DailyDose

ఫోరెక్స్ నిల్వలు పెరిగాయి-వాణిజ్య-06/07

June 08 2019 - Daily Business News - Forex reserves increased in India says RBI

* భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఎలక్టోరల్‌ అధికారిగా ఎన్నికల మాజీ ప్రధాన కమిషనర్‌ ఎన్‌. గోపాలస్వామి నియమితులయ్యారు.
* 86పాయింట్ల స్వల్ప లాభంతో సెన్సెక్స్‌.
వరుస నష్టాల నుంచి దేశీయ మార్కెట్లు కాస్త కోలుకున్నాయి. అంతర్జాతీయ మార్కెట్ల ప్రతికూల సంకేతాలు, దేశీయంగా కీలక రంగాల షేర్లలో అమ్మకాలతో ఈ ఉదయం సూచీలు నష్టాలతో ప్రారంభమైనప్పటికీ క్రమంగా కోలుకున్నాయి. నష్టాల నుంచి గట్టెక్కి స్వల్ప లాభాలను దక్కించుకున్నాయి.వ ద్ధిరేటు భయాలతో కుప్పకూలిన స్టాక్‌ మార్కెట్లు శుక్రవారం కూడా అదే నిరుత్సాహంతో ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. మార్కెట్‌ ఆరంభంలో సెన్సెక్స్‌ 200 పాయింట్లకు పైగా పడిపోయింది. నిఫ్టీ కూడా 11,800 మార్క్‌ వద్ద ఊగిసలాడింది. అయితే మధ్యాహ్నం సమయానికి సూచీలు కాస్త కోలుకున్నాయి.
*విదేశీ మారకపు (ఫారెక్స్‌) నిల్వలు స్వల్పంగా పెరిగినట్లు రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా గణాంకాలు వెల్లడిస్తున్నాయి.
*గత నెలలో వినియోగదారు విశ్వాసం సడలిందని రిజర్వు బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) సర్వే స్పష్టం చేసింది.
*రాజీవ్‌ గాంధీ గ్రామీణ గృహ నిర్మాణ సంస్థ నుంచి రూ.494.04 కోట్ల విలువైన పనులు లభించాయని రాంకీ ఇన్‌ఫ్రా తెలిపింది.
*స్థిరాస్తి వ్యాపారం నుంచి వైదొలిగే దిశగా ఇండియా బుల్స్‌ (ఐబీ) రియల్‌ ఎస్టేట్‌ ప్రమోటర్లు అడుగులు వేస్తున్నారు.
*కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన గిగా స్కేల్‌ లి-అయాన్‌ బ్యాటరీల తయారీ పరిశ్రమను తెలంగాణలో ఏర్పాటు చేయడానికి సిద్ధంగా ఉన్నామని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌కే జోషి తెలిపారు.
*మైండ్‌ట్రీలో 31 శాతం వాటాకు సమానమైన 5.13 కోట్ల షేర్లను ఒక్కోటి రూ.980 చొప్పున కొనుగోలు చేస్తామని ఎల్‌అండ్‌టీ ఓపెన్‌ ఆఫర్‌ ప్రకటించింది.
*తమ కంపెనీతో పాటు డైరెక్టర్‌ పి.వి. రామ్‌ప్రసాద్‌ రెడ్డి, అనుబంధ సంస్థ అరోలైఫ్‌ ఫార్మా ఎల్‌ఎల్‌సీలపై అమెరికాలో ఒక వ్యాజ్యం దాఖలైనట్లు అరబిందో ఫార్మా వివరించింది.
*72 నిరర్థక ఆస్తుల్ని (ఎన్‌పీఏలు) వేలం వేసేందుకు ఆస్తుల పునర్నిర్మాణ కంపెనీలు (ఏఆర్‌సీలు)/బ్యాంకులు/బ్యాంకింగేతర ఆర్థిక సంస్థల (ఎన్‌బీఎఫ్‌సీలు) నుంచి ఆంధ్రా బ్యాంక్‌ బిడ్లు ఆహ్వానించింది.
*కోటక్‌ మహీంద్రా బ్యాంక్‌ ప్రమోటర్లు వాటా తగ్గింపు మార్గదర్శకాలను పాటించనందుకు ఆర్‌బీఐ రూ.2 కోట్ల జరిమానా విధించింది.
*గృహ రుణాలను జులై నుంచి రెపో రేటుతో అనుసంధానం చేయనున్నట్లు స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ) పేర్కొంది.
*ప్రీమియం స్మార్ట్‌ఫోన్ల సంస్థ వన్‌ ప్లస్‌ హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన పరిశోధన, అభివృద్ధి కేంద్రంలో రానున్న మూడేళ్లలో 1,000 మంది ఉద్యోగులను నియమించనుంది.