శింబుకు జోడీగా ‘పోడా పోడీ’లో కథానాయికగా అడుగుపెట్టిన వరలక్ష్మికి.. ఆ తర్వాత ఆశించిన స్థాయిలో అవకాశాలు రాలేదు. దీంతో ఇటీవల ఆమె ప్రతినాయిక పాత్రలపై దృష్టి పెడుతున్నారు. ఇప్పుడు మళ్లీ ఆమె హీరోయిన్‌గా అవకాశాల కోసం వెతుకుతున్నట్లు సమాచారం. అందుకే నాజూగ్గా మారుతోంది. దీనికోసం గంటల కొద్దీ సమయాన్ని జిమ్‌లో కేటాయిస్తున్నట్లు చెబుతున్నారు. అంతేకాకుండా ఇటీవల కొన్ని రోజులుగా జిమ్‌లో తీసుకున్న ఫొటోలను ఆమె సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేస్తున్నారు. బరువు తగ్గినట్లు ఆ ఫొటోల ద్వారా తెలుస్తోంది. ఇదిలా ఉండగా ఆమె నటించిన ‘వెల్వెట్ నగరం’, ‘కన్నిరాశి’, ‘పాంబన్’ చిత్రాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. అలాగే ‘ఛేజింగ్’, ‘డాని’ సినిమాల చిత్రీకరణ కొనసాగుతోంది.
హీరోయిన్ అవ్వాలని…
Related tags :