DailyDose

దీదీని చంపితే కోటి…ఎవరిదా వార్నింగ్?-రాజకీయ-06/10

1Crore INR Announced As Supari For Mamat Banerjees Murder - June 10 2019 - Daily Political News

*పశ్చిమ బెంగాల్‌లోని పరిస్థితులు నానాటికి ఉద్రిక్తమవుతున్నాయి. ఎన్నికల ముందు తృణమూల్, బీజేపీ కార్యకర్తల మధ్య మొదలైన ఘర్షణలు ఇప్పటీకీ కొనసాగుతూనే ఉన్నాయి. ఈ క్రమంలో తాజాగా ఓ లెటర్ బెంగాల్‌లో కలకలం సృష్టిస్తోంది. సీఎం మమతా బెనర్జీ చంపితే కోటి ఇస్తామంటూ రాసిన ఈ లేఖపై తృణమూల్ నేతలు పోలీసులను ఆశ్రయించారు.అసలు వివరాల్లోకి వెళ్తే ఆరాంబాగ్ ఎంపీ అపురూప పొద్దార్‌కు కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు ఈ లేఖను రాసినట్లు తెలుస్తోంది. దీదీని చంపి తల తెచ్చినా.. సజీవంగా తీసుకొచ్చినా వారికి కోటి రూపాయలు ఇస్తామని ఆఫర్ ఇచ్చారు. అంతటితో ఆగకుండా మమతా బెనర్జీ ఫోటోని మార్ఫింగ్ చేసి.. ఈ లేఖతో పంపారట. కాగా ఈ లేఖ రాజ్‌వీర్ కిల్లా అనే వ్యక్తి పేరుపై రాయగా.. ఎంపీ అపురూప శ్రీరామ్‌పూర్ పోలీసులకు లేఖను అప్పగించి.. నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారు.
* మోడీ కోసం పాక్ అనుమతి కోరిన భారత్
షాంఘై కో ఆపరేషన్‌‌ ఆర్గనైజేషన్‌‌ సమ్మిట్‌‌కు హాజరయ్యేందుకు ప్రధాని నరేంద్ర మోడీ కిర్గిస్థాన్‌‌కు పర్యటనకు వెళ్లాల్సి ఉంది. ఈ నేపథ్యంలో మోడీ ఫ్లైట్‌‌ను పాకిస్థాన్‌‌ ఎయిర్‌‌‌‌స్పేస్‌‌ నుంచి వెళ్లేందుకు పర్మిషన్‌‌ ఇవ్వాలని ఇండియా అధికారులు ఆ దేశాన్ని కోరారు. బాలాకోట్‌‌ దాడి జరిగిన తర్వాత ఎయిర్‌‌‌‌స్పేస్‌‌ను మూసేసిన పాకిస్థాన్‌‌ సౌత్‌‌వైపు ఉన్న ఎయిర్‌‌‌‌స్పేస్‌‌ను మాత్రమే తెరిచింది. మోడీ కిర్గిస్థాన్‌‌ వెళ్లేందుకు పాకిస్థాన్‌‌ ఎయిర్‌‌‌‌స్పేస్‌‌ నుంచే వెళ్లాల్సి ఉన్నందున పర్మిషన్‌‌ కోరామని అధికారులు చెప్పారు. మే 21న మాజీ కేంద్ర మంత్రి సుష్మాస్వరాజ్‌‌ కిర్గిస్థాన్‌‌ వెళ్లాల్సి ఉండగా.. ఆమె ఫ్లైట్‌‌కు పాకిస్థాన్‌‌ పర్మిషన్‌‌ ఇచ్చింది.
* మోదీ, జిన్‌పింగ్ భేటీ ఖరారు
భారత ప్రధాని మోదీ, చైనా అధ్యక్షుడు జీ. జిన్‌పింగ్‌ల భేటీ దాదాపు ఖరారైంది. SCO సదస్సు వేదికగా వీరిరువురు సమావేశం కానున్నారు. కిర్గిస్థాన్ రాజధాని బిష్‌కెక్‌లో జూన్ 13,14 తేదీల్లో షాంఘై సహకార సంఘం సదస్సు జరగనుంది. ఈ సందర్భంగా మోదీ-జిన్‌పింగ్ మధ్య భేటీ ఉంటుందని చైనా విదేశాంగ శాఖ ప్రతినిధి కాంగ్ ప్రకటించారు. చైనా ఆధ్వర్యంలో ఏర్పడిన SCOలో ఎనిమిది సభ్య దేశాలు ఉన్నాయి. 2017లో ఇందులో భారత్, పాకిస్థాన్ చేరాయి. కాగా, మోదీ-జిన్‌పింగ్ భేటీ అవుతారని ఇటీవల చైనాలోని భారత దౌత్యవేత్త విక్రమ్ మిస్త్రీ కూడా తెలిపారు.
* ఎమ్మెల్యే జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు
తెలంగాణలో పార్టీ ఫిరాయింపుల రాజకీయం హీటెక్కింది. సంగారెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి టీఆర్ఎస్ సర్కార్ పై ఫైరయ్యారు. ఫిరాయింపులపై జగ్గారెడ్డి టీవీ5కి ప్రత్యేకంగా మాట్లాడారు. అసెంబ్లీలో తగినంత సభ్యుల బలం ఉన్నా.. కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేయాల్సిన అవసరం ఏముందని ఆయన ప్రశ్నించారు. అసెంబ్లీలో ప్రశ్నించే గొంతు లేకుండా చేయడమనేది దారుణమన్నారు. కేసీఆర్ నియంత పోకడలు మంచిదికాదని హితవు పలికారు. సభలో ప్రతిపక్షం లేకపోతే ప్రజా సమస్యలు ఎలా చర్చకు వస్తాయని సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డితో అన్నారు.
* అంబరీశ్‌ సాయం పొందినవారే బెదిరించారు-మండ్య ఎంపీ సుమలత
రాజకీయాల్లోకి రావాలనే తపనకానీ.. పదవులు అనుభవించాలనే ఆసక్తికానీ ఉండేది కాదని అంబరీశ్‌తో సాయం పొందినవారే ఆయన దూరమైన రెండు నెలలకే బెదరించారని… తేల్చుకునేందుకే రాజకీయాల్లోకి వచ్చానని మండ్య ఎంపీ సుమలత అభిప్రాయపడ్డారు. కన్నడ చానెల్‌లో వీకెండ్‌ ప్రోగ్రామ్‌లో ఆమె తన మనోభావాలను వెల్లడించారు. అంబరీశ్‌ స్వర్గస్తులయ్యాక మండ్య జిల్లాలో పలు ప్రాంతాలలో వర్ధంతి సభలు అభిమానులు జరిపారని సదరు కార్యక్రమాలకు కుమారుడు అభిషేక్‌తో కలసి వెళ్ళానన్నారు. మాతో కలసి ఉండేలా రాజకీయాల్లోకి రావాలని పలువురు కోరారన్నారు.
* దీక్ష విరమించిన భట్టి విక్రమార్క
సీఎల్పీ విలీనాన్ని నిరసిస్తూ గత మూడు రోజులుగా చేపట్టిన ఆమరణ నిరాహార దీక్షను కాంగ్రెస్‌ నేత భట్టి విక్రమార్క విరమించారు. నిమ్స్‌లో దీక్ష కొనసాగిస్తున్న ఆయనకు పార్టీ నేతలు ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి, జానారెడ్డి తదితరులు నిమ్మరసం ఇచ్చి దీక్షను విరమింపజేశారు. అంతకుముందు ఏఐసీసీ నేతలు భట్టితో ఫోన్‌లో మాట్లాడారు. దీక్షను విరమించాలని కోరారు. కాంగ్రెస్‌ నేతల విజ్ఞప్తి మేరకు దీక్షను విరమిస్తున్నట్లు భట్టి వెల్లడించారు.
*దేవినేని ఉమకు కొడాలి నాని కృతజ్ఞుడిగా ఉండాలి
తెలుగుదేశం పార్టీలో విజయవాడ ఎంపీ కేశినేని నాని వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావును లక్ష్యంగా చేసుకుంటూ సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టడం మరో రాజకీయ దుమారానికి తెరలేపింది.దేవినేని ఉమకు కొడాలి నాని జీవితాంతం కృతజ్ఞుడిగా ఉండాలంటూ తాజాగా కేశినేని నాని పోస్ట్ చేశారు. దేవినేని వల్లే కృష్ణా జిల్లా నుంచి కొడాలి నానికి మంత్రి అయ్యే అవకాశం దక్కిందని వ్యంగ్యాస్త్రం సంధించారు. ఇటీవలే అధినేత చంద్రబాబుతో సమావేశమై తాను గత అయిదేళ్లలో పార్టీలో ఏ విధంగా ఇబ్బందులు పడిందీ వివరించారు. ఇవాళ మరో పోస్టు పెట్టడంతో నాని ఆంతర్యం ఏమిటన్నది తెలుగుదేశంలో ప్రశ్నార్థకంగా మారింది.
*కేసీఆర్‌ను గద్దె దించేదాకా పోరాటం
అధికారాన్ని అడ్డుపెట్టుకొని ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్‌ను గద్దెదించేంత వరకూ పోరాటం సాగిస్తామని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, ఎమ్మెల్యే మల్లు భట్టివిక్రమార్క తెలిపారు. సీఎల్పీ విలీనానికి నిరసనగా హైదరాబాద్‌లోని ఇందిరాపార్కు వద్ద కాంగ్రెస్‌ తరఫున ఆయన చేపట్టిన ప్రజాస్వామ్య పరిరక్షణ దీక్ష ఆదివారం రెండో రోజూ కొనసాగింది. దీక్షా శిబిరానికి పలువురు కాంగ్రెస్‌ నేతలు, ఇతర ముఖ్యులు వచ్చి సంఘీభావం ప్రకటించారు.
*జిల్లాల్లో ప్రగతి పరుగులు తీయాలి
రాష్ట్రం మాదిరిగానే తెలంగాణలోని అన్ని జిల్లాల్లో, మండలాల్లో ప్రగతి పరుగులు తీయాలని తెరాస పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ సూచించారు. పల్లెల్లోనూ ఆదర్శపాలన సాగాలని, ప్రజలంతా సుఖసంతోషాలతో జీవించేందుకు ప్రజాప్రతినిధులు కృషి చేయాలని కోరారు. ఇకపై గ్రామ, మండల, జిల్లా స్థాయి సమస్యలన్నీ స్థానికంగానే పరిష్కారం కావాలన్నారు. కొత్త జడ్పీ ఛైర్‌పర్సన్లు పలువురు ఆదివారం కేటీఆర్‌ను ఆయన నివాసంలో కలిశారు.
*ఉగ్రవాదంపై ఉమ్మడి పోరు
ఉగ్రవాదంతో భారత్‌, శ్రీలంక ఉభయ దేశాలకూ ముప్పు ఏర్పడిందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. దీనిని ఉమ్మడిగా ఎదుర్కోవలసి ఉందని పిలుపునిచ్చారు. ఆదివారం శ్రీలంక రాజధాని కొలంబోలో పర్యటించిన ఆయన ఆ దేశ అధ్యక్షుడు మైత్రీపాల సిరిసేనతో చర్చలు జరిపారు. ఏప్రిల్‌లో చర్చిలపై ఉగ్రవాదుల దాడులు జరిగిన అనంతరం శ్రీలంకను సందర్శించిన తొలి విదేశీ నేత మోదీయే కావడం గమనార్హం. పిరికిపంద చర్యలు శ్రీలంకను ఏమీ చేయలేవని మోదీ అన్నారు. అభివృద్ధిలో భాగస్వామిగా ఉంటామని తెలిపారు. ఉగ్రవాదుల దాడికి గురయిన సెయింట్‌ ఆంటోని చర్చిని సందర్శించి బాధితులకు నివాళులు అర్పించారు. ముందుగా నిర్ణయించిన పర్యటన ప్రణాళికలో లేనప్పటికీ, ఈ చర్చికి వెళ్లడం గమనార్హం. ప్రధాని రణిల్‌ విక్రమసింఘే, ప్రతిపక్ష నేత మహింద రాజపక్సతోనూ చర్చలు జరిపారు. ఆర్‌.సంపతన్‌ ఆధ్వర్యంలో తమిళ జాతీయ కూటమి నాయకులు మోదీని కలిసి రెండోసారి విజయం సాధించినందుకు అభినందనలు తెలిపారు.
*ఇకపై నా రాజకీయం చూస్తారు
ఆంధ్రప్రదేశ్‌లో జనసేన ప్రభుత్వాన్ని ఎందుకు ఏర్పాటు చేయలేకపోయిందో సమీక్షిస్తామని జనసేన అధ్యక్షుడు పవన్‌కళ్యాణ్‌ వ్యాఖ్యానించారు.‘‘ఇప్పటివరకూ నా ఆశయాలు చూశారు. ఇక నుంచి నా రాజకీయ వ్యూహాలు, ఎత్తుగడలు కూడా చూస్తారు. దెబ్బకు దెబ్బ తీస్తా. రాజకీయం అన్నాక కష్టనష్టాలుంటాయి. అన్నింటినీ తట్టుకుని నిలబడే ధైర్యం నాకుంది. స్థానిక సంస్థల ఎన్నికలలో క్షేత్రస్థాయిలో జనసేన బలాన్ని పెంచుకుందాం’’అని పిలుపునిచ్చారు.
*మమతతో కలిసి పనిచేసేందుకు ప్రశాంత్‌ కిశోర్‌కు అనుమతి?
తృణమూల్‌ కాంగ్రెస్‌ అధ్యక్షురాలు మమతా బెనర్జీకి ఎన్నికల వ్యూహరచనలో తోడ్పడేలా తమ పార్టీ ఉపాధ్యక్షుడు ప్రశాంత్‌ కిశోర్‌ కుదుర్చుకున్న ఒప్పందానికి జేడీయూ అధినేత, బిహార్‌ ముఖ్యమంత్రి నీతీశ్‌ కుమార్‌ ఆమోద ముద్ర వేసినట్లే కనిపిస్తోంది. ఈ ఒప్పందంపై జేడీయూ జాతీయ కార్యవర్గ సమావేశంలో ప్రశాంత్‌ కిశోర్‌ వివరణ ఇస్తారని విస్తృతంగా ప్రచారం జరిగినప్పటికీ అలాంటిదేమీ చోటుచేసుకోలేదు. పట్నాలో ఆదివారం జరిగిన ఈ సమావేశంలో నీతీశ్‌ పక్కనే ప్రశాంత్‌ కూర్చున్నారు.
*మమత కోటపై భాజపా గురి
పశ్చిమ బెంగాల్‌లో పాగా వేయడానికి భాజపా అప్పుడే పావులు కదుపుతోంది. 2021లో జరిగే అసెంబ్లీ ఎన్నికలే లక్ష్యంగా కసరత్తు ప్రారంభించింది. ఇందుకోసం తృణమూల్‌ కాంగ్రెస్‌ నేతలను ఆకర్షించడం, క్షేత్రస్థాయిలో పార్టీని పటిష్ఠపరచడం అన్న వ్యూహాలను అమలు చేయనుంది. ఇటీవలి పార్లమెంటు ఎన్నికల్లో మొత్తం 42 స్థానాల్లో భాజపా 18 చోట్ల గెలుపొందింది. 40.5 శాతం ఓట్లు పొందింది. అసెంబ్లీలో కేవలం ఆరు స్థానాలే గెల్చుకుంది. పశ్చిమ బెంగాల్‌ అసెంబ్లీలో మొత్తం 294 స్థానాలు ఉండగా, కనీసం 250 సీట్లు పొందాలన్న లక్ష్యాన్ని పెట్టుకున్నామని భాజపా రాష్ట్ర ఇన్‌ఛార్జి కైలాశ్‌ విజయ్‌వర్గియా తెలిపారు.
*సామాన్య ప్రజలకు విద్య, వైద్యం అందని ద్రాక్షే
ప్రజాస్వామ్యంలో నూటికి ఎనభైశాతం మంది ప్రజలకు విద్య, వైద్యం అందని ద్రాక్షలా మారిందని లోక్‌సత్తా వ్యవస్థాపకులు జయప్రకాష్‌ నారాయణ ఆందోళన వ్యక్తం చేశారు. ఇవి సామాన్యులకు చేరాలంటే స్థానిక ప్రభుత్వాలకు అధికారాలను బదలాయించడంతోపాటు నిధులు, సిబ్బందిని సమకూర్చాలని డిమాండ్‌ చేశారు. తెలంగాణ లోక్‌సత్తా పార్టీ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ఆదివారం హైదరాబాద్‌లో ‘స్థానిక ప్రభుత్వాలు సాధికారత ఆవశ్యకత’ అనే అంశంపై నిర్వహించిన రౌండ్‌టేబుల్‌ సమావేశంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు.
*ప్రాజెక్టులను సందర్శిస్తాం: సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి
రాష్ట్రంలో ప్రభుత్వం చేపట్టిన సాగునీటి ప్రాజెక్టులను సందర్శించాలని సీపీఐ నిర్ణయించింది. శనివారం ఆ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి ఆదివారం విలేకరులకు వెల్లడించారు. ప్రాజెక్టుల నిర్మాణాలపై ప్రభుత్వం ఒకటి చెబుతోండగా.. అధికార పార్టీ పత్రిక మరో విధంగా రాస్తోందని పేర్కొన్నారు. మిషన్‌ భగీరథ ప్రారంభించి ఐదేళ్లు దాటుతున్నా.. ఇంటింటికీ నల్లా కనెక్షన్‌ ఇవ్వలేకపోయారని విమర్శించారు. ఇలాంటి పరిస్థితుల్లో ఈనెల 19, 20 తేదీల్లో ప్రాజెక్టుల బాట పట్టాలని రాష్ట్ర సమావేశం నిర్ణయించినట్లు చాడ వెల్లడించారు.
*మహిళా బిల్లును ప్రవేశపెట్టాలి: ఆర్‌.కృష్ణయ్య
త్వరలో జరగనున్న పార్లమెంటు సమావేశాల్లో మహిళా బిల్లు ప్రవేశపెట్టాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్‌.కృష్ణయ్య కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. జనాభా ప్రకారం బీసీ మహిళలకు సబ్‌ కోటా ఇవ్వాలని కోరారు. ఆదివారం హైదరాబాద్‌లో జరిగిన ఆంధ్రప్రదేశ్‌ బీసీ మహిళా సంఘం సమావేశంలో ఆయన మాట్లాడారు.
*సామాన్య ప్రజలకు విద్య, వైద్యం అందని ద్రాక్షే
ప్రజాస్వామ్యంలో నూటికి ఎనభైశాతం మంది ప్రజలకు విద్య, వైద్యం అందని ద్రాక్షలా మారిందని లోక్‌సత్తా వ్యవస్థాపకులు జయప్రకాష్‌ నారాయణ ఆందోళన వ్యక్తం చేశారు. ఇవి సామాన్యులకు చేరాలంటే స్థానిక ప్రభుత్వాలకు అధికారాలను బదలాయించడంతోపాటు నిధులు, సిబ్బందిని సమకూర్చాలని డిమాండ్‌ చేశారు. తెలంగాణ లోక్‌సత్తా పార్టీ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ఆదివారం హైదరాబాద్‌లో ‘స్థానిక ప్రభుత్వాలు సాధికారత ఆవశ్యకత’ అనే అంశంపై నిర్వహించిన రౌండ్‌టేబుల్‌ సమావేశంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు.
*జడ్పీ ఛైర్మన్ల ఎన్నికలపై కేటీఆర్‌ ప్రకటనలు అవాస్తవం
రాష్ట్రంలోని 32 జిల్లాల్లో జరిగిన జిల్లా పరిషత్‌ ఎన్నికల్లో 50 శాతం ఛైర్మన్‌ పదవులను బడుగు, బలహీనవర్గాల వారికి ఇచ్చామని తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ ప్రకటించడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్‌ తెలిపారు. కేటీఆర్‌ వ్యాఖ్యలు పూర్తిగా అవాస్తవమన్నారు. ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ను చూసి తెరాస పార్టీకి కనువిప్పు కలగాలన్నారు.
*మహిళా బిల్లును ప్రవేశపెట్టాలి: ఆర్‌.కృష్ణయ్య
త్వరలో జరగనున్న పార్లమెంటు సమావేశాల్లో మహిళా బిల్లు ప్రవేశపెట్టాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్‌.కృష్ణయ్య కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. జనాభా ప్రకారం బీసీ మహిళలకు సబ్‌ కోటా ఇవ్వాలని కోరారు. ఆదివారం హైదరాబాద్‌లో జరిగిన ఆంధ్రప్రదేశ్‌ బీసీ మహిళా సంఘం సమావేశంలో ఆయన మాట్లాడారు.
*ఇకపై నా రాజకీయం చూస్తారు
ఆంధ్రప్రదేశ్‌లో జనసేన ప్రభుత్వాన్ని ఎందుకు ఏర్పాటు చేయలేకపోయిందో సమీక్షిస్తామని జనసేన అధ్యక్షుడు పవన్‌కల్యాణ్‌ వ్యాఖ్యానించారు.‘‘ఇప్పటివరకూ నా ఆశయాలు చూశారు. ఇక నుంచి నా రాజకీయ వ్యూహాలు, ఎత్తుగడలు కూడా చూస్తారు. దెబ్బకు దెబ్బ తీస్తా. రాజకీయం అన్నాక కష్టనష్టాలుంటాయి. అన్నింటినీ తట్టుకుని నిలబడే ధైర్యం నాకుంది. స్థానిక సంస్థల ఎన్నికలలో క్షేత్రస్థాయిలో జనసేన బలాన్ని పెంచుకుందాం’’అని పిలుపునిచ్చారు. ఆదివారం అనంతపురం, చిత్తూరు, కర్నూలు, కడప జిల్లాల్లో జనసేన పార్టీ తరఫున పోటీ చేసిన అభ్యర్థులతో, జనసైనికులతో మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో పవన్‌ భేటీ అయ్యారు.