నిజాం నవాబుల నగలను ఈ నెల 14 నుంచి న్యూయార్క్‌లో ప్రదర్శనకు ఉంచనున్నారు. నిజాం నవాబులు ధరించిన నెక్లెస్, గోల్కొండ వీధుల్లో కొనుగోలుచేసిన వజ్రంతోపాటు మొఘల్ చక్రవర్తి షాజహాన్ వినియోగించిన కత్తి, హైదరాబాద్ దక్కన్ పాన్బాక్స్తోపాటు వజ్ర వైఢూర్యాలు, ఆభరణాలెన్నో ఈ ప్రదర్శనలో కొలువుదీరనున్నాయి. మొఘల్, నిజాం నవాబులతోపాటు పలు రాజ కుటుంబాలకు చెందిన సుమారు 400 రకాల ఆభరణాలు, వజ్రాలు, కత్తులు, బంగారు కప్పులు, తైలవర్ణ చిత్రాలను ప్రదర్శించనున్నారు. ద అల్ థాని కలెక్షన్ ఫౌండేషన్ సేకరించిన ఈ ఆభరణాలను న్యూయార్క్‌కు చెందిన క్రిస్టీస్ ఎడ్యుకేషన్ ట్రస్ట్ ఈ నెల 19న ఆన్లైన్లో వేలం వేయనున్నది. ఒక్కో ఆభరణం విలువను రూ.కోటి నుంచి రూ.20 కోట్ల వరకు నిర్ణయించారు. వేలం ద్వారా వచ్చే నిధులను ప్రపంచవ్యాప్తంగా ఎగ్జిబిషన్లు, పుస్తక ప్రచురణలు, మ్యూజియాల నిర్వహణకు, విద్యార్థుల చదువులకు, స్కాలర్షిప్లు తదితరాలకు వినియోగించనున్నారు.
న్యూయార్క్ వెళ్తున్న నిజాం నగలు
Related tags :