కేరళ ఎక్స్ ప్రెస్‌లో ప్రయాణిస్తున్న నలుగురు వృద్ధులు ఎండవేడి తట్టుకోలేక ప్రాణాలు కోల్పోయారు. మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. ప్రయాణంలో ఉండగానే వీరు అస్వస్థతకు లోనయ్యారు. ఝాన్సీకి చేరుకునే సమయానికి ప్రాణాలు కొల్పోయారని అధికారులు తెలిపారు. వీరందరూ 65 ఏళ్లు దాటిన వృనద్ధులు. పోస్టమార్టమ్ నిమిత్తం మృతదేహాలను ఆసుపత్తికి తరలించినట్టు అధికారులు పేర్కొన్నారు. వారణాసి, ఆగ్రాలను సందర్శించేందుకు బయలుదేరిన బృందంలో వీరు సభ్యులు. “మేమందరం ఆగ్రా చూసి వస్తున్నాం. రైల్ బయలుదేరిన కొద్ది సేపటికే ఎండ వేడి తట్టుకోలేనంతగా పెరిగిపోయింది. ఊపిరాడట్లేదు, ఇబ్బందిగా ఉంది అంటూ కొంతమంది ప్రయాణికులు చెప్పారు. కానీ సహాయం వచ్చేలోపే వారు కుప్పకూలిపోయారు.” అంటూ బృందసభ్యుడొకరు జరిగిన విషయాన్ని చెప్పారు. డాక్టర్ల పర్యవేక్షణలో ఉన్న మరో ప్రయాణికుడి పరిస్థితి విషమంగా ఉంది.
కేరళ ఎక్స్‌ప్రెస్‌లో ఎండకు నలుగురు మృతి
Related tags :