మార్కెట్‌లో రెడీమేడ్‌గా పనస పొట్టు దొరుకుతుంది. మనకు ముక్కలుగా కావాలంటే అలాగే ముక్కలుగా కూడా అమ్ముతారు.ఇంటి దగ్గర పనస పొట్టు ఎలా చేసుకోవాలి…
*దోరగా ఉన్న పనస కాయను ముందుగా శుభ్రంగా కడగాలి
*పనసకాయ కత్తికి నువ్వుల నూనె పూసి, కాయ పైన ముళ్లుగా ఉండే భాగాన్ని అంగుళం మందంలో చెక్కేయాలి
*పనస కాయకు నిండుగా నూనె పూయాలి
*పెద్ద ముక్కలు కావాలనుకుంటే ఆ పరిమాణంలోకి కట్ చేయాలి
*పనస పొట్టు కావాలనుకుంటే, అదే కత్తితో సన్నగా పొట్టులా వచ్చేవరకు కొట్టాలి
*పొట్టులో కూడా కొద్దికొద్దిగా నువ్వుల నూనె, పసుపు కలుపుతుండాలి.
*****పనస తొనలు కావాలనుకుంటే…
*బాగా పండి, ఘుమఘుమలాడే పనస కాయను తెచ్చుకోవాలి
*పనస కాయ కత్తికి నూనె పూసి, పనస కాయను మధ్యకు చీల్చాలి
*చేతికి నూనె పూసుకుని, ఒక్కో తొనను చేతితో జాగ్రత్తగా బయటకు తీయాలి
*కొందరు పనస పెచ్చులతో కూడా పులుసు తయారుచేసుకుంటారు (సొర కాయ పులుసు మాదిరిగా)
*పనస తొనలలో ఉండే గింజలను వేరు చేసి, తగినంత ఉప్పు జత చేసి ఉడికించి తింటే రుచిగా ఉంటాయి
*వంకాయలకు ఈ గింజలు జత చేసి కూర చేస్తే రుచిగా ఉంటుంది
*పనస తొనలతో పాయసం కూడా చేసుకుంటారు
*పనస బిర్యానీ ఇప్పుడు పెళ్లిళ్లలో లేటెస్ట్ వంటకం.
తండ్రి గర గర, తల్లి పీచు పీచు, బిడ్డలు రత్యమాణిక్యాలు… ఏంటో చెప్పుకోండి చూద్దాం. పనసకాయ… అంతేగా. చిన్నప్పటి నుంచి ఈ పండుకి సంబంధించిన పొడుపు కథ వింటూనే పెరిగాం.*ప్రపంచంలోనే అతిపెద్ద పండును ఇచ్చే చెట్టు ఇదే. ఒక్కో పండు దాదాపు 35 కిలోల బరువు, 90 సెం.మీ. పొడవు, 50 సెం.మీ. వ్యాసంలో ఉంటుంది. పనస కాయను కోసేటప్పుడు చేతికి, చాకుకి కూడా తప్పనిసరిగా నూనె పూయాలి
*పనస తొనలలో అన్నిరకాల పోషకాలు ఉంటాయి
*దీనిని సంస్కృతంలో స్కంద ఫలం అంటారు
*విందు భోజనాల సమయంలో ఈ కూరను తప్పనిసరిగా తయారుచేస్తారు
*జీర్ణశక్తిని మెరుగు పరుస్తుంది
*వ్యాధినిరోధక శక్తిని పెంపొందిస్తుంది
*రక్తపోటును తగ్గిస్తుంది
*వేడి చేసిన పనస ఆకులను గాయాల మీద ఉంచితే త్వరగా ఉపశమనం లభిస్తుంది
*ధిక బరువును మలబద్దకాన్ని తగ్గిస్తుంది
*కొద్దిగా తయారయిన కాయను కోసి, పండ బెట్టుకుంటేనే పనస పండుకి రుచి
*ఇందులో పిండి పదార్థాలు, చక్కెరలు, పీచు పదార్థాలు పుష్కలంగా ఉన్నాయి
*విటమిన్ ఏ, బి 1, బి 2, బి 3, బి 5, బి 6, బి 9, విటమిన్ సి, విటమిన్ ఈ ఉన్నాయి
*ఇందులో ఉండే క్యాల్షియం శరీరంలోని ఎముకలను, కండరాలను బలోపేతం చేస్తుంది
*పనస చెక్కతో తయారైన వీణలు శ్రేష్ఠమైనవి
*చిన్న చిన్న పడవల తయారీకి పసన చెక్కను ఉపయోగిస్తారు
*పనసాకులను విస్తరాకులుగా ఉపయోగిస్తారు
*పనస ఆకులలో ఇడ్లీ పిండి వేసి, ఇడ్లీలు కూడా తయారుచేస్తారు. వీటిని పొట్టిక్కలు అంటారు
*పనస వేర్లతో ఫొటో ఫ్రేములు తయారుచేస్తారు.
ఈ వేసవిలో పనసపొట్టు కూర తప్పకుండా తినండి
Related tags :