సాఫ్ట్ వేర్ సేవల సంస్థ విప్రో ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది. ఉద్యోగులకు వేతనాలు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ముఖ్యంగా డిజిటల్ రంగంలోని ఉద్యోగులకు భారీగా స్పెషల్ ఇంక్రిమెంట్ ఇచ్చింది. వీరితో పాటు కొత్తగా చేరిన ఉద్యోగులకు కోడా ప్రోత్సాహన రివార్డులను ప్రకటించడం విశేషం. బెంగుళూరు ప్రధాన కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న విప్రో జూనియర్ లెవెల్ ఉద్యోగుల నుంచి అయిదేళ్ళ అనుభవం కలిగిన ఉద్యోగులకు వేతనాలను పెంచింది. ముఖ్యంగా మెషిన్ లెర్నింగ్, ఆర్తిఫిసియాల్ ఇంటలిజెన్స్ వంటి టెక్నాలజీలో పని చేసేస్తోన్న ఉద్యోగులకు ప్రత్యెక ఇన్సెన్ టిప్ ప్రకటించింది. ఇండియాలోని ఆఫ్ షోర్ ఉద్యోగులు, ఆన్ లైన్ ఉద్యోగులు అమెరికా యూరోప్ లలోని ఉద్యోగులకు వేతనాలను ఆరు శాతం నుంచి ఎనిమిది శాతం మధ్య పెంచింది. సవరించిన జీతాలు జూన్ ఒకటి నుంచి అమలు చేయనుంది. సగటున ఆఫ్ షోర్ ఉద్యోగులకు హైసొంగిల్ డిజిట్ ఇంక్రిమెంట్స్ ఆన్ లైన్ ఉద్యోగులకు లో నుంచి మిడిల్ సింగిల్ డిజిట్ ఇంక్రిమెంట్ ఉంటాయి. ట్రాన్స్ పర్మేటివ్ ఫ్యూచర్ ఓరియంటెడ్ టెక్నాలజీ పై పని చేస్తున్న ప్రారంభ ఉద్యోగులకు ప్రోత్సాహకంగా ప్రత్యేకమైన ఇన్సేటివ్ లు రివార్డులు ఇవ్వనుంది.
విప్రో జీతాలు పెరిగాయి
Related tags :