Movies

రెచ్చిపోయి రెచ్చగొడుతోంది

Lavanya Tripathi On Fire With Glamour Presentations

‘భలే భలే మగాడివోయ్’ సినిమాతో ఫామ్‌లోకి వచ్చిన ముద్దుగుమ్మ లావణ్య త్రిపాఠి. ఆ తర్వాత వరుస అవకాశాలే కాదు వరుస విజయాలతోనూ దూకుడు ప్రదర్శించింది. కానీ ఈ మధ్య లావణ్యకు ఏదీ అంతగా కలిసి రావడం లేదు. వరుస ఫ్లాపులతో ఆమె సతమతమవుతోంది. ఇక నిఖిల్ ‘అర్జున్ సురవరం’ సినిమాతోనైనా గట్టెక్కేయొచ్చు అనుకున్న లావణ్య త్రిపాఠికి చుక్కెదురైంది. ఈ సినిమా విడుదల అర్ధాంతరంగా ఆగిపోయింది. అయితే లావణ్య త్రిపాఠి మాత్రం అదేమీ పట్టించుకోకుండా హాయిగా సోషల్ మీడియాలో అందాలు ఒలకబోస్తోంది. ఈ మధ్య గ్లామర్‌తో తెగ రెచ్చిపోతోంది లావణ్య త్రిపాఠి. తాజాగా సోషల్ మీడియాలో ఈ హాట్ భామ పోస్ట్ చేసిన ఓ ఫొటో సందడి చేస్తోంది. డెనిమ్ జీన్స్, వైట్ కలర్ టాప్‌లో ఈ బ్యూటీ ఒంపుసొంపులు యువకుల మతులు పోగొడుతున్నాయి.