Health

పజిల్స్ పుర్తి చేయండి-మెదడు మెరుగుపరుచుకోండి

Sudoku and Puzzle Fillers Have A Youthful Mind-Research Confirms

మీరు నిత్యం సుడోకు లేదా ఇతర పజిల్స్ నింపుతుంటారా..? అయితే మీ శరీరం కన్నా మీ మెదడు యవ్వనంగా ఉన్నట్లే. అవును నిజమే. సైంటిస్టులు చేపట్టిన తాజా అధ్యయనాలు ఈ విషయాన్ని వెల్లడిస్తున్నాయి. సుడోకుతోపాటు 50 రకాల పజిల్స్, క్రాస్‌వర్డ్స్ పూర్తి చేసే వారి మెదడు సాధారణ వ్యక్తుల మెదడు కన్నా యవ్వనంగా ఉంటుందని సైంటిస్టులు చెబుతున్నారు. ఈ మేరకు పలువురు సైంటిస్టులు ఇటీవలే 19వేల మందిపై పరిశోధనలు చేశారు. పజిల్స్ పూర్తి చేసే వారు, చేయని వారి యాక్టివిటీలను పరిశీలించారు. వారి ఏకాగ్రత, విషయాలను అర్థం చేసుకుని నేర్చుకునే సామర్థ్యం, స్పందించే తీరు, జ్ఞాపకశక్తి, లెక్కలు చేయడం.. తదితర పరీక్షలను సైంటిస్టులు నిర్వహించి ఆయా వ్యక్తుల మెదడు పనితీరును విశ్లేషించారు. దీంతో తేలిందేమిటంటే.. పజిల్స్ పూర్తి చేసే వారి మెదడు ఇతర వ్యక్తుల మెదడు కన్నా యాక్టివ్‌గా ఉంటుందని తేల్చారు. అలాగే పజిల్స్ పూర్తి చేసే వారి మెదడు తమ శరీరం కన్నా, పజిల్స్ చేయని వారికన్నా.. యవ్వనంగా ఉంటుందని తేల్చారు. కనుక ఎవరైనా సరే.. సుడోకు, క్రాస్‌వర్డ్ లేదా ఇతర పజిల్స్‌ ను నిత్యం ఒక హాబీలా చేసుకుని పూర్తి చేస్తుంటే.. మెదడును ఎల్లప్పుడూ యాక్టివ్‌గా ఉంచుకోవచ్చని సైంటిస్టులు చెబుతున్నారు.