ముంబై మహానగరం.. బడుగు జీవుల నుంచి బడా వ్యాపారవేత్తల వరకు ఇదే ఆవాసం. కూలీ పనులకు వెళ్లే వారి నుంచి పెద్ద పెద్ద వ్యాపారాలు చేసే ప్రజలతో ఈ మహానగరం ఎప్పుడూ రద్దీగా ఉంటుంది. రాత్రి పగలు తేడా లేకుండా వాహనాల రొదతో చెవులు మార్మోగుతుంటాయి. అలాంటి ఈ నగరం ప్రపంచంలోనే అత్యంత రద్దీ అయినది అని తెలుసా! లొకేషన్ టెక్నాలజీ నిపుణులైన టామ్ టామ్ అనే సంస్థ ప్రపంచ నగరాల్లోని ట్రాఫిక్‌పై అధ్యయనం చేసి ఈ విషయాన్ని వెల్లడించింది. ప్రపంచ నగరాల్లో ముంబైలోనే ట్రాఫిక్ సమస్య అత్యధికమని నివేదికలో తెలిపింది.ఈ నగరంలో రద్దీ వేళల్లో గమ్యస్థానాలకు వెళ్లాలంటే 65 శాతం ఎక్కువ సమయం సమయం పడుతోందని పేర్కొంది. 2017తో పోలిస్తే ఈ సమయం 1 శాతం తగ్గడం గమనార్హం. ముంబై తర్వాత కొలంబియా రాజధాని బొగొట(63ు), పెరూలోని లిమా(58ు)లో ట్రాఫిక్ సమస్య ఎక్కువగా ఉంది. ఇక ఈ జాబితాలో దేశ రాజధాని న్యూఢిల్లీ(58 శాతం)తో నాలుగో స్థానంలో నిలిచింది.
విపరీతమైన జనాభా నగరంగా ముంబై
Related tags :