*తక్కువ ధరలో మంచి ఫీచర్లు అందిస్తూ మొబైల్ ప్రియుల ఆదరాభిమానాలు చూరగొన్న మొబైల్ ఫోన్ల తయారీ కంపెనీ షామీ.. ఇప్పుడు వినియోగదారులకు మరింత చేరువయ్యేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఆన్లైన్లో మొబైళ్లతో పాటు ఇతర ఉత్పత్తులను ఆర్డరిచ్చిన తర్వాతి రోజే వాటిని చేతికి అందించే విధంగా ఎక్స్ ప్రెస్ డెలివరీ సేవల్ని ప్రారంభించింది. ఎంఐ.కామ్ వెబ్సైట్లో కొనుగోలు చేసే వారికి ఈ సేవలను అందుబాటులోకి తెచ్చింది.
* ఆరంభంలో బలహీనంగా దేశీయ స్టాక్‌మార్కెట్ల చివరికి స్వల్ప లాభాలతో ముగిశాయి. రోజంతా హెచ్చు తగ్గులకు లోనవుతూ ఒక దశలో 100 పాయింట్లకు పైగా ఎగిసింది. చివరికి సెన్సెక్స్ 86 పాయింట్లు ఎగిసి 39,616వద్ద నిఫ్టీ 27 పాయింట్ల లాభానికి పరిమితమై11,871 వద్ద స్థిరంగా ముగియడం విశేషం. తద్వారా రెండు రోజుల నష్టాలకు చెక్ చెప్పిన సూచీలు వారాంతంలో పాజిటివ్‌గా నోట్‌తో ముగిసాయి.
* రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రెపో రేటును పావు శాతం తగ్గించింది. ప్రతిసారి పావు శాతం 25 బేసిక్ పాయింట్లు చొప్పున తగ్గించడంతో ఈ ఏడాది ప్రారంభంలో 6.5 శాతంగా ఉన్న రెపో రేటు తాజా నిర్ణయంతో 5.75 శాతానికి చేరింది. మానిటరీ పాలసీ కమిటీ ఏకగ్రీవంగా తీసుకున్న ఈ నిర్ణయంతో రెపో రేటు 10ఏళ్ల కనిష్టానికి చేరింది. మరోవైపు రివర్స్ రెపో రేటు బ్యాంక్ రేటును 5.50 నుంచి 6 శాతానికి పెంచింది. రెపో రేటు తగ్గిన నేపథ్యంలో గృహ, వాహన రుణాలపై వడ్డీ భారం తగ్గనుంది.
* హువావేకు మరో ఝలక్
చైనాకు చెందిన టెలికాం దిగ్గజం హువావేపై అమెరికా ఆంక్షల కొరడా ఝుళిపిస్తున్న సంగతి తెలిసిందే. హువావేకు ఎలాంటి సాయం చేయొద్దని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆదేశించిన నేపథ్యంలో గూగుల్ సహా పలు టెక్ కంపెనీలు భవిష్యత్‌లో తమ సేవలను అందించబోమని తెలిపాయి. కాగా, ఇప్పుడు సోషల్‌మీడియా దిగ్గజం ఫేస్బుక్ మరో కీలక నిర్ణయం తీసుకుంది.
* ఔషధ ఉత్పత్తి సంస్థ నాట్కో ఫార్మా కొత్తూరు ప్లాంటులో అమెరికా ఆహార, ఔషధ నియంత్రణ సంస్థ (యూఎస్ఎఫ్డీఏ) తొమ్మిది లోపాలను గుర్తించింది.
* రైల్వే రంగంలో సైబర్ రక్షణ పరిష్కారాలు చూపించే ఇజ్రాయెల్ సంస్థ సైలస్లో పెట్టుబడులు పెట్టినట్లు సైయెంట్ వెల్లడించింది.
*ఎన్బీఎఫ్సీ రంగంలో పరిణామాలను సునిశితంగా పరిశీలిస్తున్నామని, ఆ రంగంలో ఆర్థిక స్థిరత్వాన్ని ఏర్పాటు చేయడానికి ఎటువంటి చర్యలకైనా వెనకాడబోమని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ స్పష్టం చేశారు.
*స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ ఒప్పో, దక్షిణాసియాలో తమ తొలి ఆధునిక ప్రత్యేక (ఫ్లాగ్ షిప్) విక్రయ కేంద్రాన్ని హైదరాబాద్‌లో ప్రారంభించింది.
* ఎన్ఎస్ఈకి చుక్కెదురైంది. కో-లొకేషన్ కేసులో సెబీకి రూ.687 కోట్లను ఎస్క్రో ఖాతా నుంచి బదిలీ చేయడానికి బదులుగా, బ్యాంకు హామీనివ్వడానికి అనుమతించాలంటూ చేసిన విజ్ఞప్తిని సెక్యూరిటీస్ అప్పిలేట్ ట్రైబ్యునల్(శాట్) తిరస్కరించింది.
*టాటా మోటార్స్‌కు చెందిన జాగ్వార్ ల్యాండ్ రోవర్ (జేఎల్ఆర్) ఎస్యూవీ డిస్కవరీ మోడల్లో 2019 వెర్షన్‌ను విపణిలోకి విడుదల చేసింది.
*జపాన్ వాహన దిగ్గజం టయోటా ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ మోడల్ ‘గ్లాంజా’ను దేశీయ విపణిలోకి విడుదల చేసింది.
లాభాల్లో స్టాక్ మార్కెట్లు-వాణిజ్య-06/07
Related tags :