Movies

అందరూ మాయగాళ్లే

Pujitha Ponnada Speaks On How Kalki Team Cheated Her

‘‘తెలుగు అమ్మాయి కావాలి అని దర్శకులు అనుకున్నారు కాబట్టే ‘దర్శకుడు, రంగస్థలం, కల్కి’ సినిమాల్లో నాకు అవకాశాలు వచ్చాయి’’ అన్నారు పూజిత పొన్నాడ. కెమెరామెన్‌ నిజార్‌ షఫీ తొలిసారి దర్శకత్వం వహించిన చిత్రం ‘7’. హవీష్‌ హీరోగా, రెజీనా, నందితాశ్వేత, త్రిధాచౌదరి, అనీషా ఆంబ్రోస్, అదితీ ఆర్య, పూజిత పొన్నాడ హీరోయిన్లుగా నటించారు. రమేష్‌ వర్మ నిర్మించిన ఈ సినిమాని అభిషేక్‌ పిక్చర్స్‌ సంస్థ ఈ నెల 5న విడుదల చేస్తోంది. ఈ సందర్భంగా పూజిత పొన్నాడ చెప్పిన విశేషాలు… నా తొలి ప్రాధాన్యం ప్రేమకథకే. రొమాంటిక్‌ క్రైమ్‌ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ‘7’ చిత్రంలో నాది సస్పెన్స్‌ రోల్‌. అందుకే నా పాత్ర గురించి ఎక్కువగా రివీల్‌ చేయకూడదు. సినిమాలో ఆరుగురు హీరోయిన్లు ఉన్నప్పటికీ ఎవరి కథ వారిదే. క్లైమాక్స్‌లో మెర్జ్‌ అవుతాయి. ఈ సినిమాలో లిప్‌లాక్‌ సీన్‌ లేని హీరోయిన్‌ని నేనే అనుకుంటాను. హావీష్‌ మంచి కో స్టార్‌. ‘రాజుగాడు’ సినిమాలో చేసినప్పుడే షఫీగారితో పరిచయం.ఆయన దర్శకత్వంలో నటించడం హ్యాపీ. ఎలాంటి టీమ్‌తో వర్క్‌ చేయకూడదో ‘వేర్‌ ఈజ్‌ ద వెంకటలక్ష్మీ’ సినిమా ప్రయాణం నేర్పించింది. ఈ సినిమా చేసినందుకు రిగ్రేట్‌ ఫీల్‌ అవుతున్నాను. స్క్రిప్ట్‌ నుంచి ప్రమోషన్, రిలీజ్‌ దాకా వారు చెప్పింది ఒకటి.. చేసింది మరొకటి. ఏదీ నేను అనుకున్నట్లు జరగలేదు. ఈ సినిమాకు ముందు స్క్రిప్ట్‌ని బట్టి మాత్రమే సినిమా చేసేదాన్ని. ఇప్పుడు మూవీ టీమ్‌ని కూడా పరిశీలించుకుంటున్నాను.ప్రస్తుతం ‘కల్కి’ సినిమాలో ఓ డిఫరెంట్‌ రోల్‌ చేస్తున్నాను. తెలుగులో కీర్తీ సురేశ్‌ లీడ్‌ రోల్‌ చేయనున్న చిత్రంలో నటించనున్నా. అదేవిధంగా మరో తమిళ సినిమాకి కూడా సైన్‌ చేశాను.