ప్రేమలో విఫలమైతే ఎవరికైనా బాధ ఉండటం సహజం. అయితే ఆ బాధను తట్టుకోలేక వారు పాల్పడే చర్యలు కొన్ని సార్లు అయ్యో పాపం అనిపిస్తే, మరి కొన్ని కాస్త విచిత్రంగా ఉంటూ నవ్వు తెప్పిస్తాయి. బాలీవుడ్ అగ్రకథానాయకుడు ఆమీర్ ఖాన్ చేసిన పని కూడా అలాగే అనిపిస్తుంది. ఆయన టీనేజ్‌లో ఉన్నప్పుడు ఓ అమ్మాయి నచ్చి తన ప్రేమ విషయాన్ని చెప్పారట. అయితే ఆమీర్ ప్రతిపాదనను ఆమె తిరస్కరించింది. ఇలా ఒకసారి కాదు.. మూడు సార్లు ముగ్గురు అమ్మాయిలతో తిరస్కారానికి గురయ్యారు ఆమీర్. అయినా పట్టువదలని విక్రమార్కుడిలా నాలుగోసారీ ప్రేమించారట. కానీ ఆ అమ్మాయి కూడా నో చెప్పడంతో హతాశుడయ్యారు ఆమీర్. గుండెల నిండా దుఃఖం ఆవరించగా, ఏం చేయాలో పాలుపోని స్థితిలో సరాసరి సెలూన్‌కు వెళ్లి గుండు కొట్టించుకున్నారట. అసలు ఆ పని ఎందుకు చేశానో తెలియదని, ఇప్పుడు తల్చుకుంటే తనది ఎంత మూర్ఖత్వమో అనిపిస్తుందని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు ఆమీర్. టీనేజ్ ప్రేమలు విఫలమైనా తర్వాత సినీ రంగంలోకి ప్రవేశించి కథానాయకుడిగా ఓ ప్రత్యేకతను సాధించుకోవడమే కాదు.. ప్రేమలోనూ విజయం సాధించి కిరణ్‌రావ్‌ను పెళ్లి చేసుకున్నారు ఆమీర్.
అమీర్‌ఖాన్‌కు గుండు కొట్టించింది
Related tags :