ScienceAndTech

ఒక మహిళ. ఒక యాప్. ఒక హవాలా!

Swiss officers identify that terrorists are using dating apps to launder money

మనీ లాండరింగ్ కొత్త పుంతలు తొక్కుతోంది. డేటింగ్ యాప్‌‌ల ద్వారా మహిళలతో పరిచయాలు పెంచుకుని, ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి మనీ లాండరింగ్ చేపడుతున్నారు. ఇలా రొమాన్స్ స్కామ్ ద్వారా పెద్ద మొత్తంలో నగదును బదలాయిస్తున్నారని స్విస్‌‌ అథారిటీలు గుర్తించాయి. ఒకప్పుడు స్విస్‌‌ పన్ను ఎగవేతదారులకు, ఉగ్రవాదుల మనీకి స్వర్గధామంగా ఉండేది. పన్ను ఎగవేసిన వాళ్లు దాచుకోవడానికి, ఉగ్రవాద కార్యకలాపాలకు నగదును సమకూర్చే కొంతమంది తమ నిధులను ఆ దేశంలోనే దాచేవారు. తమ దేశ బ్యాంక్ అకౌంట్లలో డబ్బులు దాచే వారి వివరాలను స్విస్‌‌ అసలు బయటికి చెప్పేది కాదు. కానీ ఒత్తిడి పెరగడంతో, ఇటీవల స్విట్జర్లాండ్ ఈ అకౌంట్ల సమాచారాన్ని ఇతర దేశాలకు షేర్‌‌‌‌ చేస్తోంది.స్విట్జర్లాండ్ అనుమానిత అక్రమ నగదును ఎప్పుడైతే గుర్తించడం ప్రారంభించిందో అప్పటి నుంచి పలు ఆసక్తికర విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా విడుదల చేసిన వార్షిక రిపోర్ట్‌‌లో మనీ లాండరింగ్ రిపోర్టింగ్ ఆఫీసు స్విట్జర్లాండ్(ఎంఆర్‌‌‌‌ఓఎస్) పలు ఆసక్తికర కేసులను అంతర్జాతీయ అథారిటీలకు షేర్ చేసింది. స్విట్జర్లాండ్‌‌లో నివసించే ఒక ఆఫ్రికన్, టిండర్ యాప్ ద్వారా ఒక మహిళను పరిచయం చేసుకుని థర్డ్‌‌ పార్టీకి మనీ లాండరింగ్ చేపట్టాడని పేర్కొంది. ఆమెను వాడుకుని నగదు విత్‌‌డ్రాయల్స్ చేపట్టేవాడని తెలిసింది. ఒకవేళ మనీ విత్‌‌డ్రా చేసి థర్డ్‌‌ పార్టీకి ఇవ్వకపోతే సీరియస్ పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుందని ఆమెను బెదిరించినట్టు కూడా ఎంఆర్‌‌‌‌ఓఎస్‌‌ల విచారణలో వెల్లడైంది. ఇలా పలు కేసులు నమోదైనట్టు పేర్కొంది. మొత్తంగా 2018లో 132 అనుమానిత యాక్టివిటీ రిపోర్ట్‌‌ లు వెలుగులోకి వచ్చాయని, దీనిలో టెర్రర్ ఫైనాన్సింగ్ కూడా ఉన్నట్టు ఎంఆర్‌‌‌‌ఓఎస్ పేర్కొంది.