*భారతీ ఎయిర్‌టెల్ అనుబంధ సంస్థ ఎయిర్‌టెల్ ఆఫ్రికా 750 మిలియన్ డాలర్ల (సుమారు రూ.5,189 కోట్లు) నిధుల సమీకరణ కోసం భారీ ఐపీఓకు సిద్ధమవుతోంది.
* పునరుత్పాదకత ఇంధన సంస్థ గ్రీన్‌కో, ఎనర్జీ హోల్డింగ్స్ జీఐసీ, అబుదాబీ ఇన్వెస్ట్‌మెంట్ అథారిటీల నుంచి 49.5 కోట్ల డాలర్ల (సుమారు రూ.3,500 కోట్లు) ఈక్విటీ పెట్టుబడుల కోసం ఒప్పందాన్ని కుదుర్చుకుంది.
*రైల్వే స్టేషన్ల పునర్నిర్మాణ కార్యకలాపాల్లోకి అదానీ ఎంటర్‌ప్రైజెస్ అడుగుపెట్టనున్నట్లు తెలుస్తోంది.
*దేశంలోనే అతి పొడవైన రూ.9,000 కోట్ల ఎల్‌పీజీ పైప్‌లైన్ ప్రాజెక్టు నిర్మాణానికి ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐఓసీ) శ్రీకారం చుట్టింది.
*ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో (2019-20) 10-12% రుణాల వృద్ధిని సాధించాలని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) లక్ష్యంగా పెట్టుకుంది.
* అమెరికాలో ఔషధ విక్రేతల ఏకీకరణ భవిష్యత్తులోనూ కొనసాగే అవకాశం ఉండటంతో ఫార్మా కంపెనీలు తమ ఉత్పత్తుల ధరలపై ఒత్తిడిని ఎదుర్కొనే అవకాశం ఉందని డాక్టర్ రెడ్డీస్ వెల్లడించింది. ఈ ప్రభావం తనపై కూడా ఉంటుందని పేర్కొంది.
*లార్సన్ అండ్ టుబ్రో (ఎల్‌అండ్‌టీ) గ్రూపు ఛైర్మన్ ఏ.ఎం.నాయక్ ప్రారôభించిన నిరాళి మెమోరియల్ మెడికల్ ట్రస్టు గుజరాత్‌లో నిర్మించబోతున్న ఆసుపత్రి నిర్వహణ బాధ్యతను అపోలో హాస్పిటల్స్ చేపట్టనుంది.
* హైదరాబాద్‌కు చెందిన ఫార్చూన్ పెయింట్స్ దేశవ్యాప్తంగా విస్తరించేందుకు ప్రయత్నాలు చేస్తోంది.
*ఐఎల్ అండ్ ఎఫ్‌ఎస్ కేసులో కుట్రపూరితంగా వ్యవహరించిన మోసగాళ్లపై కఠిన చర్యలకు రంగం సిద్ధమవుతోంది.
*జెట్ ఎయిర్‌వేస్ వైఫల్యాన్ని విమానయాన రంగానికి హెచ్చరికగా భావించాలని స్పైస్‌జెట్ ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ అజయ్ సింగ్ పేర్కొన్నారు.
*గత ఆర్థిక సంవత్సరానికి (2018-19) సంబంధించి ఫారం-16ను ఉద్యోగ సంస్థలు తమ ఉద్యోగులకు జులై 10 వరకు ఇవ్వొచ్చు.
*నరేంద్ర మోదీ 2.0 ప్రభుత్వం తొలి బడ్జెట్ రూపకల్పనకు సిద్ధమవుతుండటంతో నార్త్‌బ్లాక్‌లో ఉండే ఆర్థిక శాఖ కార్యాలయం అష్ట దిగ్బంధంలోకి వెళ్లనుంది.
*పెద్దతెర టీవీలకు ఆదరణ పెరుగుతున్నందున, ఈ విభాగంలో అత్యంత స్పష్టత కలిగిన క్యూఎల్‌ఈడీ టీవీల ఆవిష్కరణపై శామ్‌సంగ్ ఎలక్ట్రానిక్స్ దృష్టి సారించింది.
*ఫోర్డ్ ఇండియా కాంపాక్ట్ ఎస్‌యూవీ ఎకోస్పోర్ట్‌లో 2019 వెర్షన్‌ను విపణిలోకి ప్రవేశపెట్టింది. కొత్త మోడల్‌లో పలు అధునాతన ఫీచర్లు జోడించిన కంపెనీ.. ధరను రూ.57,400 వరకు తగ్గించడం గమనార్హం.
శాంసంగ్ ₹60లక్షల టీవీ-వాణిజ్య-06/05
Related tags :