పంట బాగా పండాలని ఏకంగా బాలుడిని బలి ఇచ్చిన దారుణం ఒడిశాలో జరిగింది. నువాపడా జిల్లా జడముండా గ్రామానికి చెందిన చింతామణి మాఝి శనివారం పొలంలో పనిచేసుకుంటున్నాడు. ఆ పక్కనే చింతామణి తమ్ముడు రూప్‌సింగ్ కూడా ఆయన పొలంలో పనిచేసుకుంటున్నాడు. మధ్యాహ్నసమయంలో రూప్‌సింగ్ కొడుకు ధన్‌సింగ్(12) వాళ్ల నాన్న కోసం భోజనం తీసుకు వస్తుండగా చింతామణి పిలిచాడు. తన వద్దనున్న కత్తితో పొలంలోనే బాలుడి పీక కోసి చంపేశాడు. దూరం నుంచి గమనించిన బాలుడి తండ్రి పరుగుదీస్తూ అక్కడికి చేరుకున్నాడు. అప్పటికే నిందితుడు బాలుడి తలను మొండెం నుంచి వేరు చేశాడు. తన వద్దనున్న కత్తితో రూప్‌సింగ్‌ను కూడా బెదిరించాడు. పొలాల్లో పనిచేస్తున్న వారు ఘటనాస్థలికి చేరుకుని నిందితున్ని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. ఖరీఫ్ సాగు బాగుండాలంటే నరబలి ఇవ్వాలని తాంత్రికుడు తెలిపాడని, అందుకే సొంత తమ్ముడి కొడుకుని బలి ఇవ్వాలని నిర్ణయించుకున్నట్టు నిందితుడు తెలిపాడని పోలీసులు వివరించారు.
పంట బాగా పండాలని బిడ్డను నరికేశాడు
Related tags :