Devotional

నేను ఆయన్ను కలవడం ఏమిటి?

Singer Sunitha Slams National Media Over Swaroopanandas Comments

శ్రీ శారదా పీఠాధిపతి స్వరూపానంద సరస్వతిని తానెప్పుడూ కలవలేదని ప్రముఖ గాయని సునీత అన్నారు. స్వరూపానంద ఓ మీడియా సంస్థకు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా మీ దగ్గరికి సినీ ప్రముఖులు కూడా వస్తుంటారు కదా? అని ప్రశ్నించగా.. చిరంజీవి, రజనీకాంత్ వస్తుంటారని ఆయన అన్నారు. అదేవిధంగా గాయని సునీత కూడా వస్తుంటారని స్వరూపానంద చెప్పారు. యూట్యూబ్‌లో ఈ ఇంటర్వ్యూ చూసిన సునీత ఫేస్‌బుక్‌ వేదికగా స్పందించారు. వీడియో క్లిప్‌ను షేర్‌ చేస్తూ.. ‘రోజూ ఎన్నో వదంతులు కనిపిస్తుంటాయి, కానీ, కొన్ని విషయాల గురించే స్పందించాల్సిన అవసరం వస్తుంది. ప్రముఖ వ్యక్తి స్వరూపానంద సరస్వతి తన వద్దకు వచ్చిన భక్తుల జాబితాలో నా పేరు ఎలా చెబుతారు?. ఓ నేషనల్‌ ఛానెల్‌లో ఇతరుల పేరును ఎలా ఉపయోగిస్తారు?.. ఆశ్చర్యంగా ఉంది’ అని పోస్ట్‌ చేశారు.