*యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లోని దుబాయిలో గురువారం సాయంత్రం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో 17 మంది ప్రాణాలు కోల్పోయారు. కాగా.. మృతుల్లో 8 మంది భారతీయులు ఉన్నారని దుబాయిలోని భారత రాయబార కార్యాలయం వెల్లడించింది. 31 మంది ప్రయాణికులతో ఒమన్ నుంచి దుబాయికి తిరిగి వస్తున్న బస్సు మార్గమధ్యంలో ఓ మెట్రో స్టేషన్ వద్ద అదుపుతప్పి ప్రమాదానికి గురైంది.
* రష్యాలో ఇనుము దొంగలు బరితెగించారు. చిన్న చిన్న దొంగతనాలు ఏన్నాళ్లు చేయాలనుకున్నారో ఏమో కానీ ఏకంగా రైల్వే బ్రిడ్జిని మాయం చేశారు. వివరాల్లోకి వెళితే.. ష్యాలోని ఆర్కిటిక్ రీజియన్‌లోని ఉంబా నదిపై రైల్వే బ్రిడ్జి ఉంది. బ్రిడ్జి పాత పడటంతో కొంతకాలంగా దానిని వినియోగించడం లేదు. యితే ఇటీవల ఉన్నట్టుండి బ్రిడ్జి మధ్య భాగం అదృశ్యం అయింది. 75 అడుగుల పొడవు, 56టన్నుల బరువున్న వంతెన మధ్య భాగం అదృశ్యం కావడం స్థానికులను ఆశ్చర్యానికి గురిచేసింది.
* భర్త అంత్యక్రియలపై ఇద్దరు భార్యల బాహాబాహీ
ఇద్దరు సవతి భార్యల పోరులో భర్త అంత్యక్రియల వ్యవహారం ప్రహసనంగా మారింది. భర్త శవం తనకే సొంతమంటూ ఇద్దరు భార్యలు పోట్లాడుకుని పోలీసు స్టేషన్ మెట్లు ఎక్కిన ఉదంతం తమిళనాడులో జరిగింది. కోయంబత్తూరులోని తమిళనాడు వ్యవసాయ యూనివర్సిటీలో సెక్యూరిటీ పని చేస్తున్న సెంథిల్ కుమార్ (44), విజయ దంపతులు. వీరికి ఒక కుమార్తె ఉంది. మనస్పర్థల కారణంగా వీరు విడాకులు తీసుకున్నారు. భర్తతో విడిపోయి అదే వర్సిటీలో పనిచేస్తున్న మహేశ్వరి అనే మహిళను సెంథిల్ కుమార్ రెండో వివాహం చేసుకున్నాడు. ఇద్దరూ వర్సిటీ క్వార్టర్స్‌లో కాపురం ఉంటున్నారు. వీరికి సంతానం లేదు. అయితే బుధవారం రాత్రి సెక్యూరిటీ విధుల్లో ఉన్న సెంథిల్ కుమార్ గుండెపోటుకు గురై స్పృహతప్పి పడిపోయాడు. సహచర ఉద్యోగులు అతడిని ఆస్పత్రికి తీసుకెళ్లగా అప్పటికే మరణించినట్లు వైద్యులు తెలిపారు.
* గుంటూరు జిల్లా కాజ వద్ద జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదంరెండు కార్లు డీముగ్గురు అక్కడికక్కడే మృతిఒకరి పరిస్థితి విషమంనలుగురికి గాయాలు.
* ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. జమ్మూకశ్మీర్‌లోని సోపోర్‌లో ఓ పోలీస్ స్టేషన్‌పై కొద్ది సేపటి క్రితం గ్రనేడ్ దాడి చేశారు. ఈ దాడిలో ఇద్దరు పోలీసులు గాయపడ్డారు. సమాచారం తెలిసిన వెంటనే అదనపు బలగాలు హుటాహుటిన అక్కడకు చేరుకుని ఆ ప్రాంతాన్ని తమ అధీనంలోకి తీసుకున్నాయి.
* ఏటీఎం సెంటర్లో చోరికి పాల్పడుతున్న ఇంటిపల్లి రామారావును అరెస్ట్ చేసిన పోలీసులు.21కేసుల్లో 8,32,70 నగదు స్వాధీనం చేసుకున్న పోలీసులు
*గుంటూరు జిల్లా అన్నను నరికి చంపిన తమ్ముడు తోడు పుట్టిన అన్నను సొంత తమ్ముడు గొడ్డలితో నరికి హతమార్చాడు.
ఈ ఘటన చుండూరు మండలం మున్నంగివారిపాలెం గ్రామంలో శుక్రవారం తెల్లవారుజామున ఐదు గంటల సమయంలో చోటుచేసుకుంది.
* గుంటూరు జిల్లా మాచర్ల బస్టాండ్ వద్ద గుర్తు తెలియని వ్యక్తి మద్యం మత్తులో మృతి
* మచిలీపట్నం మాచవరం మెట్టు దగ్గర బైక్ ను ఢీ కొట్టిన ట్రాక్టర్..యువకుడు అక్కడికక్కడే మృతి
* చిత్తూరు జిల్లా రేణిగుంట మండలం గురవరాజుపల్లి వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో ఆరుగురు మృతి చెందగా మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది.
* ప్రకాశంజిల్లా కందుకూరు ఎల్.ఐ. సి ప్రక్కన అర్ధరాత్రి షార్ట్ సర్క్యూట్ వల్ల తగలబడుతున్న బంకులు.
* ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు చేరవేయడంలో అన్ని శాఖలను సమన్వయం చేసుకుంటూ.. జిల్లాను అభివృద్ధి పథంలో తీసుకెళ్తామని నూతన కలెక్టర్ శామ్యూల్ అన్నారు. గుంటూరు జిల్లా నూతన కలెక్టర్‌గా శామ్యూల్ ఆనంద్ శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు.
* ఆగివున్న లారీని కారు ఢీకొన్న ప్రమాదంలో ఐదుగురు అక్కడకక్కడే మృతిచెందగా మరో ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. ఈ ఘటన చిత్తూరు జిల్లా రేణిగుంట మండలంలోని పూతలపట్టు జాతీయ రహదారిపై దురవరాజుపల్లి వద్ద శుక్రవారం ఉదయం 5గంటల సమయంలో చోటుచేసుకుంది.
* వెల్దండ పరిధిలోని కొట్ర శివారులో కల్వకుర్తి – హైదరాబాద్ జాతీయ రహదారిపై గురువారం ఆటో, ద్విచక్ర వాహనం ఢీకొన్న సంఘటనలో ఓ వ్యక్తి మృతిచెందాడు.
* వరంగల్ రైల్వే స్టేషన్ రోడ్డులోని శరణ్యహోటల్‌లో శుక్రవారం అగ్ని ప్రమాదం సంభవించింది.
* మహారాష్ట్ర రాజధాని ముంబైలోని బంధూప్ ప్రాంతంలో గురువారం రాత్రి దారుణం జరిగింది. ముప్పై ఏళ్ల వయసున్న క్రికెటర్ రాకేశ్ పన్వార్‌ను గుర్తు తెలియని ముగ్గురు దుండగులు కిరాతకంగా హత్య చేశారు.
* చిత్తూరు, గుంటూరు జిల్లాల్లో జరిగిన వేర్వేరు రోడ్డుప్రమాదాల్లో 9 మంది మృతి చెందారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. చిత్తూరు జిల్లాలోని పూతలపట్టు – నాయుడుపేట జాతీయ రహదారిపై రేణిగుంట సమీపంలోని గురవరాజుపల్లి వద్ద ఘోర రోడ్డుప్రమాదం జరిగింది.
* ఉత్తరాది రాష్ట్రం ఉత్తరప్రదేశ్‌లో దుమ్ము తుపాను బీభత్సం సృష్టిస్తోంది. తుపాను దాటికి ఇప్పటికే 19 మంది ప్రాణాలు కోల్పోగా.. మరో 48 మంది గాయపడ్డారు. పలు ప్రాంతాల్లో చెట్లు నేలకూలాయి. గోడలు కూలిపోయి అనేక మంది చనిపోయినట్లు యూపీ రిలీఫ్ కమిషనర్ తెలిపారు.
*మహారాష్ట్రలోని సోలాపూర్ వద్ద ఈ తెల్లవారుజామున ఘోర ప్రమాదం జరిగింది. సోలాపూర్ -పుణె జాతీయ రహదారిపై ఆగివున్న లారీని తెలంగాణ ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో మంటలు చెలరేగి బస్సు పూర్తిగా దగ్ధమైంది. బస్సులోని ఇద్దరు డ్రైవర్లు యాదయ్య, బిక్కుకు గాయాలయ్యాయి.
*మహారాష్ట్రకు చెందిన రాకేశ్ పన్వార్ అనే స్థానిక క్రికెటర్ దారుణ హత్యకు గురయ్యారు. ముంబయిలోని బందూప్ అనే ప్రాంతంలోని పెట్రోల్ బంకులో ఉండగా ముగ్గురు గుర్తుతెలియని వ్యక్తులు పదునైన ఆయుధాలతో అతడిపై దాడి చేశారు. ఈ ఘటనలో పన్వార్‌కు తీవ్రగాయాలు కావడంతో అక్కడిక్కడే మృతి చెందారు. అయితే రాకేశ్‌ను చంపడానికి గల కారణాలేవీ తెలియరాలేదు.
*ఆగివున్న లారీని కారు ఢీకొన్న ప్రమాదంలో ఐదుగురు అక్కడకక్కడే మృతిచెందగా మరో ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. ఈ ఘటన చిత్తూరు జిల్లా రేణిగుంట మండలంలోని పూతలపట్టు-నాయుడుపేట జాతీయ రహదారిపై గురవరాజుపల్లి వద్ద శుక్రవారం ఉదయం 5గంటల సమయంలో చోటుచేసుకుంది.
*కుటుంబ కలహాల నేపథ్యంలో ఓ మాతృమూర్తి తన ఇద్దరు బిడ్డలతో కాలువలో దూకి ఆత్మహత్యాయత్నం చేసింది. ఈ ఘటనలో కుమార్తె మృతిచెందగా తల్లి గల్లంతయింది. కుమారుడు మాత్రం ప్రాణాలు దక్కించుకున్నాడు. విశాఖపట్నం జిల్లా నాతవరం మండలం ఎ.శరభవరం వద్ద గురువారం మధ్యాహ్నం ఈ సంఘటన జరిగింది.
* ఆసుపత్రులలో రోగులకు ప్రమాదకరమైన ఇంజెక్షన్లు ఇచ్చి 85 మందికి పైగా ప్రాణాలు బలిగొన్న జర్మన్ నర్సుకు అక్కడి కోర్టు జీవితఖైదు విధించింది.
*మానవత్వం మంటగలిసింది. ముక్కుపచ్చలారని చిన్నారి చేతులు విరిచి.. కనుగుడ్లు పెరికి దారుణాతి దారుణంగా హతమార్చారు. అది కూడా కేవలం రూ 5వేల అప్పు విషయమై జరిగిన గొడవలో! ఉత్తర్‌ప్రదేశ్‌లోని అలీగఢ్ ప్రాంతంలో ఈ ఘోరం చోటుచేసుకుంది.
* స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ (ఎస్‌ఎస్‌సీ) గ్రాడ్యుయేట్ లెవల్ పరీక్ష ప్రశ్నపత్రాల లీకేజీ కేసులో సీబీఐ ముగ్గుర్ని అరెస్టు చేసింది. లీకేజీలో ప్రధాన సూత్రధారిగా వ్యవహరించిన అక్షయ్‌కుమార్ మాలిక్‌తో పాటు సందీప్ మాథుర్, ధర్మేంద్రలను అరెస్టు చేశామని సీబీఐవర్గాలు తెలిపాయి. లీకేజీ కేసులో పది మంది ‘సిఫీ టెక్నాలజీస్’ ఉద్యోగులతో పాటు 17 మందిపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేసినట్లు చెప్పాయి.
*సాహితీవేత్త ఎం.ఎం.కలబుర్గి హత్య కేసులో ప్రధాన నిందితులు అమోల్ కాళే, ప్రవీణ్ చతుర్‌లను రెండు వారాలపాటు న్యాయ నిర్బంధానికి పంపించాలని ధార్వాడలోని మూడో జేఎంఎఫ్‌సీ న్యాయస్థానం ఆదేశించింది.
*వేటు బస్సులోని తీగల్లో రాపిడి కారణంగా మంటలు చెలరేగి వాహనం పూర్తిగా కాలిపోయింది. అందులో ప్రయాణిస్తున్న ఓ యువకుడు ముందుగా గుర్తించి అప్రమత్తం చేయడంతో 29 మంది ప్రాణాలతో బయటపడ్డారు.
*ఉప రాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు పేరిట ఫోర్జరీ సిఫార్సు లేఖ సృష్టించడం తితిదే వర్గాల్లో సంచలనం రేపింది.
* నారాయణపేట జిల్లా మక్తల్ మండలంలోని మంథన్‌గోడు గ్రామంలో గురువారం రాత్రి పిడుగుపాటుకు తండ్రీకొడుకులు మృతిచెందారు.
*గుంటూరు జిల్లా మంగళగిరి మండలం కాజ సమీపంలో జాతీయ రహదారిపై ఇవాళ ఉదయం ఘోర ప్రమాదం జరిగింది. విజయవాడ నుంచి గుంటూరు వైపు వెళ్తున్న కారు కాజ సమీపంలో రహదారి డివైడర్‌ను ఢీకొట్టి గుంటూరు నుంచి విజయవాడవైపు వెళ్తున్న మరో కారుపై పడింది.
* హిమాలయన్ వయాగ్రా కోసం వెళ్లి 8 మంది మృతి!
అరుదుగా లభించే వనమూలిక, హిమాలయా వయాగ్రా పేరుగాంచిన ‘యార్సాగుంబా’ కోసం వెళ్లిన 8 మంది ప్రాణాలు కోల్పోయారు. నేపాల్‌లోని డోప్లా జిల్లాలో గురువారం ఈ ఘటన చోటుచేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. యార్సాగుంబా కోసం హిమాలయాలు ఎక్కిన 8 మందిలో ఐదుగురు ఆనారోగ్యంతో మరణించారని, ఇద్దరు అత్యంత ఖరీదైన వనమూలిక పీకే క్రమంలో కొండపై నుంచి జారిపడి తుదిశ్వాస విడిచారన్నారు. ఇక తన తల్లితో వెళ్లిన ఓ చిన్నారి సైతం అనారోగ్యానికి గురై ప్రాణాలు కోల్పోయడన్నారు. ఒక కిలో యార్సాగుంబా ధర రూ.60 లక్షల(లక్ష డాలర్ల) పైమాటే. గ్రామీణ నేపాల్‌లో ఉపాధి అవకాశాలు తక్కువ కావడంతో మెజారిటీ కుటుంబాలు దీనిపైనే ఆధారపడి జీవిస్తున్నాయి. చాలా విలువైన మూలికలు కావడంతో వీటి కోసం ప్రాణాలకు తెగించి మరీ ఈ కుటుంబాలు పోరాడుతున్నాయి. హిమాలయాల్లో వేసవి ప్రారంభమై మంచు కరగడం మొదలుపెడితే చాలు.. నేపాలీలు పచ్చిక బయళ్ల వైపు పరుగు తీస్తారు.. నెల రోజుల పాటు బంగారం కన్నా యార్సాగుంబా కోసం చిన్నాపెద్దా అంతా వేట సాగిస్తారు. పసుపు పచ్చ రంగులో ఉండే ఇది బురదలో పెరుగుతుంది. లైంగిక కోరికలను రేకెత్తించడంతో పాటు పుష్కలమైన ఔషధ గుణాలు ఈ మూలిక సొంతం. గొంగళిపురుగు లాంటి ఓ పురుగు లార్వా తలపై పుట్టగొడుగుల మాదిరిగా పెరిగే ఫంగస్సే ఈ యార్సాగుంబా. చైనాలో డాంగ్ ఛాంగ్ జియా కావో అనే రెండు తలల పురుగు ఉంటుంది. దీనిని వేసవి గడ్డి, చలికాలపు పురుగు అంటారు. శీతాకాలంలో యార్సాగుంబా పురుగులా ఉంటే.. వేసవి వచ్చేసరికి ఫంగస్ కారణంగా చిన్న మొక్క మాదిరిగా మారిపోతుంది. పూర్తిగా తయారైన యార్సాగుంబా ఒక అగ్గిపుల్ల మాదిరిగా.. రెండు నుంచి మూడు సెంటీమీటర్ల పొడుగు ఉంటుంది. యార్సాగుంబా సేకరించేవారి కోసం ప్రభుత్వం హెల్త్‌క్యాంప్‌లు కూడా ఏర్పాటు చేసింది. చాలామంది సేకరణదారులు ఈ హెల్త్‌క్యాంప్‌ల్లో చికిత్స పొందారని అధికారులు వెల్లడించారు. నేపాల్ రాజధాని ఖట్మాండుకు 600 కిలోమీటర్ల దూరంలో ఉండే డోప్లా జిల్లాలో యార్సాగుంబా సేకరణదారులు ఎక్కువగా ఉంటారు.
* గుంటూరు జిల్లాచిలకలూరిపేట పట్టణ శివారులో గుర్తు తెలియని వ్యక్తి మృతి.చిలకలూరిపేట, మానుకొండవారిపాలెం మార్గం మధ్యలో ఉదయం వాకింగ్ వెళ్లే దారిలో సగం వరకు కాలిపోయి పడివున్న మృతదేహం.ఉదయం పూట వాకింగ్ వెళ్లిన వారు చూసి పోలీసులకు సమాచారం అందించారు.సమాచారం అందినవెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని విచారణ జరుపుతున్నారు.
దుబాయిలో 8మంది భారతీయులు మృతి-నేరవార్తలు–06/07
Related tags :