* రేపటి నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. కొత్త ప్రభుత్వంలో మొదటి అసెంబ్లీ సమావేశాలకు ఇప్పటికే ఏర్పాట్లు పూర్తయ్యాయి. మొత్తం ఐదు రోజుల పాటు సమావేశాలు జరగనున్నాయి. రేపు ఉదయం 11 గంటలకు అసెంబ్లీ ప్రారంభం కానుంది. ముందుగా ఎమ్మెల్యేలతో ప్రొటెం స్పీకర్ ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. ఇక ఎల్లుండి జరగబోయే అసెంబ్లీ సమావేశంలో స్పీకర్‌గా తమ్మినేని సీతారాంను ఎన్నుకోనున్నారు. తరువాత ఈనెల 14న జరిగే ఉభయ సభలనుద్దేశించి గవర్నర్ ప్రసంగించనున్నారు. 15, 16వ తేదీల్లో శాసనసభకు సెలవులు కాగా, తిరిగి 17, 18న అసెంబ్లీ సమావేశాలు జరుగుతాయి. ఇక ఈనెల 18తో సమావేశాలు ముగుస్తాయి.
*అనీల్ ధీరూభాయ్ అంబానీ గ్రూపు చైర్మన్ అనిల్ అంబానీ కీలక ప్రకటన చేశారు. అప్పులు చెల్లించడానికి తాము పూర్తిగా కట్టుబడి ఉన్నామని ప్రకటించారు. మంగళవారం ఏర్పాటు చేసిన ఒక సమావేశంలో అనీల్ అంబానీ ఈ మేరకు హామీ ఇచ్చారు. 2018 ఏప్రిల్ మరియు మే 2019 మధ్య కాలంలో ఇప్పటికే వడ్డీ సహా రూ. 35వేల రూపాయల రుణాలను తిరిగి చెల్లించామని పేర్కొన్నారు.
* ప్రధాని నరేంద్రమోదీ అధ్యక్షతన నూతనంగా ఏర్పాటైన కేంద్ర మంత్రి మండలి రేపు సమావేశం కానుంది. ఈ భేటీలో ప్రభుత్వ విధివిధానాలపై సభ్యులకు ప్రధాని మార్గనిర్దేశం చేయనున్నారు. సహాయ మంత్రుల బాధ్యతలపైనా నిర్ణయం తీసుకోనున్నారని సమాచారం
* తిరుచానూరులోని శ్రీపద్మావతి అమ్మవారిని మంగళవారం ఉదయం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శ్రీ ఎల్వీ సుబ్రహ్మణ్యం దర్శించుకున్నారు.ఈ సందర్భంగా శ్రీ ఎల్వీ సుబ్రహ్మణ్యం మీడియాతో మాట్లాడుతూ వర్షాలు కురిసి పాడిపంటలు, పశుపక్ష్యాదులతో రాష్ట్రం సస్యశ్యామలంగా ఉండాలని అమ్మవారిని ప్రార్థించానన్నారు. అందరూ ధర్మబద్ధంగా ఉండాలని కోరారు. ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని, అందరిపైనా అమ్మవారి ఆశీస్సులు ఉండాలని కోరుకున్నట్టు చెప్పారు.
* 8 రోజుల క్రితం అదృశ్యమైన ఏఎన్-32 విమానం ఆచూకీ లభించింది. అరుణాచల్ ప్రదేశ్లోని లిపో ప్రాంతంలో విమాన శకలాలను గుర్తించారు.
* ప్రపంచకప్‌లో భాగంగా బంగ్లాదేశ్-శ్రీలంక మధ్య జరగాల్సిన మ్యాచ్‌ను వరుణుడు అడ్డుకున్నాడు. బ్రిస్టల్‌లో వర్షం ఆగకుండా కురుస్తుండడంతో ఇప్పటి వరకు టాస్ పడలేదు. పిచ్ తడవకుండా కప్పిన కవర్లపై వర్షపు నీరు పేరుకుపోయింది. దీంతో గ్రౌండ్ సిబ్బంది అలుపుసొలుపు లేకుండా నీటిని తోడుతూనే ఉన్నారు. నిన్న సౌతాంప్టన్‌లో దక్షిణాఫ్రికా-విండీస్ మధ్య జరగాల్సిన మ్యాచ్ కూడా వర్షం కారణంగా రద్దు అయింది. అంతకుముందు పాకిస్థాన్-శ్రీలంక మధ్య జరగాల్సిన మ్యాచ్‌ను వరుణుడు అడ్డుకున్నాడు. స్ కూడా పడకుండానే ఆ మ్యాచ్ రద్దు అయింది. మ్యాచ్ రద్దు కారణంగా ఒక్కో జట్టుకు ఒక్కో పాయింట్ కేటాయిస్తున్నారు.
* ప్రపంచకప్‌లో వరుస విజయాలతో జోష్ మీద ఉన్న భారత్ జట్టుకు అనుకోని ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్ శిఖర్ ధావన్ వేలి గాయంతో వరల్డ్ కప్ నుంచి అవుట్ అయ్యారు. గత ఆదివారం ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో సెంచరీ చేసిన ధావన్.. ఫీల్డింగ్ చేస్తూ వేలికి గాయం చేసుకున్నాడు. దీనితో అతనికి రెస్ట్ అవసరం కావడంతో.. మూడు వారాల పాటు గబ్బర్ వరల్డ్ కప్ మ్యాచ్‌లకు దూరం కానున్నాడు.
* మునిసిపల్ ఎన్నికలు నిర్వహించాలని హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. వార్డుల పునర్విభజన రిజర్వేషన్ల ఖరారును ప్రభుత్వం అమలు చేయడం లేదని పిటిషన్‌లో పిటిషనర్ పేర్కొన్నారు. 53 మునిసిపాలిటీలకు జులై 2తో గడువు ముగియనుంది. ఈ నేపథ్యంలో నేడు పిటిషన్‌ను హైకోర్టు విచారణకు స్వీకరించింది
*కడప పెద్ద దర్గాలో రాష్ట్ర ఉపముఖ్యమంత్రి, మైనార్టీ శాఖ మంత్రి అంజాద్ బాషా ప్రత్యేక ప్రార్థనలు చేశారు. రాష్ట్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మొదటి సారిగా కడపకు వచ్చిన అంజాద్ బాషాకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. విమానాశ్రయం నుండి కడప నగరం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. దర్గాలోని మాజర్ల వద్ద చదర్లను ఉంచి మంత్రి అంజాద్ బాషా ప్రార్థనలు నిర్వహించారు.
*ఢిల్లీలో ఎండలు మండిపోతున్నయి.. సోమవారం ఏకంగా రికార్డు స్థాయిలో 48 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. జూన్నెలలో నమోదైన ఉష్ణోగ్రతల్లో ఇదే అత్యధికమని అధికారులు చెప్పారు.
* లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన కరీంనగర్ జిల్లా మెట్ పల్లి వీఆర్వో బాపయ్య.
* వీళ్లనా ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మన ఎన్నుకున్న ఎమ్మెల్యేలు. అధికార దాహంతో అడ్డదారులు తొక్కి అక్రమంగా సంపాదించడమే ధ్యేయంగా పెట్టుకుని పదవిలోకి వచ్చే వరకు మీకోసమే నేను.. మీ బాధే నాబాధ అంటూ ప్రగల్భాలు పలికే నాయకులు.. అమ్మాయిలు కనిపిస్తే చాలు చొంగలు కార్చుకునే ఎమ్మెల్యే బాగోతం బయటికి వచ్చింది. మణిపూర్‌లో ఇన్‌స్పెక్షన్ కోసం వెళ్లిన ఎమ్మెల్యే హోటల్‌లోని రూమ్‌లో టీనేజీ అమ్మాయితో డ్యాన్స్ చేసిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
* ప్రజా పంపిణీ వ్యవస్థ (రేషన్ షాపులు) ద్వారా కేవలం ఒక్క రూపాయికే కిలో రాగులను ఇవ్వాలని ఒడిశా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో పౌష్టికాహారం, పోషక వినియోగమే లక్ష్యంగా పౌరుల అందరి ఆరోగ్యం తమ బాధ్యతగా పని చేస్తోంది ప్రభుత్వం. చీఫ్ సెక్రటరీ ఆదిత్య ప్రసాద్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో పైలట్ ప్రాజెక్టు కింద అమలు చేయాలని నిర్ణయం తీసుకున్నారు.
* తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ‘పెద్దల సభలో తెలుగు పెద్ద’ పుస్తకాన్ని ఏపీ ముఖ్యమంత్రి జగన్ ఆవిష్కరించారు. ముఖ్యఅతిథిగా జతీయ జ్యుడీషియల్ అకాడమీ డైరెక్టర్ జస్టిస్ రఘురాం, సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ జాస్తి చలమేశ్వర్, రైతు నేస్తం ఫౌండేషన్ ఛైర్మన్ యడ్లపల్లి వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
*ప్రతిష్ఠాత్మక ‘చంద్రయాన్-2’ ప్రయోగానికి భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) వడివడిగా సమాయత్తమవుతోంది. వ్యోమనౌక కూర్పు దాదాపుగా పూర్తికావొచ్చింది. తమిళనాడులోని మహేంద్రగిరిలో, బెంగళూరులోని బ్యాలాలులో తుది పరీక్షలు చోటుచేసుకుంటున్నాయి. వచ్చే నెల 9న ‘చంద్రయాన్-2’ ప్రయోగం చేపట్టాలని ఇస్రో యోచిస్తోంది. ఇందులో భాగంగా ఈ నెల 20 లేదా 21న శ్రీహరికోటలోని ప్రయోగ వేదికకు వ్యోమనౌక చేరుకోనుంది.
* నకిలీ బ్యాంకు ఖాతాల కేసులో పాకిస్థాన్ మాజీ అధ్యక్షుడు ఆసిఫ్ అలీ జర్దారీని అక్కడి పోలీసులు సోమవారం అరెస్ట్ చేశారు. నకిలీ బ్యాంకు ఖాతాల నుంచి రూ.30 మిలియన్లను జర్దారీ స్వీకరించారని ఆయనపై ఆరోపణలు ఉన్నాయి. నకిలీ బ్యాంకు ఖాతాల కేసుతో సంబంధాలున్నట్లు ఆరోపణలు రావడంతో ఇస్లామాబాద్‌లోని ఆయన నివాసంలో ఆసిఫ్‌ను అదుపులోకి తీసుకున్నారు.
*కాంగ్రెస్ శాసనసభ పక్షాన్ని తెలంగాణ రాష్ట్ర సమితి(తెరాస)లో విలీనం చేస్తూ ఈ నెల 6 న స్పీకర్ సచివాలయం జారీ చేసిన బులెటిన్‌ను సవాలు చేస్తూ కాంగ్రెస్ ఎమ్మెల్యే మల్లు భట్టి విక్రమార్క, ఎంపీ ఎన్.ఉత్తమ్ కుమార్‌రెడ్డి సోమవారం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
*స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖలో ఎన్నోఏళ్లుగా పనిచేస్తోన్న అనధికార సిబ్బందిపై వేటుపడింది. పదిరోజులుగా ఎవరూ విధులకు హాజరు కావడంలేదు. ఈ ప్రక్షాళనతో అధికారులపై పని ఒత్తిడిపెరిగినా అవినీతి తగ్గుతుందని ఉన్నతాధికారులుఅభిప్రాయపడుతున్నారు.
*తెలంగాణలో పురపాలక ఎన్నికల నేపథ్యంలో కొత్త పురపాలకచట్టం తీసుకువచ్చేందుకు రాష్ట్రప్రభుత్వం కార్యాచరణను వేగవంతం చేసింది. రాష్ట్రంలోని పురపాలక సంఘాల పాలకవర్గాల గడువు జులై మూడో తేదీతో ముగియనున్న నేపథ్యంలో సాధ్యమైనంత త్వరగా ఏకీకృత పురపాలక చట్టాన్ని తెచ్చేందుకు కసరత్తు పెంచింది.
*కొమురవెల్లి మల్లన్న సాగర్ జలాశయ ముంపు బాధితులకు పంపిణీ చేయాల్సిన చెక్కుల్లో రెండు మాయమయ్యాయి. ఆర్డీవో కార్యాలయం కేంద్రంగా ఈ అక్రమం జరిగింది. ఈ కార్యాలయంలోని సీనియర్ అసిస్టెంట్ (ఆర్డీవో సీసీ) సందీప్ వీటిని మాయం చేసినట్లుగా అధికారుల విచారణలో తేలడంతో కలెక్టర్ కృష్ణభాస్కర్ సోమవారం అతన్ని సస్పెండ్ చేశారు.
*రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 980 డిగ్రీ కళాశాలల్లో 3,83,514 సీట్లకుగాను మొత్తం 1,05,433 మంది విద్యార్థులకు సీట్లు దక్కాయి. అంటే 2,78,081 సీట్లు మిగిలిపోయాయి. మొత్తం సీట్లు పొందిన విద్యార్థుల్లో 40,375 మంది బాలురు, 65,058 మంది బాలికలు ఉన్నారు.
*రాష్ట్ర విభజన సమయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కేటాయించిన భవనాలన్నింటినీ వారం రోజుల్లోగా తెలంగాణకు అప్పగించనున్నారు. ఈ మేరకు రెండు రాష్ట్రాల అధికారులు నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌కే జోషి అధ్యక్షతన సోమవారం హైదరాబాద్‌లోని సచివాలయంలో తెలంగాణ, ఏపీ రాష్ట్ర పునర్‌వ్యవస్థీకరణ విభాగాల అధికారులు సమావేశమయ్యారు.
*గోదావరి నీటిని కృష్ణాబేసిన్‌లోకి మళ్లించడం లేదని, సాగునీటి అవకాశం లేని ప్రాంత అవసరాలకు మాత్రమే వినియోగిస్తున్నందున ఆంధ్రప్రదేశ్‌కు వాటా అన్న ప్రశ్నే తలెత్తదని తెలంగాణ పేర్కొంది.
*రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటు చేసిన 119 బీసీ గురుకులాల్లో ఈ నెల 17 నుంచి విద్యాసంవత్సరం ప్రారంభం కానుంది. కొత్త గురుకులాల్ని సంబంధిత జిల్లా మంత్రులు లేదంటే ఎమ్మెల్యేలు ప్రారంభించాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు.
*రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటు చేసిన 119 బీసీ గురుకులాల్లో ఈ నెల 17 నుంచి విద్యాసంవత్సరం ప్రారంభం కానుంది. కొత్త గురుకులాల్ని సంబంధిత జిల్లా మంత్రులు లేదంటే ఎమ్మెల్యేలు ప్రారంభించాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు.
*తెలంగాణలో విత్తన పరిశ్రమ మరింత అభివృద్ధి చెందడానికి అంతర్జాతీయ విత్తన సదస్సుల నిర్వహణ ఎంతో దోహదపడుతుందని రాష్ట్రప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) ఎస్.కె.జోషి అభిప్రాయపడ్డారు. ఈ నెల 26 నుంచి హైదరాబాద్‌లో జరిగే విత్తన సదస్సుకు సంబంధిత అధికారులందరూ పక్కా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు.
*విద్యార్థుల బడిసంచి బరువును తగ్గించడానికి 2017 జులై 12న విద్యాశాఖ జీఓ జారీచేసినా.. దాని అమలు కాగితాలకే పరిమితమైందని, ఇకనైనా అమలయ్యేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఫోరమ్ ఫర్ గుడ్ గవర్నెన్స్ కార్యదర్శి ఎం.పద్మనాభరెడ్డి కోరారు. ఈ మేరకు ఆయన సోమవారం రాష్ట్రప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌కే జోషికి లేఖ రాశారు.
*ఉపకార వేతనాలు అందించడం కోసం తెలుగు రాష్ట్రాల్లో ప్రతిభ కలిగిన విద్యార్థుల నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు సరోజినీ దామోదరన్ ఫౌండేషన్ పేర్కొంది. వార్షిక ఆదాయం రూ.2 లక్షల లోపు ఉన్న కుటుంబాల పిల్లలు అర్హులని, 2018-2019 విద్యా సంవత్సరంలో పదో తరగతిలో 90 శాతం లేదా 9 జీపీఏ మార్కులు, దివ్యాంగులైతే 7.5 జీపీఏ మించి సాధించిన వారు దరఖాస్తు చేసుకోవచ్చని ఫౌండేషన్ ప్రతినిధులు తెలిపారు.
*ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థను (ఏపీఎస్‌ఆర్టీసీ) రాష్ట్ర ప్రభుత్వంలో విలీనం చేయాలని మంత్రివర్గం నిర్ణయించింది. ఈ అంశాన్ని పర్యవేక్షించేందుకు రవాణా, ఆర్థిక శాఖ మంత్రుల నేతృత్వంలో మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటుచేసింది.
*ఆంధ్రప్రదేశ్ 15వ అసెంబ్లీ తొలి సమావేశాలు బుధవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో ఏర్పాట్లపై శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి అసెంబ్లీ ఇన్‌ఛార్జి కార్యదర్శి బాలకృష్ణమాచార్యులు, ఇతర అధికారులతో సోమవారం సమీక్షించారు. ముఖ్యమంత్రి, ప్రతిపక్షనేత ఛాంబర్ల ఏర్పాటు, వైకాపా, తెదేపా శాసనసభాపక్షాలకు కార్యాలయాల కేటాయింపు, సభా కార్యక్రమాల షెడ్యూల్ తదితర అంశాలపై ఈ సందర్భంగా చర్చించినట్లు తెలిసింది
*పాఠశాల విద్యలో ప్రస్తుతం ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి వెళ్లేందుకు రాజన్న బడిబాట కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో ప్రవేశాలకు ఈ నెల 12 నుంచి 15వరకు ఈ కార్యక్రమం నిర్వహించనున్నట్లు వెల్లడించారు.
*కాళేశ్వరం ప్రాజెక్టుకు చెందిన మేడిగడ్డ బ్యారేజీ సమీపంలో.. మహారాష్ట్ర వైపు కట్ట, కరకట్టల నిర్మాణానికి వీలుగా 10 హెక్టార్ల అటవీభూమికి అనుమతులను కేంద్ర పర్యావరణ, అటవీ మంత్రిత్వశాఖ మంజూరు చేసింది.
*ప్రమాద సంఘటనల్లో ప్రాణాలు కోల్పోయిన నిరుపేదలకు ప్రభుత్వం అందించే ఆపద్బంధు పథకం గడువును నవంబరు 1 వరకు పొడిగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. ప్రమాదం, ప్రకృతి విపత్తు, ఇతరత్రా కారణాలతో ప్రాణాలుపోయినవారికి సంబంధించి, ఈ పథకం ద్వారా జిల్లాల కలెక్టర్లు రూ.50 వేల వంతున మొత్తాలను పరిహారం కింద అందజేస్తారు.
*తెలంగాణలో విత్తన పరిశ్రమ మరింత అభివృద్ధి చెందడానికి అంతర్జాతీయ విత్తన సదస్సుల నిర్వహణ ఎంతో దోహదపడుతుందని రాష్ట్రప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) ఎస్.కె.జోషి అభిప్రాయపడ్డారు.
*శ్రీలంక సీనియర్ పేసర్ లసిత్ మలింగ ఇంట విషాదం చోటుచేసుకుంది. బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌కు సన్నద్ధమవుతోన్న మలింగకు తన అత్త మరణవార్త తెలిసింది. మంగళవారం బంగ్లాదేశ్‌తో పోరు తర్వాత మలింగ స్వదేశానికి బయలుదేరి వెళ్లనున్నట్లు శ్రీలంక క్రికెట్ బోర్డు ఒక ప్రకటనలో తెలిపింది.
రేపటి నుండి అసెంబ్లీ సమావేశాలు–తాజావార్తలు–06/11
Related tags :