలితాలను నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ (ఎన్‌టీఏ) విడుదల చేసింది.
*గూగుల్‌ మ్యాప్స్‌ వినియోగదారులు ఇక బస్సులు, రైళ్లకు సంబంధించిన కచ్చితమైన సమాచారాన్ని ఎప్పటికప్పుడు (లైవ్‌ ట్రాఫిక్‌) తెలుసుకోవచ్చు.
*ప్రపంచకప్‌ ఆరంభమై రోజులు గడుస్తున్నాయి.. ఇంకా మన జట్టు బరిలో దిగదే అని ఆత్రంగా ఎదురు చూస్తున్న కోట్లాది అభిమానుల నిరీక్షణకు తెర దించే గడియ వచ్చేసింది.
*ఇంటర్‌ ఫలితాలు వెలువడిన తర్వాత జవాబుపత్రాల పునఃపరిశీలనతో ఇప్పటివరకు 1,155 మంది ఉత్తీర్ణులయ్యారని ఇంటర్‌బోర్డు కార్యదర్శి ఎ.అశోక్‌ స్పష్టంచేశారు.
*జెక్టుల సందర్శనలో భాగంగా మంగళవారం జయశంకర్‌ జిల్లాలోని మేడిగడ్డ బ్యారేజీకి చేరుకున్న ముఖ్యమంత్రి కేసీఆర్‌ మండుటెండను సైతం లెక్కచేయకుండా మట్టి రోడ్డులో పయనిస్తూ ప్రాజెక్టు పనులను నిశితంగా పరిశీలించారు.
*ప్రముఖ సినీ నేపథ్యగాయకుడు, పద్మభూషణ్‌ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పేరుతో ఆయనే స్వయంగా ప్రదానం చేసే జాతీయ పురస్కారాలను సినీ రంగం నుంచి ప్రముఖ సినీ నటుడు చంద్రమోహన్‌కు, సేవా రంగం నుంచి ముంబయికి చెందిన ఆబిద్‌సూర్తికి ప్రదానం చేశారు.
*శాసనసభ్యుల కోటాలో తెరాస ఎమ్మెల్సీగా నవీన్‌రావు ఏకగ్రీవంగా ఎన్నికైన సందర్భంగా ఆయన మిత్ర బృందం ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ. కోటి లక్షా యాభై వేల విరాళాన్ని ఇచ్చారు.
*రాష్ట్రవ్యాప్తంగా బుధ, గురువారాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులు, గాలులతో ఒక మాదిరి వర్షాలు పడే అవకాశాలున్నాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం అధికారి రాజారావు తెలిపారు.
*ప్లాట్‌ నిమిత్తం చెల్లించిన సొమ్మును ఫిర్యాదుదారులకు 9 శాతం వడ్డీతో చెల్లించడంతోపాటు మానసిక వేదనకు గురి చేసినందున పరిహారంగా రూ.లక్ష చొప్పున, ఖర్చుల కింద రూ. 5 వేలు చొప్పున చెల్లించాలంటూ నార్నె కన్‌స్ట్రక్షన్స్‌కు రాష్ట్ర వినియోగదారుల కమిషన్‌ ఆదేశాలు జారీ చేసింది.
*రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌తో తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్‌ నరసింహన్‌ భేటీ అయ్యారు. రక్షణ శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన రాజ్‌నాథ్‌ను మంగళవారం నరసింహన్‌ మర్యాదపూర్వకంగా కలిసి అభినందించారు.
*ఎంసెట్‌, ఈసెట్‌ ప్రవేశాల కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ను ఖరారు చేసేందుకు ప్రవేశాల కమిటీ సమావేశం కానుంది. ఈసెట్‌కు 7న, ఎంసెట్‌కు 8న సమావేశాలు నిర్వహించనున్నారు.
* రంజాన్‌ పర్వదినాన్ని పురస్కరించుకొని 6.1 లక్షల లీటర్ల పాలు విక్రయించేందుకు విజయ డెయిరీ సిద్ధమైంది.
*తెలంగాణ ప్రభుత్వం 2014-19 పారిశ్రామిక విధానాన్ని పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు ఈ విధానాన్ని కొనసాగించాలని సూచించింది.
*సౌదీ ఆరేబియాలోని రియాద్‌లో ఇబ్బందులు పడుతున్న 56 మంది తెలంగాణ ప్రవాస కార్మికులను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకుంది.
*ముఖ్యమంత్రి జగన్‌కు ముఖ్య సలహాదారుగా ఏపీ ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి అజేయ కల్లం నియమితులయ్యారు. ఆయనకు కేబినెట్‌ మంత్రి హోదాను కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది.
*కేంద్ర వాణిజ్య శాఖ ఆధ్వర్యంలో ఈ నెల 6న దిల్లీలో నిర్వహించనున్న వాణిజ్యాభివృద్ధి ప్రోత్సాహక మండలి సమావేశానికి రాష్ట్రం నుంచి పరిశ్రమల శాఖ మంత్రి, అధికారులను పంపాలని కేంద్రం కోరింది.
* రాష్ట్ర హోంశాఖ సలహాదారు కోడె దుర్గాప్రసాద్‌ రాజీనామాను ఆమోదిస్తూ ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. మే 28న ఆయన తన పదవికి రాజీనామా చేశారు.
* వివిధ మార్కెట్లలో మంగళవారం బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర హైదరాబాదులో రూ.32,370, ప్రొద్దుటూరులో రూ.33,300, చెన్నైలో రూ.32,500గా ఉంది. ఇక 22 క్యారెట్ల ఆభరణాల బంగారం 10 గ్రాముల ధర హైదరాదులో రూ.30,820, ప్రొద్దుటూరులో రూ.30,800, చెన్నైలో రూ.30,970గా ఉంది. వెండి కిలో ధర హైదరాబాదులో రూ.36,700, ప్రొద్దుటూరులో రూ.37,700, చెన్నైలో రూ.39,600 వద్ద ముగిసింది.