DailyDose

పెద్ద కార్లల్లో అగ్రగామి డిజైర్–వాణిజ్య-06/11

Swift Dzire Sales Surge Among All Indian Sedans-Jun11 2019 Daily Business News

*దేశీయ స్టాక్ మార్కెట్లు ఇవాళ లాభాలతో ప్రారంభమయ్యి. సెన్సెక్స్ 100 పాయింట్లు లాభంతో ట్రేడింగ్ మొదలు పెట్టగా నిఫ్టి పన్నెండు పాయింట్లు లాభంతో ట్రేడ్ అవుతోంది. బ్యాంకింగ్ ఎనర్జీ ఇటీ ఎఫ్ఎంసీజీ షేర్లు లాభాల్లో ట్రేడవు తున్నాయి. అటు డాలర్ తో రూపాయి మారకం విలువ 69.46 రూపాయల వద్ద కొనసాగుతోంది.
*భారత్‌లో ఎక్కువగా అమ్ముడుపోతున్న కాంపాక్ట్‌ సెడాన్‌గా ‘డిజైర్‌’ అగ్రస్థానం కొనసాగించిందని వాహన దిగ్గజం మారుతీ సుజుకీ ఇండియా ప్రకటించింది.
*హీరో మోటోకార్ప్‌కు అరుదైన గుర్తింపు లభించింది. కంపెనీ స్ల్పెండర్‌ ఐస్మార్ట్‌ మోడల్‌కు ఇంటర్నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ ఆటోమోటివ్‌ టెక్నాలజీ (ఐసీఏటీ) బీఎస్‌-జుఖి గుర్తింపు దక్కింది.
*ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌కు ఆడిటర్లుగా వ్యవహరించిన డెలాయిట్‌, బీఎస్‌ఆర్‌ అసోసియేట్స్‌ సంస్థలను ప్రాక్టీస్‌ నుంచి అయిదేళ్ల పాటు డీబార్‌ చేయాలని కోరుతూ నేషనల్‌ కంపెనీ లా ట్రైబ్యునల్‌ (ఎన్‌సీఎల్‌టీ) వద్ద కార్పొరేట్‌ వ్యవహారాల మంత్రిత్వ శాఖ దరఖాస్తు సమర్పించింది.
*కనీస నిల్వ అవసరం లేని బేసిక్‌ ఖాతాదార్లకు చెక్‌బుక్‌తో పాటు మరిన్ని సదుపాయాలు కల్పించేందుకు బ్యాంకులకు అవకాశం లభించింది.
*తెలుగు రాష్ట్రాల్లో ఖాతాదారులను ఆకర్షించడంతోపాటు, డిపాజిట్‌ మొత్తాలను పెంచుకునేందుకు యాక్సిస్‌ బ్యాంక్‌ కొత్త శాఖలను ఏర్పాటు చేయబోతోంది.
*పెట్రోల్‌/డీజిల్‌తో నడిచే ఇంటర్నల్‌ కంబషన్‌ ఇంజిన్‌లను నిషేధించడంతో పాటు, ద్విచక్ర, త్రిచక్ర (ఆటో) వాహనాలన్నీ 2025 కల్లా పూర్తిగా విద్యుత్తుతో నడిచేలా చూడాలనుకోవడం అసాధ్యమని బజాజ్‌ ఆటో, టీవీఎస్‌ మోటార్‌ కంపెనీ పేర్కొన్నాయి.
*వాహన టైర్లు, ట్యూబులు ఉత్పత్తి చేసే అగర్వాల్‌ రబ్బర్‌ లిమిటెడ్‌ (ఏఆర్‌ఎల్‌ టైర్స్‌) తెలంగాణలో నూతన ఉత్పత్తి కేంద్రాన్ని నిర్మిస్తోంది. 40 ఎకరాల విస్తీర్ణంలో చేపడుతున్న ఈ ప్లాంటు కోసం దాదాపు రూ.225 కోట్ల పెట్టుబడిని పెడుతోంది.
*స్మార్ట్‌ ఫోన్ల సంస్థ రియల్‌మి ఈ ఏడాది చివరికల్లా 10-15% మార్కెట్‌ వాటా సాధించాలని లక్ష్యంగా విధించుకుంది.
*అమ్మకాలకు గిరాకీ అంతంతమాత్రంగా ఉండటంతో పేరుకుపోయిన నిల్వలను తగ్గించుకునేందుకు ఉత్పత్తిని నిలిపివేయాలని ఇప్యాసింజర్‌ వాహన తయారీ సంస్థలు, ద్విచక్ర వాహన కంపెనీలు నిర్ణయం తీసుకున్నాయి. వీటిల్లో మారుతీ, మహీంద్రా అండ్‌ మహీంద్రా, టాటా మోటార్స్‌ లాంటి దిగ్గజాలు ఉండటం గమనార్హం.