బెజవాడలో గంజాయి విక్రేతలుగా మారిన బీటెక్ విద్యార్థులు
టాస్క్ ఫోర్స్ పోలీసుల అదుపులో పది మంది యువకులు, వారిలో ఆరుగురు బీటెక్ విద్యార్థులు
అరకు నుంచి నేరుగా గంజాయి కొనుగోలు చేసి తమ సహచర విద్యార్థులకు వాటిని కళాశాలలో అమ్ముతున్న పలువురు బీటెక్ విద్యార్థులు
బెజవాడలో 5 కళాశాలల్లో ఇదే పరిస్థితి ఉన్నట్టు గుర్తించి షాక్ తిన్న టాస్క్ ఫోర్స్ పోలీసులు
గన్నవరం, తెల్లప్రోలు, కానూరు, మొగల్రాజపురం ప్రాంతాల్లోని ఇంజినీరింగ్ కళాశాలాల్లో ఇదే పరిస్థితి
తనిఖీల్లో పట్టుబడ్డ బీటెక్ విద్యార్థిని విచారిస్తే బయటపడ్డ అసలు విషయాలు
2 నుంచి 4 కిలోల వరకు గంజాయి తీసుకొచ్చి ప్యాకెట్లుగా మార్చి కళాశాలల్లో అమ్మకాలు
నాలుగు నెలల క్రితం నలుగురు బీటెక్ విద్యార్థులను ఇదే విధంగా పట్టుకుని కౌన్సిలింగ్ ఇచ్చిన టాస్క్ ఫోర్స్
మళ్లీ యధావిధిగా అమ్మకాలు సాగిస్తున్న బీటెక్ రాయుళ్లు
నేరుగా గంజాయి అమ్మే వారితో విద్యార్థులకు ఉన్న సంబంధాలపై పోలీసుల విచారణ