*స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 579 స్పెషలిస్ట్ కేడర్ ఆఫీసర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. మొత్తం ఖాళీలు: 579
హెడ్ (ప్రొడక్ట్, ఇన్వెస్ట్‌మెంట్ అండ్ రీసెర్చ్): 01.. సెంట్రల్ రీసెర్చ్ టీమ్: 01.. రిలేషన్‌షిప్ మేనేజర్: 486.. కస్టమర్ రిలేషన్‌షిప్ ఎగ్జిక్యూటివ్: 66.. రిలేషన్‌షిప్ మేనేజర్ (మ్ లీడ్): 20.. జోనల్ హెడ్ సేల్స్ (రీటైల్): 01.. సెంట్రల్ ఆపరేషన్ టీమ్ సపోర్ట్: 03.. రిస్క్ అండ్ కంప్లియెన్స్ ఆఫీసర్: 01.. దరఖాస్తు ప్రారంభం: 2019 మే 23.. దరఖాస్తుకు చివరి తేదీ: 2019 జూన్ 12.. వెబ్‌సైట్: https://sbi.co.in/careers.. కాంట్రాక్ట్ పద్ధతిన ఎస్‌బీఐ నియమిస్తున్న ఉద్యోగాలు ఇవి. దరఖాస్తుల షార్ట్‌లిస్టింగ్, ఇంటర్వ్యూ ద్వారా ఉద్యోగుల్ని ఎంపిక చేస్తారు.
* వాహనాల థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ ప్రీమియం రేట్లు పెరగనున్నాయి. వాహనం మోడల్, సీసీని బట్టి 4 నుంచి 21 శాతం వరకు ఈ పెంపు ఉండనుంది. కొత్త రేట్లు ఈ నెల 16 నుంచి అమల్లోకి రానున్నాయి. ఈ మేరకు ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా(ఐఆర్‌డీఏఐ) ఉత్తర్వులు జారీ చేసింది. బైక్ లు, కార్లకు ప్రీమియంను పెంచినా.. 350 సీసీ మించిన సూపర్ బైక్లు, 1,500 సీసీ లగ్జరీ కార్ల ప్రీమియం రేట్లలో ఎలాంటి మార్పు చేయలేదు.
* బుల్‌దూకుడు..
దేశీయ మార్కెట్లు సోమవారం భారీ లాభాలతో ప్రారంభమయ్యాయి. ఉదయం 9:16 ప్రాంతంలో సెన్సెక్స్ 296.45 పాయింట్లు లాభపడి 39,912.35 వద్ద కొనసాగుతున్నాయి. అదే సమయంలో నిఫ్టీ 86.10 పాయింట్లు బలపడి 11,956.80 వద్ద ట్రేడవుతోంది. డాలరుతో రూపాయి మారకం విలువ 69.23 వద్ద కొనసాగుతోంది. బంగారం ధర రూ. 149 పెరిగి రూ. 32949గా ఉంది.
*అనిల్ అంబానీ గ్రూపు సంస్థ రిలయన్స్ పవర్ గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో రూ.3,558.51 కోట్ల నికర నష్టాన్ని ప్రకటించింది.
*విదేశీ పోర్ట్ ఫోలియో మదుపర్లు (ఎఫ్‌పీఐలు) దేశీయ కేపిటల్ మార్కెట్లపై ఎంతో ఆసక్తిగా ఉన్నారు. ఈ నెలలో కూడా 4 ట్రేడింగ్ రోజుల్లోనే వారు రూ.7,095.44 కోట్ల పెట్టుబడులు పెట్టారు.
*తాజా వేలంలో ప్రభుత్వ రంగ సంస్థ ఓఎన్‌జీసీ, అనిల్ అగర్వాల్ నేతృత్వంలోని వేదాంతా సంస్థ చెరో 9 చమురు, సహజవాయువు (గ్యాస్) క్షేత్రాలు దక్కించుకోనున్నాయి.
*ఈ వారం స్టాక్ మార్కెట్లు ఎలా కదలుతాయన్నది అమెరికా-మెక్సికో, అమెరికా-చైనా పరిణామాలపై ఆధారపడి ఉంటుందని విశ్లేషకులు అంటున్నారు.
*బిజినెస్-టు-బిజినెస్ (బీ2బీ) విక్రయాలకు సంబంధించి, రూ.50 కోట్ల టర్నోవర్ ఉన్న సంస్థలే ఇ-ఇన్‌వాయిస్‌లు రూపొందించడానికి అవకాశం కల్పించేలా ఆర్థిక శాఖ ప్రతిపాదనలు సిద్ధం చేసింది.
*భారత్‌లో హైబ్రీడ్ వాహనాల పై భారీగా పన్నులు ఉండటంతో వాటి విక్రయాలు చాలా తక్కువగా ఉన్నాయని టొయోటా కిర్లోస్కర్ మోటార్ పేర్కొంది.
*భారతీయ బ్యాంకులకు వేల కోట్ల రుణాలను ఎగ్గొట్టి లండన్‌లో తలదాచుకున్న విజయ్ మాల్యా నేడు భారత్-ఆస్ట్రేలియాల మధ్య ఓవల్ మైదానంలో జరుగుతున్న వరల్డ్ కప్ క్రికెట్ మ్యాచ్‌ను చూసేందుకు వచ్చాడు.
*ప్రధాని నరేంద్ర మోదీని కొచ్చి ఎయిర్‌పోర్టు ఆకర్షించింది. ఆయన రెండోసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తన తొలి విదేశీ పర్యటనలో భాగంగా మాల్దీవులకు వెళ్లేందుకు నిన్న ఈ ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు.
*బ్యాంక్ ఆఫ్ బరోడాలో విజయా బ్యాంక్, దేనా బ్యాంకుల విలీనం తర్వాత దాదాపు రూ.9వేల కోట్ల ఎన్‌పీఏలను ఎన్‌సీఎల్‌టీకి తీసుకెళ్లారు.
కొచ్చి పిచ్చి పిచ్చిగా నచ్చి…-వాణిజ్యం-06/10
Related tags :