తెలుగు రాష్ట్రాల్లో రంజాన్ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. నెల రోజుల పాటు కఠోర ఉపవాసం పాటించిన ముస్లింలు మంగళవారం రాత్రి నెలవంక దర్శనంతో ఉపవాసాలు విరమించారు. మసీదులు, ఈద్గాల వద్ద ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకుని మసీదులు, ఈద్గాల వద్ద సందడి వాతావరణం నెలకొంది. ముస్లింలు అంతా సంతోషంగా ఒక చోటుకు వచ్చి ఈద్-ఉల్-ఫితర్ జరపుకొంటున్నారు. ఒకరికొకరు ఆలింగనం చేసుకుని ఈద్‌ముబారక్ తెలుపుకొంటున్నారుహైదరాబాద్‌లోని మక్కా మసీదు, మీర్ ఆలం దర్గా, యూసఫ్‌గూడలోని ఈద్గా వద్ద ముస్లింలు పెద్ద ఎత్తున ప్రార్థనలు చేశారు. హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ ఏర్పాట్లను పరిశీలించారు. నెలరోజుల పాటు చేసే ఉపవాస దీక్ష చాలా గొప్పదన్నారు. ప్రతి ఒక్కరూ సుఖ సంతోషాలతో ఉండాలని దేవుడిని ప్రార్థిస్తున్నట్లు సీపీ తెలిపారు.
రంజాన్ దీక్షలు విరమించిన ముస్లిం సోదరులు
Related tags :