తెదేపా హయాంలో ఆంధ్ర రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో డిజిటల్ తరగతుల ఏర్పాటుకు ఉత్తర అమెరికాలో ఏపీ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి కోమటి జయరాం సారథ్యంలో ఏపీ జన్మభూమి ఆధ్వర్యంలో విరాళాలను సేకరించారు. ఈ క్రమంలో భాగంగా కృష్ణా జిల్లాలోని 100 పాఠశాలల్లో డిజిటల్ తరగతుల ఏర్పాటుకు ప్రవాసులు అందించిన ₹35లక్షల చెక్కును జయరాం శుక్రవారం నాడు కృష్ణా కలెక్టర్ ఇంతియాజ్‌కు అందజేశారు. విద్యా వ్యవస్థ పటిష్ఠవంతానికి ప్రవాసుల చేయూతను ఈ సందర్భంగా కలెక్టర్ అభినందించారు. ఈ నిధికి పెద్దమొత్తంలో సాయపడిన ప్రవాసాంధ్ర ప్రముఖుడు డా.లకిరెడ్డి హనిమిరెడ్డికి జయరాం, కలెక్టర్ ఇంతియాజ్‌లు ధన్యవాదాలు తెలిపారు.
కృష్ణా కలెక్టర్‌కు ₹35లక్షలు అందించిన కోమటి జయరాం
Related tags :