మెంటల్ మదిలో సినిమాతో టాలీవుడ్‌కు పరిచయం అయిన భామ నివేదా పేతురాజ్. తొలి సినిమాతోనే నటిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న నివేదా, కోలీవుడ్‌లోనూ వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు. ప్రస్తుతం ఆరు సినిమాల్లో నటిస్తున్న ఈ బ్యూటీ మరో క్రేజీ ప్రాజెక్ట్‌కు ఓకె చెప్పినట్టుగా తెలుస్తోంది. ఇప్పటి వరకు తెలుగులో మీడియం రేంజ్ హీరోలతో మాత్రమే నటించిన ఈ భామ త్వరలో ఓ స్టార్ హీరో సినిమాలో నటించనున్నారు.అల్లు అర్జున్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న సినిమాలో నివేదా పేతురాజ్ కీలక పాత్రలో నటించనున్నారు. అయితే ఈ సినిమాలో నివేదా హీరోయిన్‌గా నటిస్తున్నారా? లేక స్పెషల్ రోలా? అన్న విషయం తెలియాల్సి ఉంది. పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమా ప్రస్తుతం నిర్మాణ కార్యక్రమాలు జరుపుకుంటోంది. ఈ సినిమాను హారికా హాసిని క్రియేషన్స్, గీతా ఆర్ట్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి
పూజకు పోటీగా నివేధా
Related tags :