Devotional

అయోధ్యలో రాముని విగ్రహం ప్రతిష్ఠ

June 07 2019 - Daily Devotional News - Lord Rama Statue In Ayodhya

అయోధ్యలోని సోథ్ సంస్థాన్ మ్యూజియంలో ఏడడుగుల ఎత్తైన శ్రీరాముని విగ్రహాన్ని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ శుక్రవారంనాడు ఆవిష్కరించారు. కర్ణాటక నుంచి తెప్పించిన రోజ్‌వుడ్ బ్లాక్‌తో ఈ విగ్రహాన్ని తయారుచేశారు. అయోధ్యలో ఇవాళ పర్యటించిన ముఖ్యమంత్రి అక్కడ చేపట్టిన పలు అభివృద్ధి పనులను సైతం పరిశీలించారు.
2. హోమం పీటలపై ముస్లిం జంట
మహబూబాబాద్‌ జిల్లా డోర్నకల్‌ మండలం ముల్కలపల్లికి చెందిన ముస్లిం దంపతులు మత సామరస్యాన్ని చాటారు. గ్రామంలో గురువారం నూతనంగా నెలకొన్న కోదండ రామ ఆలయ ప్రాంగణంలోని విగ్రహ స్థాపన మహోత్సవంలో పాల్గొన్నారు. మూలమంత్ర హోమం వద్ద ఇతర జంటలతో పాటు షేక్‌ సయ్యద్‌ హుస్సేన్‌, చాంద్‌ బీ పీటలపై కూర్చుని క్రతువు నిర్వర్తించారు. సీతమ్మకు బంగారు పుస్తెలు చేయించారు. ఆ అమ్మవారికి, రామలక్ష్మణులకు పట్టు వస్త్రాలు సమర్పించారు. ప్రధాన పూజారికి నూతన వస్త్రాలు అర్పించారు.
3. శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లు నేడు విడుదల
తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారి ఆర్జిత సేవా టికెట్లను తితిదే శుక్రవారం విడుదల చేయనుంది. సెప్టెంబరు మాసానికి సంబంధించి వివిధ ఆర్జిత సేవా టికెట్లను www.tirumala.org వెబ్‌సైట్‌లో ఉదయం 10 గంటల నుంచి అందుబాటులో ఉంచనుంది. శ్రీవారి సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టదళ పాదపద్మారాధన, నిజపాద దర్శనం టికెట్లను డిప్‌ విధానంలో భక్తులను ఎంపిక చేసి కేటాయించనుంది. విశేష పూజ, కల్యాణోత్సవం, డోలోత్సవం, ఆర్జిత బ్రహ్మోత్సవం, వసంతోత్సవం, సహస్ర దీపాలంకరణ సేవా టికెట్లను కరెంటు బుకింగ్‌ కింద వెంటనే బుక్‌ చేసుకోవచ్చు. మొత్తం 60 వేలకుపైగా సేవా టికెట్లను తితిదే విడుదల చేయనుంది.
4. తిరుమల సమాచారంఓం నమో వేంకటేశాయ
ఈరోజు శుక్రవారం 07-06-2019 ఉదయం 5 గంటల సమయానికి. తిరుమలలో పెరిగినభక్తుల రద్దీ …… శ్రీవారి దర్శనానికి అన్ని కంపార్ట్ మెంట్ లు నిండి బయట క్యూ లైన్ లో వేచి ఉన్న భక్తులు… శ్రీ వారి సర్వ దర్శనానికి 26 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక ప్రవేశ (300/-) దర్శనానికి, కాలినడక భక్తులకు, టైమ్ స్లాట్ సర్వ దర్శనానికి 7 గంటల సమయం పడుతోంది.. నిన్న జూన్ 6 న 76,419 మంది భక్తులకు శ్రీవారి ధర్శనభాగ్యం కలిగినది. నిన్న స్వామి వారికి హుండీలో భక్తులు సమర్పించిన నగదు కానుకలు ₹:2.59 కోట్లు.

5. చరిత్రలో ఈ రోజు జూన్, 07
సంఘటనలు
1893: గాంధీజీ మొట్టమొదటి సహాయ నిరాకరణ.
1935: ఫ్రాన్స్ దేశానికి మొట్టమొదటి ప్రధాన మంత్రిగా పియెర్రీ లెవాల్.
1965: పెళ్ళి అయిన జంటలకు గర్భ నిరోధ పద్ధతులను చట్టబద్దం చేస్తూ, అమెరికా సుప్రీం కోర్టుతీర్పు.
1966: మాజీ హాలీవుడ్ సినిమా నటుడు, రోనాల్డ్ రీగన్ 33వ కాలిఫోర్నియా గవర్నరు అయ్యాడు.
1967: ఆరు రోజుల యుద్ధంలో జెరూసలేంనగరంలోనికి ప్రవేశించిన ఇజ్రాయెల్ సైనికులు.
1975: బీటా మాక్స్ వీడియో క్యాసెట్ రికార్డరును సోనీ విపణిలో ప్రవేశపెట్టింది.
1979: భాస్కర-1 అనే భారతీయ ఉపగ్రహంప్రయోగించబడింది.
1981: ఒపెరా పేరుతో ఇరాక్‌ లోని ఒసిరాక్ న్యూక్లియర్ రియాక్టరును ఇజ్రాయెల్ ధ్వంసం చేసింది.
1991: అగ్ని పర్వతం పినతూబో పేలి, 7 కి.మీ (4.5 మై) ఎత్తుకు బూడిద చిమ్మింది.
*** జననాలు
1943: రాయపాటి సాంబశివరావు, భారత పార్లమెంటు సభ్యుడు
1974: మహేష్ భూపతి, భారత టెన్నిస్ క్రీడాకారుడు.
** మరణాలు
1967: డొరొతీ పార్కర్, అమెరికాకు చెందిన కవయిత్రి,రచయిత్రి (జ. 1893)
2002: బసప్ప దానప్ప శెట్టి, భారత రాజకీయ వేత్త, 5 వ ఉప రాష్ట్రపతి. (జ. 1912)
2005: బొల్లిముంత శివరామకృష్ణ, అభ్యుదయ రచయిత, ప్రజా కళాకారుడు మరియు హేతువాది. (జ.1920)
2009: భాను ప్రకాష్, తెలుగునాట నాటక వికాసానికి దోహదం చేసిన కళాకారుడు, చలనచిత్ర నటుడు. (జ.1939)
2011: నటరాజ రామకృష్ణ, పేరిణి శివతాండవము, నవజనార్దనం వంటి ప్రాచీన నాట్యరీతుల్ని తిరిగి వెలుగులోకి తెచ్చిన నాట్యాచార్యుడు. (జ.1933)
2013: జె.వి.రాఘవులు, తెలుగు సినిమా సంగీత దర్శకుడు.
2016: జి.వి.రాఘవులు ప్రముఖ సి.పి.ఐ. (ఎం.ఎల్.) నాయకుడు. (జ.1927)

6. తిరుమల సమాచారంఓం నమో వేంకటేశాయ
ఈరోజు శుక్రవారం 07-06-2019 ఉదయం 5 గంటల సమయానికి తిరుమలలో పెరిగిన
భక్తుల రద్దీ …… శ్రీవారి దర్శనానికి అన్ని కంపార్ట్ మెంట్ లు నిండి బయట క్యూ లైన్ లో వేచి ఉన్న భక్తులు… శ్రీ వారి సర్వ దర్శనానికి 26 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక ప్రవేశ (300/-) దర్శనానికి, కాలినడక భక్తులకు, టైమ్ స్లాట్ సర్వ దర్శనానికి 7 గంటల సమయం పడుతోంది.. నిన్న జూన్ 6 న 76,419 మంది భక్తులకు శ్రీవారి ధర్శనభాగ్యం కలిగినది. నిన్న స్వామి వారికి హుండీలో భక్తులు సమర్పించిన నగదు కానుకలు ₹:2.59 కోట్లు.

7. శుభమస్తు
తేది : 7, జూన్ 2019
సంవత్సరం : వికారినామ సంవత్సరం
ఆయనం : ఉత్తరాయణం
మాసం : జ్యేష్ఠమాసం
ఋతువు : గ్రీష్మ ఋతువు
కాలము : వేసవికాలం
వారము : శుక్రవారం
పక్షం : శుక్లపక్షం
తిథి : చవితి
(నిన్న ఉదయం 9 గం॥ 55 ని॥ నుంచి
ఈరోజు ఉదయం 7 గం॥ 37 ని॥ వరకు)
నక్షత్రం : పుష్యమి
(నిన్న రాత్రి 8 గం॥ 29 ని॥ నుంచి
ఈరోజు రాత్రి 6 గం॥ 56 ని॥ వరకు)
యోగము : ధ్రువము
కరణం : భద్ర (విష్టి)
వర్జ్యం : (ఈరోజు తెల్లవారుజాము 3 గం॥ 58 ని॥ నుంచి ఈరోజు తెల్లవారుజాము 5 గం॥ 27 ని॥ వరకు)
అమ్రుతఘడియలు : (ఈరోజు ఉదయం 12 గం॥ 56 ని॥ నుంచి ఈరోజు మద్యాహ్నం 2 గం॥ 25 ని॥ వరకు)
దుర్ముహూర్తం : (ఈరోజు ఉదయం 8 గం॥ 17 ని॥ నుంచి ఈరోజు ఉదయం 9 గం॥ 9 ని॥ వరకు)(ఈరోజు ఉదయం 12 గం॥ 40 ని॥ నుంచి ఈరోజు మద్యాహ్నం 1 గం॥ 32 ని॥ వరకు)
రాహుకాలం : (ఈరోజు ఉదయం 10 గం॥ 35 ని॥ నుంచి ఈరోజు ఉదయం 12 గం॥ 13 ని॥ వరకు)
గుళికకాలం : (ఈరోజు ఉదయం 7 గం॥ 18 ని॥ నుంచి ఈరోజు ఉదయం 8 గం॥ 56 ని॥ వరకు)
యమగండం : (ఈరోజు సాయంత్రం 3 గం॥ 30 ని॥ నుంచి ఈరోజు సాయంత్రం 5 గం॥ 8 ని॥ వరకు)
సూర్యోదయం : ఉదయం 5 గం॥ 40 ని॥ లకు
సూర్యాస్తమయం : సాయంత్రం 6 గం॥ 48 ని॥ లకు
సూర్యరాశి : వృషభము
చంద్రరాశి : కర్కాటకము
8. పశుపతినాథుడి సంపద 120 కోట్లు!
నేపాల్‌లోని ప్రఖ్యాత పశుపతినాథ్‌ ఆలయం తొలిసారి స్వామి సంపద వివరాలను వెల్లడించింది. ఆలయానికి రూ. 120 కోట్ల నగదుతో పాటు 9.276 కిలోల బంగారం, 316 కిలోల వెండి ఉన్నాయని ఆలయ కమిటీ తెలిపింది. స్వామి ఆస్తుల వివరాలను తొలిసారి బయటపెడుతున్నట్లు పశుపతి ప్రాంత అభివృద్ధి ట్రస్టు ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ రమేశ్‌ ఉప్రేటి తెలిపారు. వివిధ బ్యాంకులలో రూ. 120 కోట్ల నగదుతో పాటు.. 186 హెక్టార్ల భూమి కూడా స్వామికి ఉంది.
9. తితిదే బోర్డుకు సుధామూర్తి రాజీనామా
తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలిలో రాజీనామాల పర్వం కొనసాగుతోంది. తాజాగా బోర్డులో సభ్యులుగా ఉన్న ఇన్ఫోసిస్‌ ఫౌండేషన్‌ ఛైర్‌పర్సన్‌ సుధామూర్తి ఆ పదవికి గురువారం రాజీనామా చేశారు. గతేడాది మే నెలలో రెండోసారి ఆమె బోర్డు సభ్యులుగా నియమితులయ్యారు. తొలిసారి పాలకమండలి పదవీ కాలం ముగియడంతో రెండోసారి ఆమెకు అవకాశం దక్కింది. అయితే, రాజీనామాకు గల కారణాలను మాత్రం ఆమె లేఖలో ప్రస్తావించలేదు.ఇప్పటికే తితిదే పాలక మండలికి పొట్లూరి రమేశ్‌ బాబు, చల్లా రామచంద్రారెడ్డి రాజీనామా చేయగా.. ఎస్వీబీసీ ఛానెల్‌కు ఛైర్మన్‌గా వ్యవహరించిన ప్రముఖ దర్శకుడు రాఘవేంద్రరావు సైతం బాధ్యతల నుంచి తప్పుకున్న సంగతి తెలిసిందే. మరోవైపు తితిదే పాలక మండలిని త్వరలో రద్దు చేసి.. కొత్త మండలిని ఏర్పాటు చేసే యోచనలో ఏపీ ప్రభుత్వం ఉంది.
10. అయోధ్యలో నేడు శ్రీరాముడి విగ్రహావిష్కరణ
అయోధ్యలో ఏడు అడుగుల శ్రీరాముడి విగ్రహాన్ని యూపీ సీఎం యోగి ఆదిత్యానాథ్‌ శుక్రవారం ఆవిష్కరించనున్నారు. అయోధ్యలోని శోధ్‌ సంస్ధాన్‌ మ్యూజియంలో రోజ్‌వుడ్‌తో ఈ విగ్రహాన్ని నిర్మించారు. కర్ణాటక నుంచి రూ 35 లక్షలు వెచ్చించి కొనుగోలు చేసిన ఈ విగ్రహాన్ని మ్యూజియంలో ప్రదర్శనకు ఉంచుతారు. రాముడి ఐదు అవతారాల్లో ఒకటైన కోదండరాముని అవతారంలో ఈ విగ్రహం రూపొందింది.మ్యూజియంలో రాముడి గురించిన పలు చారిత్రక ఘట్టాలతో 2500కు పైగా చిత్రాలు, కళారూపాలు ఉన్నా కోదండరాముని గురించి వర్ణించే ఆనవాళ్లు లేవు. కోదం‍డరామ విగ్రహాన్ని కర్ణాటక స్టేట్‌ ఆర్ట్స్‌ అండ్‌ క్రాఫ్ట్‌ ఎంపోరియం నుంచి కొనుగోలు చేశారు. ఇక యూపీ సీఎం యోగి ఆదిత్యానాథ్‌ అయోధ్యలో శుక్రవారం మధ్యహ్నం 2.30 గంటల ప్రాంతంలో ఈ విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు.
11. అద్భుతం.. ఆ గుడిలో దీపం నీటితో వెలుగుతుంది..
నిప్పుని ఆర్పాలంటే నీళ్లు కావాలి. దీపాన్ని వెలిగించాలంటే నూనె లేదా నెయ్యి కావాలి. కానీ కొన్ని అద్భుతాలు ఆశ్చర్యాన్ని కలిగిస్తుంటాయి. ఈ కోవెలలోని దేవుడికి నూనెతో పని లేకుండా నీటితో దీపారాధన చేస్తున్నారు. మధ్యప్రదేశ్‌లోని సాజాపూర్ జిల్లా కాలీసింద్ నది ఒడ్డున ఉన్న గడియాఘాట్ మాతాజీ మందిరంలో ఈ అద్భుతం కనిపిస్తుంది. గత ఐదేళ్ల నుంచి ఈ అఖండ జ్యోతి వెలుగులు పంచుతూనే ఉంది. దేశంలోని చాలా దేవాలయాల్లో ఇలా ఆరకుండా వెలిగే జ్యోతులు ఉన్నా ఇక్కడి ఆలయంలోని జ్యోతి మాత్రం చాలా ప్రత్యేకమైనదని ఆలయ నిర్వాహకులు చెబుతున్నారు. ప్రమిదలో నిత్యం నూనెకు బదులు నీటిని పోస్తే చాలు వెలుగుతూనే ఉంటుందన్నారు. ఆలయ పూజారి సిందూ సింగ్ మాట్లాడుతూ.. ఇంతకు ముందు నూనెతోనే దీపారాధన చేసేవారం. కానీ ఒక రోజు అమ్మవారు కలలో కనిపించి నీటితో జ్యోతి వెలిగించమని చెప్పారు. ఆమె ఆదేశాల ప్రకారం ఆరోజు నుంచి అలానే చేస్తున్నామని చెప్పుకొచ్చారు. అప్పటి నుంచి దీపం నిరంతరాయంగా వెలుగుతూనే ఉంది అని తెలిపారు. అయితే తాను నీటితో దీపాన్ని వెలిగిస్తున్నానని చెబితే ఎవరూ నమ్మరని చాలా కాలం ఆ విషయాన్ని ఎవరికీ చెప్పలేదన్నారు. ఈ ఆలయం నదీ తీరంలో ఉండడం వలన వర్షాకాలంలో పూర్తిగా నీట మునుగుతుంది. దీంతో వర్షాకాలమంతా ఆలయాన్ని మూసే ఉంచుతారు నిర్వాహకులు. మళ్లీ దసరా నవరాత్రులకు ఆలయాన్ని తెరిచి పూజాదికాలు నిర్వహిస్తారు.