నీటిలో వ్యాయామం చేయడం చూసినంత సులభం కాదని బాలీవుడ్ నటి సోనాలి బింద్రే అన్నారు. క్యాన్సర్‌తో బాధపడుతున్న ఆమె న్యూయార్క్‌లో కీమో థెరపీ చేయించుకున్నారు. ఇటీవల ముంబయికి తిరిగొచ్చారు. ధైర్యంగా ముందడుగు వేస్తే క్యాన్సర్‌ను జయించొచ్చని బాధితుల్లో స్ఫూర్తి నింపిన ఆమె.. చికిత్సలో భాగంగా ప్రస్తుతం ఆక్వా థెరపీ తీసుకుంటున్నారు. ఇందులో భాగంగా నీటి ట్యాంక్‌లో నిల్చుని వ్యాయామం చేస్తున్న వీడియోను సోనాలి ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. దీన్ని ఉద్దేశించి ఆమె మాట్లాడుతూ.. ‘ఇది చూసినంత సులభం కాదు. నా ఆక్వా థెరపీ శిక్షణ సెషన్ కష్టంగా ఉంది. కానీ ఆరోగ్యం బాగున్నప్పుడు ఈ వ్యాయామం సులభంగా చేయగలం’ అని పోస్ట్ చేశారు.సోనాలి వీడియో చూసిన పలువురు అభిమానులు స్పందించారు. తమ అభిమాన నటి తిరిగి కోలుకోవడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. సోనాలి ప్రయాణం స్ఫూర్తిదాయకమని, ఆమె శక్తిమంతమైన మహిళని ప్రశంసించారు. ‘అంత నొప్పిని నవ్వుతో స్వీకరిస్తున్న మీకు హ్యాట్సాఫ్’ అని కామెంట్లు చేశారు.
నీటిలో అంటే మాటలు కాదు
Related tags :