DailyDose

₹35 కోట్ల వెండి స్వాధీనం–నేరవార్తలు–06/10

June 10 2019 - Daily Crime News - 8000 Kilos Of Silver Seized In Boyinpally India

* తూర్పుగోదావరి జిల్లా శంఖవరం మండలం అన్నవరంలో విషాద ఘటన సోమవారం చోటుచేసుకుంది. తల్లీ ఇద్దరు పిల్లలు విషాహారం తిని అనుమానాస్పదంగా మృతిచెందారు.
* ఏపీ ప్రజల వ్యక్తిగత డాటాను చోరీ చేసిన కేసులో నిందితుడైన ఐటీ గ్రిడ్స్ సంస్థ సీఈవో అశోక్‌కు బెయిల్‌ మంజూరు అయింది. షరతులతో కూడిన బెయిల్‌ను హైకోర్టు మంజూరు చేసింది. వారానికి ఒక రోజు పోలీసుల ఎదుట విచారణకు హాజరు కావాలని ఆశోక్‌ను ఆదేశించింది. అత్యంత కీలకమైన ఓటర్, ఆధార్, వ్యక్తిగత సమాచారాన్ని చోరీ చేశారని ఐటీ గ్రిడ్స్‌ పై డేటా విశ్లేషకులు టి.లోకేశ్వర్‌రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు అశోక్‌పై సంజీవ్‌రెడ్డినగర్, మాదాపూర్‌ పోలీస్‌స్టేషన్లలో కేసులు నమోదైన విషయం తెలిసిందే.
*లిక్కర్ కింగ్ విజయ మాల్యాకు చుక్కెదురైంది. ప్రేక్షకులు చేసిన నినాదాలతో అతని ముఖం చిన్నబోయింది. భారతీయ బ్యాంకులకు వేల కోట్ల రుణాలను ఎగ్గొట్టి లండన్ లో తలదాచుకున్న విజయ్ మాల్యా ఆదివారం ఓవల్ మైదానంలో జరిగిన భారత్-ఆస్ట్రేలియా వరల్డ్ కప్ మ్యాచ్ లో ప్రత్యక్షమయ్యాడు. ఈక్రమంలో మ్యాచ్ చూసేందుకు వచ్చిన భారతీయులు అతన్ని గమనించి వెంటనే చోర్ చోర్ అంటూ నినాదాలు చేశారు. దాంతో మాల్య అక్కడి నుండి మెల్లిగా జారుకున్నారు.
* లండన్‌లో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఓ రెసిడెన్షియల్ ప్లాట్స్‌ లో మంటలు చెలరేగాయి. చూస్తుండగానే అన్ని ప్లాట్స్‌ కు మంటలు వ్యాపించాయి. అందులో నివాసముంటున్న వారు భయంతో పరుగులు పెట్టారు. మొత్తం ఆరు అంతస్థులు ఉన్న ఈ నివాస సముదాయం మంటలకు పూర్తిగా కాలిపోయింది.
* సికింద్రాబాద్‌ సమీపంలో భారీగా తరలిస్తున్న వెండిని పోలీసులు పట్టుకున్నారు. బోయినపల్లి పోలీస్‌స్టేషన్‌ పరిధిలో సుమారు 8వేల కిలోల వెండి కడ్డీలతో వెళ్తున్న కంటైనర్‌ను సీఐ రాజేష్‌ తన బృందంతో గుర్తించారు.
* సికింద్రాబాద్‌ సమీపంలో భారీగా తరలిస్తున్న వెండిని పోలీసులు పట్టుకున్నారు. బోయినపల్లి పోలీస్‌స్టేషన్‌ పరిధిలో సుమారు 8వేల కిలోల వెండి కడ్డీలతో వెళ్తున్న కంటైనర్‌ను సీఐ రాజేష్‌ తన బృందంతో గుర్తించారు.
* ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో నకిలీ పత్తి విత్తనాలు సరఫరా చేస్తున్న ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల నుంచి 310 విత్తన ప్యాకెట్లు, 12 కేజీల లూజ్ నకిలీ విత్తనాలు స్వాధీనం చేసుకున్నారు.
* కర్నూలు జిల్లా నంద్యాలలో విషాదం చోటు చేసుకుంది. నిద్రిస్తున్న వ్యక్తిపై క్రేన్‌ వెళ్లడంతో అతడు అక్కడికక్కడే మృతి చెందాడు.
* యాదగిరిగుట్ట ఆర్టీసీ డిపోలో ప్రమాదం జరిగింది. డిపోలో బస్సు ఢీకొని ఆర్టీసీ డ్రైవర్ నరేశ్(35) మృతి చెందాడు. బస్సును రివర్స్ చేస్తున్న బస్సు డ్రైవర్ నరేశ్‌ను చూసుకోలేదు. దీంతో బస్సు నరేశ్‌ను ఢీకొడుతూ వెనక్కి వెళ్లింది.
* జార్ఖండ్‌లోని హజారీబాగ్ వద్ద ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. జాతీయ రహదారిపై జరిగిన రోడ్డుప్రమాదంలో 11 మంది మృతి చెందారు. మరో 25 మంది తీవ్రంగా గాయపడ్డారు.
* విశాఖపట్నం అక్కిరెడ్డిపాలెంకు చెందిన బాలుడు సింగపూర్‌లో ప్రమాదవశాత్తూ స్విమ్మింగ్ పూల్‌లో పడి మృతి చెందాడు. వనామాడ శ్రీనివాసరావు సింగపూర్‌లో ఓ ప్రైవేట్ కంపెనీలో 20 సంవత్సరాలుగా పనిచేస్తున్నారు. అక్కడ తన 3 ఏళ్ళ చిన్నకుమారుడు వనామాడ హార్దిక్ ఆడుకుంటూ ప్రమాదవశాత్తూ స్విమ్మింగ్ పూల్‌లో జారిపడ్డాడు. తలకు తీవ్రగాయమవ్వడంతో ఆసుపత్రిలో చేర్పించగా, చికిత్స పొందుతూ మృతిచెందాడు. హార్దిక్ పార్థివ దేహాన్ని సోమవారం స్వస్థలానికి బంధువులు తీసుకు వచ్చారు.
* జార్ఖండ్‌లోని హజారీబాగ్‌ చాపహరణ్‌ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో 11 మంది మృతి చెందగా 26 మంది గాయపడ్డారు. దనువాఘాట్‌ జీటీ రోడ్డుపై తెల్లవారు జామున 3.30 గంటల సమయంలో ఆగి ఉన్న లారీని బస్సు ఢీకొనడతో ఈ ప్రమాదం చోటు చేసుకొంది.
*కడప జిల్లా జమ్మలమడుగు పాత బస్టాండులో పట్టపగలే మందుబాబులు రెచ్చిపోయారు. మద్యం తాగి ద్విచక్ర వాహనాన్ని వేగంగా నడుపుతుంటే వారించినందుకు మఫ్టీలో ఉన్న ఎస్‌ఐపై దాడికి పాల్పడ్డారు.
*శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలో ఆదివారం సాయంత్రం కొన్నిప్రాంతాల్లో గాలివానతో కూడిన పిడుగులు ప్రజల్ని భయభ్రాంతులకు గురిచేశాయి.
*ఒక యువకుడి డ్రైవింగ్‌ సరదా రెండేళ్ల చిన్నారి సహా ఇద్దరి ప్రాణాలు తీయగా మరో ఇద్దరిని క్షతగాత్రులను చేసింది. హైదరాబాద్‌ జీడిమెట్ల పోలీసుస్టేషన్‌ పరిధిలో శనివారం రాత్రి ఈ విషాదం చోటుచేసుకుంది.
*విజయవాడ, పరిసర ప్రాంతాల్లోని ఇంజినీరింగ్‌ కళాశాలలు కేంద్రంగా గంజాయి విక్రయిస్తున్న ఓ ముఠాను విజయవాడ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు ఆదివారం వలపన్ని పట్టుకున్నారు. విద్యార్థులకు గంజాయి విక్రయిస్తున్నట్లు సమాచారం రావడంతో నిఘా పెట్టిన పోలీసులు
*తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం మండలం బి.కొత్తూరులో తెదేపా, వైకాపా వర్గీయుల మధ్య ఆదివారం సాయంత్రం జరిగిన ఘర్షణలో 13 మంది గాయపడ్డారు.
*అనంతపురంలోని ప్రభుత్వ సర్వజన ఆస్పత్రి నవజాత వైద్య చికిత్స కేంద్రంలో ఆదివారం ఒక్కరోజే ఆరుగురు శిశువులు మృత్యువాత పడ్డారు.
*వ్యాపారులు, కూలీలతో వారపు సంత రద్దీగా ఉన్న సమయంలో రైసుమిల్లు గోడ కూలటంతో, ఆ పక్కన వ్యాపారం చేసుకుంటున్న నలుగురు మృతిచెందారు. తీవ్రంగా గాయపడిన మరో ముగ్గురు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటన ఢెంకనాల్‌ జిల్లా అలసువా సంతలో ఆదివారం ఉదయం చోటుచేసుకుంది.
*మానసిక వికలాంగురాలయిన ఓ బాలికపై అత్యాచారానికి పాల్పడ్డారన్న ఆరోపణపై ఐదుగురిని ఎమ్మిగనూరు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
*రోడ్డు ప్రమాదంలో గాయపడి ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నవారిని జిల్లా ప్రభుత్వాసుపత్రికి తరలించే క్రమంలో మరో రోడ్డుప్రమాదానికి గురైన విషాదమిది.
*ఎనిమిదేళ్ల బాలికపై అత్యాచారం చేసి, చంపేసిన ఘాతుకమిది. భోపాల్‌లోని కమలానగర్‌లో ఈ దారుణం జరిగింది. బాలిక పొరుగున ఉండే విష్ణు మొహరే (25) ఈ ఘాతుకానికి పాల్పడ్డారని పోలీసులు చెప్పారు.
*వేగంగా వస్తున్న టిప్పరు ఇద్దరు చిన్నారుల ప్రాణాలను చిదిమేసింది. విశాఖ జిల్లా పెదబయలు మండలం గంపరాయి సమీపంలో ఆదివారం ఈ ప్రమాదం చోటుచేసుకుంది.
*ఆగి ఉన్న రైల్లో మంటలు చెలరేగాయి. అసోంలోని సిల్చార్‌ రైల్వేస్టేషన్‌లో ఆదివారం ఈ ప్రమాదం జరిగింది. సిల్చార్‌ – తిరువనంతపురం మధ్య ప్రయాణించే ఎక్స్‌ప్రెస్‌ రైల్లోని ఓ బోగీలో ప్రమాదవశాత్తు మంటలు చెలరేగాయి.
*ఈ నెల 7న హైదరాబాద్ నడిబొడ్డున ప్రేమజంటపై జరిగిన హత్యాయత్నం కేసులో ఆరుగురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. మరో ఇద్దరు నిందితులు పరారీలో ఉన్నారని, త్వరలో వారిని పట్టుకుంటామని పంజాగుట్ట వెస్ట్‌జోన్ డీసీపీ ఏఆర్ శ్రీనివాస్ తెలిపారు.
*పీటల దాకా వచ్చిన వివాహ వేడుక ఓ యువకుడి కారణంగా ఆగిపోయింది. ఈ సంఘటన ఆదివారం కర్నూలు జిల్లా డోన్‌లో చోటుచేసుకుంది.
*వేగంగా వస్తున్న టిప్పరు ఇద్దరు చిన్నారుల ప్రాణాలను చిదిమేసింది. విశాఖ జిల్లా పెదబయలు మండలం గంపరాయి సమీపంలో ఆదివారం ఈ ప్రమాదం చోటుచేసుకుంది.