ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా వాతావరణ మార్పులపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి భారత్, చైనా, రష్యా మీద విమర్శల దాడికి దిగారు. పర్యావరణ పరిరక్షణకు ఆ దేశాలు ఎటువంటి చర్యలు చేపట్టడం లేదని, యూఎస్ వాతావరణం అత్యంత పరిశుభ్రమైందని వెల్లడించారు. యూకేలో మూడు రోజుల పర్యటనలో భాగంగా మంగళవారం ఓ ఇంటర్వ్యూలో ఈ వ్యాఖ్యలు చేశారు. 2017లో పారిస్ ఒప్పందం నుంచి విరమించుకుంటూ భారత్‌తో సహా ఇతర దేశాల మీద విమర్శలు చేశారు. ఇప్పుడు అదే తీరును కొనసాగించారు. ‘అన్ని గణాంకాల ప్రకారం యునైటెడ్ స్టేట్స్ అతి పరిశుభ్రమైన వాతావరణాల్లో ఒకటిగా ఉందని చెప్పగలను. భవిష్యత్తులో మేం మరింత ఉత్తమంగా ఉండనున్నాం. చైనా, భారత్, రష్యా, ఇంకా ఇతర దేశాల్లో స్వచ్ఛమైన గాలి, పరిశుభ్రమైన నీరు ఉండవు. వాతావరణం కలుషితమైంది. మీరు ఒకవేళ ఆ దేశాలకు వెళ్లాలనుకుంటే కనీసం శ్వాసించలేరు. ఇంకా అలాంటి గాలి పెరుగుతూనే ఉంది. వారు వారి బాధ్యతలను నిర్వహించడం లేదు’ అని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఈ సమావేశంలో క్వీన్ ఎలిజబెత్‌తో పాటు ఫ్రాన్స్, జర్మనీ, కెనడా దేశాధినేతలు కూడా పాల్గొన్నారు.
భారతీయ గాలి కూడా విషపూరితం కలుషితం
Related tags :