హాలీవుడ్ సినిమాల్లో మన ఇండియన్ తారలు అప్పుడప్పుడు మెరుస్తూనేఉన్నారు. ఐశ్వర్యా రాయ్, ప్రియాంకా చోప్రా, దీపికా పదుకోన్ ఇలా హాలీవుడ్ సినిమాల్లో కనిపిస్తూనే వచ్చారు. ప్రియాంక అయితే ఏకంగా హాలీవుడ్‌కే మకాం మార్చేశారు. తాజాగా సీనియర్ నటి డింపుల్ కపాడియా ఓ హాలీవుడ్ సినిమాలో నటించడానికి అంగీకరించారు. హాలీవుడ్ క్రేజీ దర్శకుల్లో ఒకరైన క్రిస్టోఫర్ నోలన్ దర్శకత్వంలో తెరకెక్కబోయే చిత్రంలో డింపుల్ నటించనున్నారు. ఇంగ్లీష్ సినిమాలో నటించడం ఆమెకు ఇది మొదటిసారేం కాదు, ‘లీలా’ (2002) అనే ఆంగ్ల చిత్రంలో ఆల్రెడీ నటించారామె. యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కే తాజా చిత్రంలో ఆస్కార్ విజేత డేవిడ్ వాషింగ్టన్ హీరోగా నటించనున్నారు. ఈ సినిమాకు ‘టెనిట్’ అనే టైటిల్ ఫిక్స్ చేశారు. సుమారు ఏడు దేశాల్లో ఈ సినిమాను షూట్ చేయనున్నారట. వచ్చే ఏడాది జూలై 17న రిలీజ్ కానున్న ఈ చిత్రాన్ని వార్నర్ బ్రదర్స్ డిస్ట్రిబ్యూట్ చేయనున్నారు.
కపాడియాకు క్రిస్టోఫర్ కాల్
Related tags :