Sports

పైసా ప్రయోజనం లేదు

Anupama Parameswaran Clarifies Rumors About her and Cricketer Bumrah

క్రికెటర్లు, సినిమా స్టార్లకు సంబంధించిన ఏ వార్తయినా ఇట్టే వైరల్‌ అయిపోతూ ఉంటుంది. అందులోనూ క్రికెటర్లు, నటీమణుల విషయమైతే మరీనూ. సరదాగా కలిసి డిన్నర్‌కు వెళ్లినా, పార్టీకి వెళ్లినా వారిద్దరి మధ్య ఏదో నడుస్తోందంటూ పుకార్లు వచ్చేస్తాయి. తాజాగా టీమిండియా పేసర్‌ జస్ర్పీత్‌ బుమ్రా విషయంలో ఇలాంటి వదంతులే వస్తున్నాయి. ప్రముఖ నటి అనుపమ పరమేశ్వరన్‌, బుమ్రా ప్రేమలో ఉన్నారా? అంటూ సామాజిక మాధ్యమాల్లో చర్చ జరుగుతోంది. ఇందుకు కారణం లేకపోలేదు. వీరిద్దరూ సోషల్‌మీడియాలో ఒకరినొకరు ఫాలో అవుతున్నారు. మరో విషయం ఏంటంటే.. సోషల్‌మీడియాలో బుమ్రా ఫాలో అవుతున్న ఏకైక నటి అనుపమేనట. అంతేకాదు వీరిద్దరూ పెట్టే పోస్ట్‌లను కూడా తెగ లైక్‌ చేసుకుంటూ ఉంటారట. దాంతో నెటిజన్లు వీరి గురించి గుసగుసలాడుకుంటున్నారు. అయితే ఈ వదంతులు మితిమీరకుండా అనుపమ వెంటనే ఫుల్‌స్టాప్‌ పెట్టారు. బుమ్రా తనకు మంచి స్నేహితుడని ఓ ఆంగ్ల మీడియా ద్వారా క్లారిటీ ఇచ్చారు. ఇలాంటి వదంతులు సృష్టించడం వల్ల ఎవ్వరికీ పైసా ఉపయోగం లేదని ఘాటుగా సమాధానమిచ్చారు అనుపమ.