రాయలసీమలోని కొన్ని ప్రాంతాల్లో వజ్రాల కోసం అన్వేషించడం పరిపాటిగా మారింది. ఆర్థిక ఇబ్బందులు ఉన్న వారు, వయోవృద్ధులు వజ్రాన్వేషణ చేయడం గతంలో చూశాం. ఇప్పుడు దూర ప్రాంతాల నుంచి కార్లలో వచ్చి మరీ వజ్రాల కోసం వెతుకులాడటం విశేషం. అదృష్టం వరిస్తే తక్కువ సమయంలోనే రూ.లక్షలు సంపాదించవచ్చని భావిస్తున్నారు. కర్నూలు జిల్లా నందికొట్కూరు నియోజకవర్గానికి చెందిన కొందరు కార్లలో వచ్చి పగిడిరాయి గ్రామ పరిధిలోని పొలాల్లో రెండు రోజులుగా వజ్రాన్వేషణ చేస్తున్నారు. పగలంతా పొలాల్లో వెతుకుతూ రాత్రి పూట అనంతపురం జిల్లా గుత్తి పట్టణంలోని లాడ్జిలో ఉండి వస్తున్నట్లు వారు తెలిపారు. పక్క జిల్లా వాసులే కాకుండా గుంటూరు, ప్రకాశం జిల్లాల నుంచి వజ్రాన్వేషణ కోసం ఏటా ఇక్కడికి వస్తుంటారు.
రాయలసీమ రాళ్లల్లో వజ్రాల కోసం వేట
Related tags :