WorldWonders

ఇండియాలో బిట్‌కాయిన్ వాడితే జైలులో పెడతారంట

No paying with bitcoin in India-If yo do so you will be jailed

బిట్‌కాయిన్‌ తరహా క్రిప్టోకరెన్సీలను వాడితే పదేళ్లపాటు జైలుశిక్ష పడనుంది. ‘క్రిప్టోకరెన్సీ నిషేధం, అధికారిక డిజిటల్‌ కరెన్సీ నియంత్రణ బిల్లు 2019’ ముసాయిదా పత్రంలో ఈ మేరకు ప్రతిపాదన చేర్చారు. క్రిప్టోకరెన్సీని రూపొందించినా, దగ్గర ఉంచుకున్నా, అమ్మినా, లావాదేవీలు జరిపినా పదేళ్ల జైలుశిక్ష విధించాలని అందులో ప్రతిపాదించారు. ఈ తరహా కరెన్సీ వినియోగాన్ని చట్టవిరుద్ధంగా ప్రకటించడమే కాకుండా, బెయిల్‌కు అవకాశం లేని నేరంగా చేయనున్నారు. దీనిపై కఠిన చట్టం త్వరలోనే రూపు దాల్చనున్నట్లు తెలుస్తోంది.