WorldWonders

బంగ్లా ప్రధాని పైలట్ తింగరితనం

Bangladesh Prime Ministers Flight Pilot Forgot His Passport

ప్రధానిని తీసుకురావడానికి విమానంలో వెళ్లిన పైలట్‌ పాస్‌పోర్ట్‌ మర్చిపోవడంతో అధికారులు అతన్ని అనుమతించలేదు. బంగ్లాదేశ్‌ ప్రధాని షేక్‌ హసీనా మూడు దేశాల పర్యటనలో భాగంగా ఫిన్‌లాండ్‌కు వెళ్లారు. ఆమెను తిరిగి బంగ్లాదేశ్‌కు తీసుకురావడానికి అధికారులు బిమన్‌ బంగ్లాదేశ్‌ ఎయిర్‌లైన్స్‌కు చెందిన ప్రత్యేక విమానాన్ని పంపారు. అయితే ఆ విమానం నడుపుతున్న పైలట్‌ కెప్టెన్‌ ఫజల్‌ పాస్‌పోర్ట్‌ తీసుకెళ్లడం మర్చిపోయాడు. విమానం ఖతార్‌లో ల్యాండయినప్పుడు ఫజల్‌కు ఈ విషయం తెలిసింది. దాంతో ఖతార్‌ విమానాశ్రయ అధికారులు ఫజల్‌ను ఫిన్‌లాండ్‌కు బయలుదేరేందుకు అనుమతించలేదు. ఈ నేపథ్యంలో బంగ్లాదేశ్‌ ఎయిర్‌లైన్స్‌ మరో విమాన పైలట్‌కు ఫజల్‌ పాస్‌పోర్ట్‌ను ఇచ్చి ఖతార్‌కు పంపించింది. ఈ విషయాన్ని సివిల్‌ ఏవియేషన్‌ సెక్రటరీ మొహిబుల్‌ హఖ్‌ మీడియా ద్వారా తెలిపారు. అయితే హసీనాను స్వస్థలానికి రావడానికి ఫజల్‌ను కాకుండా ఎయిర్‌లైన్స్‌ మరో పైలట్‌ను పంపించింది. పాస్‌పోర్ట్‌ లేకుండా ప్రయాణించిన పైలట్‌ ఫజల్‌పై చర్యలు తీసుకుంటామని ఆ దేశ హోంమంత్రి అజదుజ్జమాన్‌ ఖాన్‌ తెలిపారు.