Devotional

ధర్మ సూత్రాలు అంటే ఏమిటి?

What are dharmasutras in Hinduism-Here is a list of them

ధర్మ సూత్రాలు ఇవే – తదితర ఆద్యాత్మిక వార్తలు

1. వాల్మీకి శ్రీరామ పట్టభిషేకానంతరం రామాయణ రచన చేశాడు. ముందుగా ఊహించి వ్రాసినది కాదు.

2. వినాశ కాలం వచ్చినవారు వివేకమును కోల్పోయి ధర్మవిరుద్ధమైన పనులు చేసి నశిస్తారు.

3. ఎవరిపాప కర్మలకు వారే బాధ్యులు. కానీ, పాపంలో భాగం కూడా పిల్లలకు రావటం తప్పదు.

4. రావణుడు, ఆంజనేయుడు నవ వ్యాకరణాలు చదివిన సర్వ శాస్త్రవేత్తలు.

5. పరమార్థం తెలియనిదే జీవితానికి ప్రయోజనం లేదు.

6. వ్యాసమహర్షి మహాభారతాన్ని కురుక్షేత్రము అయిన తరువాత చాలాకాలంకి వ్రాసిరి.

7. కైవల్య ముక్తి అంటే మోక్షమే. జీవన్ముక్తి అంటే జీవించి ఉండగనే ముక్తుడై యుండడం. జీవన్ముక్తికి ప్రారబ్దము నశించగావిదేహముక్తుడవుతాడు.

8. భగవత్కథలు ఎప్పుడూ మిధ్యలు కావు. ఇది పెద్దలమాట.

9. పున్నామ నరకం నుంచి రక్షించే వాడే పుత్రుడు.

10. నవగ్రహ స్తోత్ర పఠనంవల్ల నవగ్రహాలు ప్రసన్నములై శుభ ఫలాన్ని యిస్తాయి.

11. ఇతరులకు అపకారం చేసి, ఇతరుల బాధలవల్ల సంతోషము పొందే దుర్మార్గుడిని ఖలుడు అంటారు.

12. జమ్మి చాల పవిత్రమైన చెట్టు. అగ్ని స్వరూపము.

13. బ్రహ్మకపాలంలో పిండ ప్రదానం చాల మంచిపని. అంత మాత్రంచేత తద్దినాలు ఎగ్గొట్ట కూడదు. శరీరం ఉన్నంతవరకు పితృ దేవతలకు తద్దినం పెట్టుట శాస్త్రీయ ధర్మము.

14. ఇతరుల ఐశ్వర్యాన్ని చూసి ఎప్పుడూ దుఃఖపడకూడదని, సత్పురుషులను, ద్వేషించకూడదని, స్త్రీలను పరాభవించకూడదని, పరద్రవ్యాన్ని అన్యాయంగా అపహరించకూడదని, మహాభారతం ద్వారా గ్రహించిన నీతి.

15. భగవంతుని త్రికరణశుద్ధిగా పరమోత్తమ భక్తితో ఆశ్రయించిన భక్తులకు దేహాభిమానముగానీ, అహంకారముగానీ ఏమాత్రము వుండకూడదు.

16. పూర్వ కర్మను బట్టి ఇప్పటి జీవితంలో సుఖదుఃఖాలు సంప్రాప్త మౌతాయి.

17. దేవాలయల్లో ధ్వజస్థంభాలు పవిత్రమైనా, కాపురాలుండే ఇళ్ళపైన వాటి నీడ పడడం శాస్త్ర విరుద్ధం.

18. అశ్వథామ, బలి చక్రవర్తి, వ్యాస మహర్షి, హనుమంతుడు, విభీషణుడు, కృపాచార్యుడు, పరశురాముడు, ఈ ఏడుగురు చిరంజీవులు.

19. గురువునకు, దైవమునకు ఎప్పుడూ వంగి నమస్కారం పెట్టగూడదు. సాష్టాంగం గానే పెట్టాలి.

20. శివాలయానికి ఎదురుగా ఇల్లు కట్టగూడదు.

21. జగమెరిగినవాడు అంటే తత్త్వవేత్త అన్నమాట. అతనికి దేహాభిమానం లేదు.

22. రాధ గోకులమునందు పరాశక్తి. శ్రీకృష్ణుడు పరమాత్మ. శక్తి, శక్తిమంతుల అభిన్నమైన ప్రేమ, భక్తులకు ఆదర్శం.

23. గాయత్రీ మంత్రం జపమాలతో చేసిన ఉత్తమము. విశేష ఫలం.

24. గాంధారి గర్భవతి గా వున్నప్పుడు, సేవ చేసిన మరొక స్త్రీకి కలిగిన ధృతరాష్ట్రుని కుమారుడు యుయుత్సువుడు.

25. విష్ణుమూర్తికి ఇద్దరు కుమారులు, బ్రహ్మ మరియు మన్మథుడు.

26. భక్తివల్ల జ్ఞానము, రక్తివల్ల అజ్ఞానము కలుగును.

27. కృతయుగమునందు తప్పస్సు, త్రేతాయుగమునందు జ్ఞానము, ద్వాపరయుగమునందు యజ్ఞము, విశేష ప్రాముఖ్యమును పొందియున్నవి. కలియుగమున దానము చేయుటయే ముఖ్య కర్తవ్యము.

28. ఏకాదశి వ్రత ఉపవాసమునకు దశమినాటి రాత్రి భోజనం చేయకూడదు. ఏకాదశి పూర్తి ఉపవాసం. ద్వాదశి ఘడియలు ఉండగానే భుజించుట సంప్రదాయం. దీనినే విష్ణువాసం అంటారు.

29. శివుడు అభిషేక ప్రియుడు కావున లింగరూప అభిషేకమే ఆయనకు ప్రియం.

30. మానవ జన్మకు జ్ఞానం విశేషం.

2. ఏడాదికోసారే తిరుమలకు రండి

ఏడాదికోసారి మాత్రమే తిరుమల వచ్చేలా ప్రముఖులు స్వీయ నిర్ణయం తీసుకుంటే సామాన్య భక్తులకు స్వామి దర్శనం సులభంగా ఉంటుందని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అభిప్రాయపడ్డారు. ఏడాదిగా తాను ఇదే విధానం అనుసరిస్తున్నట్లు చెప్పారు. ఉపరాష్ట్రపతి మంగళవారం కుటుంబ సమేతంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం ఆలయం వెలుపల విలేకరులతో మాట్లాడారు. సకాలంలో వర్షాలు కురిసి, ప్రకృతి వైపరీత్యాలు లేకుండా రైతులు, ప్రపంచ మానవాళి సుఖసంతోషాలతో జీవించాలని, తన వంతు కర్తవ్య నిర్వహణకు శక్తిని ఇవ్వాలని స్వామిని వేడుకున్నట్లు చెప్పారు. తాను రాజకీయాల్లో లేనని, ఎన్నికలతో సంబంధంలేదని, భవిష్యత్తులోనూ రాజకీయాల్లోకి రాబోనని స్పష్టం చేశారు.

3. దుర్గ గుడి హుండీ ఆదాయం తరలింపులో చేతివాటం

దుర్గ గుడి హుండీలో భక్తులు సమర్పించిన కానుకలను లెక్కింపునకు తీసుకెళుతుండగా చేతివాటం ప్రదర్శించిన దేవస్థానం స్వీపర్‌ సింహాచలం, ఆయన భార్య, కాంట్రాక్టు ఉద్యోగి దుర్గను విజయవాడ వన్‌టౌన్‌ పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. వారి నుంచి 12 గ్రాముల బంగారు వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. దుర్గ గుడిలో భక్తులు సమర్పించిన కానుకల లెక్కింపునకు గుడ్డ హుండీని తెరుస్తుండగా.. బంగారం వస్తువులతో ముడుపు కట్టిన సంచిని స్వీపర్‌ సింహాచలం గమనించాడు. కానుకలను గిన్నెలో పోసే క్రమంలో.. ముడుపు సంచి పడిపోకుండా పట్టుకున్నాడు. తరువాత ఖాళీ హుండీని తీసుకెళ్తున్నట్లు నటించి తన భార్య, కాంట్రాక్టు ఉద్యోగి దుర్గ ఎదుట ముడుపు సంచిని విడిచిపెట్టాడు. ఈ విషయాన్ని సీసీ కెమెరాల్లో గమనించిన పోలీసులు దుర్గను అదుపులోకి తీసుకొని విచారించారు. అనంతరం భార్యాభర్తలను అరెస్టు చేశారు. చేతివాటం ప్రదర్శించిన వారిని గుర్తించడంలో సహకరించిన ముగ్గురు సిబ్బందికి ఈవో కోటేశ్వరమ్మ రివార్డు ప్రకటించారు.

4. తితిదే డైరెక్టర్ల రాజీనామా ఆమోదం

తిరుమల తిరుపతి దేవస్థానం డైరెక్టర్లు పొట్లూరి రమేశ్‌ బాబు, చల్లా రామచంద్రారెడ్డి, ప్రత్యేక ఆహ్వానితుడు కె.రాఘవేంద్రరావుల రాజీనామాలను ఆమోదిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. తెదేపా హయాంలో నియమితులైన వీరు ఇటీవల రాజీనామా చేసిన విషయాన్ని తితిదే కార్యనిర్వహణాధికారి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడంతో ఆమోదిస్తున్నట్లు జీవో విడుదలైంది.

5. ఆలయ ధర్మకర్తలుగా మత్స్యకారులకు అవకాశం ఇవ్వాలి

తూర్పుగోదావరి జిల్లా అంతర్వేదిలోని లక్ష్మీనరసింహస్వామి ఆలయాన్ని నిర్మించిన మత్స్యకార కుటుంబాలకే ధర్మకర్తలుగా అవకాశం కల్పించాలని పుదుచ్చేరి వైద్యఆరోగ్యశాఖ మంత్రి మల్లాడి కృష్ణారావు కోరారు. మంగళవారం క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్‌తో సమావేశమయ్యారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ.. ఇక్కడ ధర్మకర్తలుగా మత్స్యకార కుటుంబాలకు చెందిన వారిని తప్పించడంపై విచారణ జరిపించాలని విజ్ఞప్తి చేసినట్లు చెప్పారు. పుదుచ్చేరి నుంచి యానాంకు లిక్కర్‌ రవాణా చేసేందుకు ప్రత్యేక అనుమతి ఇవ్వాలని కోరినట్లు చెప్పారు. అలాగే జీఎస్‌పీసీ పైపులైను ఏర్పాటు ద్వారా నష్టపోయిన 17 వేల మత్స్యకార కుటుంబాలకు పరిహారం విషయంలో అన్యాయం జరిగిందని, దీనిపై పెట్రోలియం శాఖ మంత్రితో మాట్లాడి న్యాయం చేయాలని కోరామన్నారు.

6. ఉజ్జయిని మహాకాళీ ప్రసాదంగా బెల్లం లడ్డూలు

సికింద్రాబాద్‌ శ్రీఉజ్జయిని మహాకాళీ ఆలయంలో బెల్లం లడ్డూలు ప్రసాదంగా అందుబాటులోకొచ్చాయి. ఇప్పటివరకూ దేవస్థానంలో పులిహోర, పంచదార లడ్డు, వడతో పాటు ప్రత్యేక రోజుల్లో రవ్వకేసరిని భక్తులకు అందజేసేవారు. భక్తుల వక్తిగత ఆసక్తితో నివేదన కోసం పొంగళి, చెక్కర పొంగళి సైతం పంపిణీ చేస్తున్నారు. కాగా దేవస్థానం కొత్తగా బెల్లం లడ్డూలను భక్తులకు అందుబాటులోకి తీసుకొచ్చింది. నెల రోజుల నుంచి బెల్లం లడ్డూల పట్ల భక్తులు ఆదరణ కనబరుస్తున్నారని ఆలయ ఈఓ శిరంశెట్టి అన్నపూర్ణ తెలిపారు. కమిషనర్‌ సమావేశం తరువాత మరుసటిరోజే తయారు చేశామన్నారు. రాష్ట్రంలో తొలిసారి బెల్లం లడ్డూలను ఈ దేవస్థానం నుంచే ప్రారంభించినట్లైందన్నారు. భక్తులు చూపుతున్న ఆసక్తితో బెల్లం లడ్డూలను కొనసాగించనున్నట్లు తెలిపారు. ప్రత్యేక రోజులతోపాటు సాధారణ రోజుల్లోనూ భక్తుల ఆదరణతో లడ్డూలను క్రమంగా పెంచుతున్నట్లు ఆమె వివరించారు.

7. తితిదే ఛైర్మన్‌ పదవిపై మోహన్‌బాబు స్పందన

తిరుమల తిరుపతి దేవస్థానం ఛైర్మన్‌గా ప్రముఖ నటుడు, వైకాపా నేత మోహన్‌బాబును నియమించనున్నారని ప్రచారం జరుగుతోంది. దీనిపై తాజాగా ఆయన ట్విటర్‌ వేదికగా స్పందించారు. మీడియా వర్గాలు ఇలాంటి వదంతులు రాయొద్దని కోరారు. ‘తితిదే ఛైర్మన్‌ పదవి రేసులో నేనున్నానని వార్తలు వెలువడుతున్నాయి. ఈ విషయంలో నాకు కొన్నిరోజులుగా ఫోన్లు వస్తున్నాయి. నా కోరిక ఒక్కటే. జగన్‌ను ముఖ్యమంత్రిగా చూడాలనుకున్నాను. ఆయన చేసే ప్రజాసేవకు నా వంతు సాయం చేయాలనుకుంటున్నాను. జగన్‌పై నమ్మకంతోనే నేను మళ్లీ రాజకీయాల్లోకి వచ్చాను. అంతేకానీ ఎలాంటి పదవులు ఆశించి కాదు. మీడియా వర్గాలు ఇలాంటి వదంతులు సృష్టించవద్దని కోరుతున్నాను’ అని మోహన్‌బాబు స్పష్టం చేశారు.

8. శుభమస్తు – నేటి పంచాంగం తే : 5, జూన్ 2019

సంవత్సరం : వికారినామ సంవత్సరం

ఆయనం : ఉత్తరాయణం

మాసం : జ్యేష్ఠమాసం

ఋతువు : గ్రీష్మ ఋతువు

వారము : బుధవారం

పక్షం : శుక్లపక్షం

తిథి : విదియ

(ఈరోజు ఉదయం 1 గం॥ 7 ని॥ వరకు)

నక్షత్రం : ఆరుద్ర

(ఈరోజు రాత్రి 11 గం॥ 29 ని॥ వరకు)

యోగము : గండము

కరణం : కౌలవ

వర్జ్యం : (ఈరోజు ఉదయం 8 గం॥ 23 ని॥ నుంచి ఈరోజు ఉదయం 9 గం॥ 56 ని॥ వరకు)

అమ్రుతఘడియలు : (ఈరోజు ఉదయం 12 గం॥ 24 ని॥ నుంచి ఈరోజు మద్యాహ్నం 1 గం॥ 55 ని॥ వరకు)

దుర్ముహూర్తం : (ఈరోజు ఉదయం 11 గం॥ 36 ని॥ నుంచి ఈరోజు ఉదయం 12 గం॥ 24 ని॥ వరకు)

రాహుకాలం : (ఈరోజు ఉదయం 12 గం॥ 00 ని॥ నుంచి ఈరోజు మద్యాహ్నం 1 గం॥ 30 ని॥ వరకు)

గుళికకాలం : (ఈరోజు ఉదయం 10 గం॥ 35 ని॥ నుంచి ఈరోజు ఉదయం 12 గం॥ 13 ని॥ వరకు)

యమగండం : (ఈరోజు ఉదయం 7 గం॥ 18 ని॥ నుంచి ఈరోజు ఉదయం 8 గం॥ 56 ని॥ వరకు)

సూర్యోదయం : ఉదయం 5 గం॥ 40 ని॥ లకు

సూర్యాస్తమయం : సాయంత్రం 6 గం॥ 47 ని॥ లకు

9. శుభమస్తు _ చరిత్రలో ఈ రోజు

* జూన్, 05

సంఘటనలు

1968: అమెరికా సెనేటరు రాబర్ట్ ఎఫ్. కెన్నడీపై సిర్హన్ సిర్హన్ అనే వ్యక్తి కాల్పులు జరిపాడు. ఈ సంఘటన లాస్ ఆంజిల్స్‌లోని ది అంబాసిడర్ హోటల్లోని వంటశాలలో జరిగింది.

1972: స్వీడన్ రాజధాని స్టాక్‌హోంలో మొట్టమొదటి పర్యావరణ సదస్సు నిర్వహించబడింది.

1995 : “బోస్-ఐన్‌స్టీన్ కండెన్సేట్”ను మొదటి సారి సృష్టించారు.

2008: 3000 మీటర్ల పరుగులో సురేంద్రసింగ్ భారత జాతీయ రికార్డు సృష్టించాడు. 16 సంవత్సరాల బహదూర్ ప్రసాద్ రికార్డు ఛేదించబడింది.

*జననాలు

1908: రావి నారాయణరెడ్డి, కమ్యూనిస్టు నాయకుడు, తెలంగాణ పోరాటంలో ముఖ్యుడు. (మ.1991)

1934: చెన్నుపాటి విద్య, భారత పార్లమెంటు సభ్యురాలు మరియు సంఘ సేవిక.

1941: ఆచార్య ఎస్వీ రామారావు, పి.హెచ్.డి. పరిశోధనా పర్యవేక్షకుడిగా కూడా మంచి పేరు సంపాదించుకున్నాడు. ఇతని పర్యవేక్షణలో 19 పి.హెచ్.డి పరిశోధనలు, 15 ఎం.ఫిల్ పరిశోధనలు జరిగాయి.

1943: రాయపాటి సాంబశివరావు, భారత పార్లమెంటు సభ్యుడు.

1961: రమేశ్ కృష్ణన్, భారత ప్రముఖ టెన్నిస్ క్రీడాకారుడు.

1968: మూరెళ్ల ప్రసాద్, ప్రముఖ తెలుగు సినిమా ఛాయాగ్రాహకుడు. ఇతడు ఎక్కువగా తెలుగు మరియు కొన్ని తమిళ సినిమాలకు పనిచేశారు.

1976: రంభ (నటి), తెలుగు సినిమా పరిశ్రమలో ప్రముఖ నటి. ఈమె స్వస్థలం విజయవాడ

* మరణాలు

1973: మాధవ్ సదాశివ్ గోల్వాల్కర్, గురూజీగా ప్రసిద్ధి చెందిన హిందుత్వ నాయకుడు (జ.1906).

1996: ఆచార్య కుబేర్‌నాథ్ రాయ్, భారతీయ రచయిత, జ్ఞానపీఠ పురస్కర గ్రహీత (జ.1933).

*పండుగలు మరియు జాతీయ దినాలు*ప్రపంఛ పర్యావరణ దినోత్సవం.

10. పాలక మండళ్ల రద్దుకు ఆర్డినెన్స్ తెచ్చే యోచనలో సీఎం జగన్.

టిటిడితో సహా రాష్ట్ర్ర వ్యాప్తంగా ఉన్న ప్రధాన ఆలయాల పాలక మండళ్ల రద్దు చేసే యోచనలో వైఎస్ జగన్.న్యాయపరమైన సమస్యలు రాకుండా చట్టప్రకారం చేసేందుకు కసరత్తు..క్యాబినెట్ ఆమొదం ద్వారా రద్దు చెయ్యాలని సీఎం నిర్ణయం.. నోటీసులు ఇస్తే కోర్టును ఆశ్రయించే అవకాశం ఉండటంతో ఆర్డినెన్స్ ..దేవాదాయశాఖ చట్టం 1987లోని సవరణ ద్వారా ఆర్డినెన్స్.ఆర్డినెన్స్ కోసం క్యాబినెట్ అమొదం తప్పనిసరి కావడంతో 8 తేదీన మంత్రి వర్గం ఏర్పాటు రోజే క్యాబినెట్ లో పెట్టే అవకాశం..క్యాబినెట్ ఆమోదించిన వెంటనే గవర్నర్ కు పంపేందుకు నిర్ణయం.కదరని పక్షంలో 12 న అసెంబ్లీ సమావేశాల్లో సవరణ బిల్లు పెట్టి పాలక మండళ్ల రద్దుకు నిర్ణయం తీసుకునే అవకాశం.